అందరిని డైరెక్ట్ నామినేట్ చేసిన బిగ్ బాస్- ఈ వారం చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం- నామినేషన్స్‌లో ఆ ఒక్కరు తప్పా 11 మంది!-bigg boss 9 telugu nominations this week 11 contestants except ramu rathod bigg boss telugu 9 fifth week nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అందరిని డైరెక్ట్ నామినేట్ చేసిన బిగ్ బాస్- ఈ వారం చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం- నామినేషన్స్‌లో ఆ ఒక్కరు తప్పా 11 మంది!

అందరిని డైరెక్ట్ నామినేట్ చేసిన బిగ్ బాస్- ఈ వారం చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం- నామినేషన్స్‌లో ఆ ఒక్కరు తప్పా 11 మంది!

Sanjiv Kumar HT Telugu

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం కంటెస్టెంట్స్ అందరిని డైరెక్ట్ నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఆ ఒక్క కంటెస్టెంట్ తప్పా మిగతా అంతా బిగ్ బాస్ 9 తెలుగు ఐదో వారం నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే, ఈ నామినేషన్ నుంచి తప్పించుకునే ఇమ్యూనిటీ కోసం యుద్ధం చేయాలంటూ బిగ్ బాస్ పెద్ద మెలిక పెట్టాడు.

అందరిని డైరెక్ట్ నామినేట్ చేసిన బిగ్ బాస్- ఈ వారం చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం- నామినేషన్స్‌లో ఆ ఒక్కరు తప్పా 11 మంది! (Star Maa/YouTube)

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగిపోతుంది. ఐదో వారం బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ హరిత ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించిన బిగ్ బాస్ అందరిని డైరెక్ట్ నామినేట్ చేశాడు.

ఈ వారం నామినేట్ సభ్యులు

దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 అక్టోబర్ 6 ఎపిసోడ్ నాటి ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో కంటెస్టెంట్స్ అందరిని బయట గార్డెన్‌లోకి రమ్మని ఆదేశించాడు బిగ్ బాస్. "బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు" అని బిగ్ బాస్ అన్నాడు.

అప్పుడు కొంతమంది మొహాలు చూపించారు. అయితే, బిగ్ బాస్ అందరి పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. "ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది" అని బిగ్ బాస్ అనడంతో అందరూ నోరెళ్లబెట్టారు. "సంజన గారు మీ పేరు కూడా వచ్చిందా" అని రీతూ అడిగింది. "అందరూ" అని ఇమ్మాన్యూయెల్ సమాధానం ఇచ్చాడు.

నామినేషన్స్‌లో 11

"ఒక్క రాము తప్పా అందరూ ఉన్నారు" అని భరణి క్లారిటీ ఇచ్చాడు. అంటే, బిగ్ బాస్ 9 తెలుగు ఐదో వారం నామినేషన్స్‌లో రాము తప్పా మిగతా 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, రాము కెప్టెన్ అయిన కారణంగా బిగ్ బాస్ నామినేట్ చేయలేదని తెలుస్తోంది.

"ఇది చదరంగం కాదు.. రణరంగం" అని శ్రీజ, భరణి అన్నారు. తర్వాత "ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం. నామినేట్ అయిన ఇంటి సభ్యులందరూ బెడ్‌పై ఎక్కి మిగిలిన సభ్యులను ఒక్కొక్కరిని కిందకు దింపాల్సి ఉంటుంది" అని బిగ్ బాస్ మెలిక పెడతాడు. అంటే, బెడ్‌పై చివరి వరకు ఉన్నవాళ్లు నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు.

వారమంతా ఇమ్యూనిటీ పోటీ

ఇలా ఒక్కో టాస్క్ ఇస్తూ ఈ వారమంతా నామినేట్ అయిన సభ్యులంతా ఇమ్యూనిటీ కోసం పోటీ పడాల్సి ఉంటుందని బిగ్ బాస్ మాటల ద్వారా తెలుస్తోంది. ఈ బెడ్ టాస్క్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి. సంజనను నలుగురు పట్టుకుని లాక్కెళ్లారు. తర్వాత దివ్య నిఖితాను పట్టుకుని తీసుకెళ్తుంటే గొడవ చేసింది.

"నన్ను తీసేయడానికి ఏం పాయింట్ ఉంది" అని దివ్య అడిగితే.. "ఎవరికి ఏ పాయింట్ లేదు. అందరిని తీసినట్లే" అని ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. "ఒక్కరికి ధైర్యం లేదు. మీ ఫ్రెండ్షిప్‌లు పోతాయ్. మీ బాండింగ్‌లు పోతాయ్" అని దివ్య అంది.

శ్రీజ రివర్స్ పంచ్

"ధైర్యం, దమ్ము ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది. అక్కడ భరణి అన్న రాలే అంటే ఫ్రెండ్షిపా" అని రివర్స్ పంచ్ వేసింది శ్రీజ. తర్వాత బెడ్ మీద నుంచి కింద ఎవరు పడ్డారనే విషయంలో డిమోన్ పవన్, భరణి మధ్య గొడవ జరిగింది. డీమోన్ పడిపోయాడని సంచాలక్ ఫ్లోరా సైని చెప్పింది. అక్కడితో బిగ్ బాస్ 9 తెలుగు ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం