బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఈ వారం పెద్ద స్ట్రోక్ ఇచ్చారు బీబీ టీమ్. గత కొద్ది వారాలుగా డబుల్ ఎలిమినేషన్ అని ప్రచారం జరిగింది. కానీ, ఐదో వారం మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ నడిచింది. డబుల్ ఎలిమినేషన్‌పై ఎలాంటి టాక్ రాలేదు. ఈ క్రమంలో సడెన్‌గా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది.
దాంతో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నుంచి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. వారిలో ఆడియెన్స్ నుంచి ఓటింగ్ తక్కువ రావడంతో ఫ్లోరా సైని అలియాస్ ఆశ సైని ఎలిమినేట్ అయింది. ఆమె తర్వాత బ్లాక్ స్టార్స్ ఉన్న వారికి టాస్క్ ఆడించారు. చివరిగా సుమన్ శెట్టి, శ్రీజ దమ్ము మిగిలారు.
వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కంటెస్టెంట్లతో ఈ ఇద్దరికి ఓట్లు వేయించారు. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టికి ఎక్కువ ఓట్లు పడటంతో దమ్ము శ్రీజ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. హౌజ్‌లో ఏదోటి చేసేయాలి, తెగ ఆడేయాలని ఎక్కువ జీల్‌తో పోటీ పడిన దమ్ము శ్రీజ ఇలా ఎలిమినేట్ అవ్వడం డబుల్ షాకింగ్‌గా అనిపించింది ఆమె అభిమానులకు.
ఐదో వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ నేపథ్యంలో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ అయిన ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ రెమ్యూనరేషన్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఈ ఇద్దరు కూడా సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగులోకి అడుగుపెట్టారు. కానీ, ఫ్లోరా సెలబ్రిటీగా అడుగుపెడితే.. అగ్ని పరీక్షలో పాస్ అయి దమ్ము శ్రీజ కామనర్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఫ్లోరా సైనికి రోజుకు రూ. 30 వేల పారితోషికం ఇచ్చారట. అంటే వారానికి రూ. 2,10,00 రెమ్యూనరేషన్ తీసుకుంది ఫ్లోరా సైని. ఈ లెక్కన ఐదు వారాలకు అంటే 35 రోజులకు ఫ్లోరా సైని బిగ్ బాస్ 9 తెలుగు ద్వారా దాదాపుగా రూ. 10 లక్షల 50 వేలు సంపాదించినట్లు సమాచారం.
ఇక కామనర్‌గా వచ్చి ఆడపులి అనిపించుకున్న దమ్ము శ్రీజకు వారానికి రూ. 60 నుంచి 70 వేల వరకు రెమ్యూనరేషన్ ఉన్నట్లు టాక్. ఈ లెక్కన 7 వారాలకు సుమారుగా రూ. 3 లక్షలు లేదా రూ. 3 లక్షల 50 వేల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.
అయితే, బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయిన ఈ ఇద్దరిలో ఎక్కువగా సంపాదించింది మాత్రం సెలబ్రిటీగా వచ్చిన ఫ్లోరా సైని అని తెలుస్తోంది. ఫ్లోరా సైని విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ తదితర తెలుగు సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది.
సంబంధిత కథనం