బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మంచి జోష్‌తో సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అంటూ మొదలైన బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారానికి చేరుకుంది. ఓనర్స్, టెనెంట్స్‌గా కంటెస్టెంట్స్ పాల్గొంటున్న బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం మరొకరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో భరణి శంకర్, హరిత హరీష్, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, ఫ్లోరా సైని, డీమోన్ పవన్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరికి నామినేషన్స్ అనంతరం ఓటింగ్ నిర్వహించారు.
అలా నిర్వహించిన బిగ్ బాస్ 9 తెలుగు రెండో వారం ఓటింగ్ ఫలితాల్లో అత్యధికంగా సుమన్ శెట్టి ఓట్లు పడగా చివరగా ఫ్లోరా సైని, మనీష్ మర్యాద నిలిచారు. బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ వీరిద్దరి మధ్య సాగింది. చివరిగా ఫ్లోరా సైని సేఫ్ అయితే.. మనిష్ మర్యాద ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ తెలుగు 9 ఈవారం ఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ సెప్టెంబర్ 20 నాడే పూర్తయిపోయింది. దీనిని ఇవాళ్టీ (సెప్టెంబర్ 21) ఎపిసోడ్‌లో చూపించనున్నారు. అయితే, బిగ్ బాస్ ప్రమోషన్స్ టైమ్‌లో తాను స్టార్టప్ ఫౌండర్ అని మనీష్ మర్యాద చెప్పాడు.
హౌజ్‌లో ప్రతి దానిపై ఓవర్‌గా థింక్ చేయడం, ప్రతి చిన్న విషయాన్ని వంద కోణాల్లో చూడటం మనీష్‌కు మైనస్ అయింది. అలాగే, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న భరణితో మనీష్ వ్యవహరించిన తీరు ఈ వారం ఆడియెన్స్‌కు నచ్చలేదని తెలుస్తోంది.
తనతోపాటు వచ్చిన కామనర్స్ ప్రియా శెట్టి, శ్రీజలను ఎక్స్‌పోజ్ చేస్తానని, ఈ వారం నామినేట్ చేస్తానని చెప్పి అలా చేస్తే మళ్లీ తన తప్పులు ఎక్కడ బయట పడతాయో అన్న భయంతో సెలబ్రిటీలను అంటే టెనెంట్స్‌ను నామినేట్ చేశాడు. ఇదే మనీష్ మర్యాద ఎలిమినేషన్‌కు దారి తీసిందని పలువురు రివ్యూవర్స్ విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉంటే, లక్షల సంపాదన ఉన్న మనీష్ మర్యాద బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ద్వారా ఎంత సంపాదించాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అగ్ని పరీక్ష ఎదుర్కొని కామనర్‌గా వచ్చిన మనీష్ మర్యాద వారానికి రూ. 60 నుంచి 70 వేల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
అంటే, ఈ లెక్కన రెండు వారాలు ఉన్న మనీష్ మర్యాద బిగ్ బాస్ 9 తెలుగు ద్వారా రూ. లక్షా 40 నుంచి లక్షా 50 వేల వరకు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ తర్వాత మనీష్ మర్యాద తన కెరీర్‌ను ఎలా మలుచుకుంటాడో చూడాలి.
సంబంధిత కథనం