బిగ్ బాస్ తెలుగు 9 నుంచి మరొకరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. మొదటగా బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లోకి 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా మూడు వారాలకు ముగ్గురు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. గత వారం బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ దివ్య నిఖితా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి నాలుగో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ఇదివరకే పూర్తి అయింది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్‌ను ఇవాళ ప్రసారం చేయనున్నారు.
ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా సైని, శ్రీజ ఉన్నట్లు సమాచారం. మిగతా నామినేటేడ్ కంటెస్టెంట్స్ జాబితా తెలియరాలేదు. ఇదిలా ఉంటే, ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకోడానికి అంటే సేఫ్ అవ్వడానికి బిగ్ బాస్ ఓ గేమ్ పెట్టాడు. ఆ గేమ్‌లో గెలిచినవాళ్లు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వొచ్చని బిగ్ బాస్ ప్రకటించాడు.
దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 29 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో "నామినేషన్స్ నుంచి విముక్తి పొంది సేవ్ అయ్యేందుకు ఇంటి సభ్యులకు నేను ఇస్తున్న టాస్క్ ఇమ్యూనిటీ టాస్క్" అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. టాస్క్ రూల్స్‌ను సంచాలక్‌గా ఉన్న డిమాన్ పవన్ చదివి వినిపించాడు.
బ్లాక్‌లుగా ఉన్న వాటిని పూర్తిగా బ్రేక్ చేసి పైన ఉన్న స్టార్స్ తీసుకుని తమకు కేటాయించిన బాక్స్‌లలో వేయాలి. ఇద్దరు ఒక టీమ్‌గా పోటీ పడుతు ఈ గేమ్ ఆడతారు. అయితే, అందరూ రూల్స్ ప్రకారం ఆడకుండా ఇష్టమొచ్చినట్లుగా స్టార్స్ తీసుకొచ్చుకుంటారు.
దాంతో సంచాలక్‌గా ఉన్న డిమోన్ పవన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఇద్దరు ఫౌల్స్ చేశారు కాబట్టి ఇద్దరిలో ఎవరు విన్నర్ లేరని డిమోన్ పవన్ చెబుతాడు. దాంతో హౌజ్‌మేట్స్ షాక్ అవుతారు. నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని హౌజ్‌మేట్స్ ఇలా పోగొట్టుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్