బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నాలుగో వారానికి వచ్చేసింది. నాలుగో వారం బిగ్ బాస్ 9 తెలుగు కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ జరుగుతోంది. కెప్టెన్సీ కంటెండర్స్‌గా గెలిచేందుకు పవర్ కార్డ్స్ సంపాదించే గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్.
ఈ గేమ్‌లో భాగంగా హంగ్రీ హిప్పో (నీటి ఏనుగు) టాస్క్ నడుస్తోంది. దీంట్లో నీటి ఏనుగు ఉన్న బొమ్మ నోటీలో పైనుంచి పడిన బాల్స్‌ను తీసుకొచ్చి వేయాలి. బ్లూ, రెడ్, గ్రీన్ మూడు టీమ్స్‌గా కంటెస్టెంట్స్ ఆడుతున్నారు. అయితే, ఈ గేమ్ ఆడే క్రమంలో తన నడుము ఎవరో గిల్లారని, అది ఎవరో తెలిసా అని సంచాలక్‌గా ఉన్న భరణిని ఇమ్మాన్యుయెల్ అడిగాడు.
"సంచాలక్ గేమ్‌లో ఎవరో నా నడుము గిల్లారు. అది ఎవరో మీరు చెప్పాలి. నా నడుము అంతా బాగున్నంత మాత్రానా గేమ్ అడ్డుపెట్టుకుని.. ఇది పర్సనల్ అబ్యూస్‌లా నేను ఫీల్ అవుతా" అని ఇమ్మాన్యుయెల్ కామెడీ చేశాడు. దానికి అంతా నవ్వారు. "పోనీ ఎవరు గిల్లారో నీకు డౌట్ ఉందా" అని భరణి అడిగాడు.
"భరణి ఈ రౌండ్‌లో ఎవరు గెలిచారు" అని బిగ్ బాస్ అడిగాడు. "బెనిఫిట్ అవుట్ డౌట్ కింద ఆ పాయింట్‌ను నేను బ్లూ టీమ్‌కి ఇస్తున్నాను" అని భరణి చెప్పాడు. "దేన్ని కన్సిడర్ చేసి విన్నర్స్‌ను చెప్పారు" అని ఇమ్మాన్యుయెల్ అడిగాడు. "శ్రీజ చేతిలో 15, 20 శాతం బాల్ హోల్డ్స్‌లో ఉంది" అని భరణి వివరణ ఇచ్చే ప్రయ్నం చేశాడు.
"చేతిలో పట్టుకోవడం కంటే ముట్టుకుని ఉంటే అయిపోద్దా" అని ఇమ్మాన్యుయెల్ వాగ్వాదానికి దిగాడు. "నాకు న్యాయం అనిపించింది నేను చేశా" అని సీరియల్ నటుడు భరణి తెలిపాడు. "అక్కడి నుంచి పట్టుకుని వస్తే లేనిది ఇక్కడ కేవలం పట్టుంటే ఎలా అవుతుంది" అని ఇమ్మాన్యుయేల్ తన ఆవేదన చెప్పాడు.
"ఇది నా ఫైనల్ కాల్" అని భరణి కూల్‌గా తెగేసి చెప్పాడు. తర్వాత సంజన, రీతూ చౌదరి మధ్య వాగ్వాదం జరిగింది. మా స్ట్రాటజీస్ మాకుంటాయని సంజన అంటే.. కేవలం మీ ఒక్కరికి మాత్రమే ఉంటుందని రీతూ చౌదరి అంది. తర్వాత సుమన్ శెట్టి హిప్పో బొమ్మకు గుద్దుకున్నానని, దాని నోట్లోకి వెళ్లిపోయానని చెప్పాడు. అలా బిగ్ బాస్ తెలుగు 9 అక్టోబర్ 2 ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.
సంబంధిత కథనం