బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఐదో వారం పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9లోకి 15 మంది కంటెస్టెంట్స్‌గా వస్తే వారిలో ఇప్పటికీ నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మిడ్ వీక్‌లో రాయల్ కార్డ్ (వైల్డ్ కార్డ్) ఎంట్రీగా అగ్ని పరీక్ష కంటెస్టెంట్ దివ్య నిఖితా హౌజ్‌లోకి అడుగుపెట్టింది.
అలా హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారికి ఐదో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ నిర్వహించారు. అయితే, ఒక్క సింగర్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్‌ను తప్పా మిగతా 10 మంది కంటెస్టెంట్స్ అందరిని బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేశాడు. నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వడానికి వారికి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.
అలా రకరకాలుగా జరిగిన టాస్క్‌లో అంతా సేఫ్ అయ్యారు. కానీ, వారిలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, ఫ్లోరా సైని, దమ్ము శ్రీజ, సంజన ఆరుగురు మాత్రం సేఫ్ అవ్వకుండా ఎలిమినేషన్‌కు డేంజర్‌లో ఉన్నారు. ఇక వీరిని డోర్ వెనుక నిలబడి ఉండమని చెప్పారు.
వారిలో సుమన్ శెట్టి, శ్రీజ, డిమాన్ పవన్, సంజనకు నామినేషన్స్‌లో ఉన్నట్లు బోర్డ్స్ వస్తే రీతూ చౌదరి, ఫ్లోరా సైనికి మాత్రం ఎవిక్టెడ్ అనే బోర్డ్స్ దర్శనం ఇచ్చాయి. అంటే, రీతూ, ఫ్లోరా ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ నిర్వహించారు. ఈ ఇద్దరిలో అతి తక్కువ ఓటింగ్‌తో ఫ్లోరా సైని ఎలిమినేట్ అవనుంది.
అయితే, ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కాకుండా డబుల్ ఎలిమినేషన్ చేయనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. మరో ఎలిమినేటర్ కంటెస్టెంట్‌గా దుమ్ము దుమ్ము ఆడిన శ్రీజ దమ్ము మిగిలింది. ఎవిక్షన్ మెంబర్స్ కాకుండా నామినేషన్స్‌లో ఉన్న డీమాన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ దమ్ముకు ఓ టాస్క్ పెట్టారు.
ఈ టాస్క్ వల్ల శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయింది. ఓటింగ్‌తో ఎలిమినేట్ చేయాలి కానీ ఇలా టాస్క్ ద్వారా ఎలిమినేషన్ చేయడం ఏంటీ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగ్గా.. ఓటింగ్‌తో ఫ్లోరా సైని, టాస్క్‌తో దమ్ము శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.
సంబంధిత కథనం