బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9లోకి 15 మంది కంటెస్టెంట్స్ రాగా ఇద్దరి ఎలిమినేషన్ తర్వాత మరొకరు దివ్య నిఖితా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నలుగురు ఎలిమినేట్ అయ్యారు. వారిలో శ్రేష్టి వర్మ, మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము ఉన్నారు.
ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. దాంతో పాత కంటెస్టెంట్స్ పది మంది మిగిలారు. ఇక ఆదివారం నాడు బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ 2.Oతో కొత్తగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. వారిలో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, ఆయేషా జీనత్, నిఖిల్ నాయర్, గౌరవ్, శ్రీనివాస సాయి ఉన్నారు.
వీరితో కలిపి ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఆరో వారానికి చేరిన బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఫైర్ స్టోర్మ్ అంటూ వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఆట తీరుపై ఇంటి సభ్యుల భవితవ్యం ఉండనుంది.
నామినేషన్స్ కోసం బాల్ ఆన్ ఫైర్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పైనుంచి వచ్చిన బాల్‌ను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పట్టుకుని పాత ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలి. వారు ఓల్డ్ కంటెస్టెంట్స్‌లో ఇద్దరిని సరైన కారణాలు చెప్పి నామినేట్ చేస్తారు. అందులో ఒకరిని నామినేషన్స్‌కు పంపించడం, మరొకరిని సేవ్ చేయడం బాల్ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇలా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఆట తీరుపైనే పాత ఇంటి సభ్యులు నామినేషన్స్‌లోకి వెళ్లేది, వెళ్లకపోవడం అనేది నిర్ణయించబడుతుంది. బాల్‌ను అందుకున్న నిఖిల్ నాయర్ సీరియల్ హీరోయిన్ తనూజ గౌడకు ఇస్తాడు. దాంతో ఆమె సుమన్ శెట్టి, రాము రాథోడ్‌ను నామినేట్ చేసింది. తర్వాత బాల్ రమ్య మోక్ష అందుకుని రాముకు ఇస్తుంది.
రీతూ చౌదరి, డిమాన్ పవన్‌ను రాము రాథోడ్ నామినేట్ చేశాడు. రీతూ చౌదరిని సేవ్ చేసిన రమ్య మోక్ష డిమాన్ పవన్‌ను నామినేషన్స్‌లో ఉంచతుంది. గౌరవ్ గుప్తా బాల్ అందుకుని సంజనకు ఇస్తాడు. భరణి, రామును సంజన నామినేట్ చేస్తుంది. వారిలో రామును సేవ్ చేసిన గౌరవ్ సీరియల్ నటుడు భరణిని నామినేషన్స్‌కు పంపిస్తాడు.
మరోసారి బాల్ అందుకున్న గౌరవ్ గుప్తా కమెడియన్ సుమన్ శెట్టికి అందజేస్తాడు. దాంతో తనూజ పుట్టస్వామి, సంజను సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. సంజను సేవ్ చేసి తనూజ గౌడను గౌరవ్ నామినేషన్స్‌లో ఉంచుతాడు. ఓసారి దివ్వెల మాధురి బాల్ అందుకుని రీతూ చౌదరికి ఇస్తుంది. రాము, దివ్య నిఖితాను రీతూ నామినేట్ చేస్తుంది.
వీరిలో రామును సేవ్ చేసి దివ్యను నామినేషన్స్‌కు పంపిస్తుంది దివ్వెల మాధురి. ఇలా సాగిన బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు ఉన్నారు. బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం డిమాన్ పవన్, తనూజ గౌడ, సుమన్ శెట్టి, దివ్య నిఖితా, భరణి, రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. పూర్తి ఎపిసోడ్ తర్వాత మరికొంత మంది నామినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
సంబంధిత కథనం