బిగ్ బాస్‌లో నాలుగో వారం మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. 28 రోజుల్లో కామనర్ హరీష్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే?-bigg boss 9 telugu elimination this week haritha harish mask man remuneration for four weeks ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్‌లో నాలుగో వారం మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. 28 రోజుల్లో కామనర్ హరీష్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే?

బిగ్ బాస్‌లో నాలుగో వారం మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. 28 రోజుల్లో కామనర్ హరీష్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే?

Sanjiv Kumar HT Telugu

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నాలుగో వారం కూడా పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. తాజాగా మరొకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం ఎలిమినేట్ అయిన మాస్క్ మ్యాన్ హరీష్ హరిత రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.

బిగ్ బాస్‌లో నాలుగో వారం మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. 28 రోజుల్లో కామనర్ హరీష్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే? (YouTube/Jio Hotstar)

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నాలుగో వారం పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు 15 మంది కంటెస్టెంట్స్‌తో లాంచ్ కాగా వారిలో ఇప్పటికీ ముగ్గురు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.

ఎలిమినేట్ అయిన ముగ్గురు

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో మొదటి వారం శ్రేష్టి వర్మ, సెకండ్ వీక్ మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. దాంతో 12 మంది హౌజ్‌లో మిగిలారు. ప్రియా ఎలిమినేట్ కాకముందే రాయల్ కార్డ్ ఎంట్రీగా దివ్య నిఖితా ఎంట్రీ ఇచ్చింది. దాంతో ప్రియా ఎలిమినేషన్ అనంతరం హౌజ్‌లో 13 మంది మిగిలారు.

నామినేషన్స్‌లో ఆరుగురు

ఈ 13 మందికి బిగ్ బాస్ తెలుగు 9 నాలుగో వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు. బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం దివ్య నిఖితా, హరీష్ హరిత, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన గల్రాని ఆరుగురు నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ ఓటింగ్ టాప్ 1

ఈ ఆరుగురికి ఓటింగ్ నిర్వహించగా.. అత్యధిక ఓట్లతో అందరికంటే టాప్ 1లో సంజన నిలిచింది. ఆ తర్వాత వరసుగా దివ్య, శ్రీజ, రీతూ చౌదరి, ఫ్లోరా సైని, హరీష్ వరుసగా ఓట్లు దక్కించుకున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. అలా అయితే, హరీష్, శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు.

సింగిల్ ఎలిమినేషన్ కారణంగా

కానీ, సింగిల్ ఎలిమినేషన్ కారణంగా కేవలం హరీష్ హరిత ఒక్కరే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళ అక్టోబర్ 5 నాటి బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్‌లో ప్రసారం చేస్తారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా

బిగ్ బాస్ నిర్వహించిన అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్‌గా హరీష్ హరిత అడుగుపెట్టాడు. మ్యాన్ ఆఫ్ హార్ట్, మ్యాన్ ఆఫ్ హ్యూమానిటీ అంటూ పలు ట్యాగ్స్ తనక తానే ఇచ్చుకుని అందరి దృష్టి తనపై పడేలా చేశాడు. చివరికి బిగ్ బాస్ 9 తెలుగులోకి కామనర్‌గా అడుగుపెట్టాడు హరీష్.

హరీష్ హరిత ఎలిమినేట్

అయితే, బిగ్ బాస్ హౌజ్‌లో అందరితో ఎక్కువగా వాదించడం, టాస్క్‌లు పెద్దగా ఆడకపోవడం, రూడ్‌గా ఉండటం మైనస్‌గా మారింది. ఈ కారణాల వల్ల హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు హరీష్‌కు వారానికి రూ. 60 వేల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

హరీష్ రెమ్యునరేషన్

ఈ లెక్కన హౌజ్ ప్రారంభం నుంచి నేటి వరకు నాలుగు వారాలు అంటే సుమారుగా 28 లేదా 29 రోజుల పాటు హరీష్ గేమ్ ఆడాడు. నాలుగు వారాల పాటు హౌజ్‌లో ఉన్న హరీష్ 28 రోజుల్లో రూ. 2 లక్షల 40 వేల వరకు డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం