Bigg Boss: బిగ్‌బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే - పృథ్వీకి నో ఛాన్స్ -హౌజ్‌లోకి మణికంఠ, సోనియా రీఎంట్రీ!
Bigg Boss: బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌కు ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియతో పాటు మరో ముగ్గురు హౌజ్‌మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వారితో పాటు కొందరు గెస్ట్‌లు తమ పంచ్‌లతో నవ్వించారు. ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్న పృథ్వీ, గౌతమ్ శనివారం ఎపిసోడ్‌లో సేఫ్ అయ్యా
Bigg Boss: బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్, గెస్ట్‌ల పంచ్‌లు, కామెడీతో సరదాగా సాగింది. శనివారం ఎపిసోడ్‌లో ఆరుగురు హౌస్‌మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశారు. వారితో పాటు ఒక్కో హౌజ్‌మేట్ కోసం ఒక్కో గెస్ట్ కూడా వచ్చాడు. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లెలు పావని, యాంకర్ రవి వచ్చారు.
పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, లవర్ దర్శిని గౌడ రాగా...గౌతమ్ కోసం అతడి తల్లితో పాటు బిగ్‌బాస్ సోహెల్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ప్రేరణ కోసం ఆమె తల్లితో పాటు చెల్లి కూడా వచ్చింది. వారితో పాటు టీవీ సీరియల్ నటి ప్రియ కూడా గెస్ట్‌గా సందడి చేసింది. నబీల్ గురించి అతడి సోదరుడితో పాటు బోలే వచ్చారు.
నిఖిల్ టాప్...
ముందుగా ప్రేరణ ఫ్యామిలీ స్టేజ్‌పైకి వచ్చారు. ప్రేరణ కాకుండా హౌజ్‌లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరని ప్రేరణ తల్లిని నాగార్జున అడిగారు. నిఖిల్,నబీల్, గౌతమ్, యష్మి రోహిణి పేర్లు చెప్పింది. వీరంతా ప్రేరణ తర్వాతే ఉన్నారని అన్నది. ప్రేరణ చెల్లెలు ప్రాకృతితో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని నాగార్జున స్టేజ్‌పై ప్రకటించాడు. బిగ్‌బాస్ స్టేజ్‌పై డ్యానర్స్‌గా తన జర్నీ మొదలైందని, ఇప్పుడు మిస్ ఇండియా తెలంగాణ సెలెక్ట్ అయినట్లు ప్రేరణ చెల్లెలు చెప్పింది. ఈ సీజన్‌లో బెస్ట్ మెగా చీఫ్ ప్రేరణనే అంటూ ప్రియ అన్నది.
యాంకర్ రవితో విష్ణుప్రియ వాదన...
విష్ణుప్రియ కోసం చెల్లెలు పావని, యాంకర్ రవి వచ్చారు. వచ్చి రాగానే విష్ణుప్రియపై పంచ్‌లు వేసి రవి నవ్వించాడు. పోనుపోను ఆటలో విష్ణుప్రియ కిందికి జారిపోతున్నదని రవి అన్నాడు. ఇంకా నాలుగు వారాలే టైమ్ మిగిలుందని, లవ్వు గురించి కాకుండా గేమ్‌పై ఫోకస్ చేస్తే బాగుంటుందని విష్ణుప్రియకు రవి క్లాస్ ఇచ్చాడు. కానీ తనకు పృథ్వీనే ఎక్కువ అంటూ రవితో విష్ణుప్రియ వాదించింది.
నీ గేమ్ నువ్వు ఆడు...సో కాల్డ్ పీ గురించి వదిలేయ్ అంటూ విష్ణుప్రియ చెల్లెలు పావని అన్నది. ఇద్దరు చెప్పిన మాటల్ని విష్ణుప్రియ పెద్దగా పట్టించుకోలేదు. హౌజ్‌లో గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ, రోహిణి టాప్ ఫైవ్ అని విష్ణుప్రియ చెల్లెలు అన్నది.
రోహిణి కంటే అందగత్తె దొరుకుతుందా...
రోహిణి కోసం ఆమె తండ్రితో శివాజీ స్టేజ్‌పైకి వచ్చారు. నిజాయితీగా ఆడితే విన్నర్ కాకపోయినా ఆడియెన్స్ హృదయాలను గెలుచుకోవచ్చని శివాజీ అన్నాడు.గౌతమ్ గురించే రోహిణి చాలా గ్లామర్‌గా తయారైందని, నీకు అంత కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా అంటూ శివాజీ పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. యష్మి, గౌతమ్ లవ్ ట్రాక్‌ను టచ్ చేశాడు శివాజీ. యష్మిని ట్రై చేశావు...వర్కవుట్ కాకపోవడంతో అక్కా అని పిలిచిన సంగతి గుర్తుచేశాడు. శివాజీ టాప్ ఫైవ్ లిస్ట్‌లో విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. నబీల్, నిఖిల్, గౌతమ్, తేజ ఉన్నట్లు తెలిపాడు.
పృథ్వీ లవర్...
పృథ్వీ కోసం ఆమె లవర్ దర్శిని గౌడతో పాటు తమ్ముడు విక్రమ్ వచ్చారు. వచ్చిరావడంతోనే మోక్షబాబు అంటూ పృథ్వీని రొమాంటిక్ పిలిచింది దర్శిని గౌడ. పృథ్వీ జెన్యూన్‌గా ఆడుతున్నాడని అన్నది. పృథ్వీని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు థాంక్స్ అంటూ విష్ణుప్రియకు చెప్పింది దర్శిని గౌడ. నామినేషన్స్ నుంచి పృథ్వీనీ సేవ్ చేసింది దర్శిని గౌడ. టాప్ ఫైవ్‌గా నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ పేర్లు చెప్పాడు పృథ్వీ బ్రదర్ అన్నాడు.
వైల్డ్ కార్డ్ ద్వారా…
గౌతమ్ కోసం వచ్చిన సోహెల్...వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అల్లాడిస్తున్నావంటూ ప్రశంసించాడు. గౌతమ్ తప్పకుండా టైటిల్ గెలవాలని సోహెల్ అన్నాడు. ఆ తర్వాత ఇచ్చిన టాస్క్‌లో గౌతమ్‌ను అతడి తల్లి నామినేషన్స్ నుంచి సేఫ్ చేసింది. నబీల్, నిఖిల్ ప్రేరణ, తేజ, అవినాష్ టాప్ ఫైవ్‌లో ఉన్నట్లు గౌతమ్ తల్లి చెప్పింది. ఆ తర్వాత నబీల్ బ్రదర్ టాప్ ఫైవ్‌గా నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ విష్ణుప్రియ ఉన్నట్లు చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ టాప్ ఫైవ్‌లో పృథ్వీ పేరును మాత్రం ఎవరూ చెప్పలేదు. సండే ఎపిసోడ్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌజ్‌లోకి రానున్నారు.
పాత కంటెస్టెంట్స్...
నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎపిసోడ్‌కు బిగ్‌బాస్ 8 నుంచి ఎలిమినేట్ అయిన మణికంఠ, సోనియా, కిరాక్ సీత, అభయ్, బేబక్క, శేఖర్ బాషా తిరిగి హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.