Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు అమ్మాయిని చూస్తానన్న విష్ణుప్రియ తండ్రి.. హౌజ్‌లో అన్నీ ఉత్తుత్తి ప్రేమలే అంటూ..-bigg boss 8 telugu today promo vishnupriya father about prithvi tasty teja rohini ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు అమ్మాయిని చూస్తానన్న విష్ణుప్రియ తండ్రి.. హౌజ్‌లో అన్నీ ఉత్తుత్తి ప్రేమలే అంటూ..

Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు అమ్మాయిని చూస్తానన్న విష్ణుప్రియ తండ్రి.. హౌజ్‌లో అన్నీ ఉత్తుత్తి ప్రేమలే అంటూ..

Hari Prasad S HT Telugu
Nov 14, 2024 11:02 AM IST

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు ఫ్యామిలీ వీక్ లో భాగంగా గురువారం (నవంబర్ 14) విష్ణుప్రియ తండ్రి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా టేస్జీ తేజకు అమ్మాయిని చూస్తానంటూనే.. హౌజ్‌లో ప్రేమలన్నీ ఉత్తుత్తివే అని ఆయన అనడం విశేషం.

టేస్టీ తేజకు అమ్మాయిని చూస్తానన్న విష్ణుప్రియ తండ్రి.. హౌజ్‌లో అన్నీ ఉత్తుత్తి ప్రేమలే అంటూ..
టేస్టీ తేజకు అమ్మాయిని చూస్తానన్న విష్ణుప్రియ తండ్రి.. హౌజ్‌లో అన్నీ ఉత్తుత్తి ప్రేమలే అంటూ..

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ వరుసగా సర్‌ప్రైజ్ లు ఇస్తున్న సంగతి తెలుసు కదా. ప్రతి రోజూ ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ను హౌజ్ లోకి కాసేపు పంపిస్తున్నారు. అలా గురువారం (నవంబర్ 14) కూడా విష్ణుప్రియ తండ్రి హౌజ్ లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. ఆయనతో హౌజ్ మేట్స్ సరదాగా, ఎమోషనల్ గా గడిపిన క్షణాలను ఇందులో చూపించారు.

విష్ణుప్రియకు సర్‌ప్రైజ్

బిగ్ బాస్ 8 తెలుగు ఫ్యామిలీ వీక్ లో భాగంగా గురువారం విష్ణుప్రియకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆమె తండ్రి హౌజ్ లోకి వచ్చారు. ఆయనను చూడగానే నాన్నా అంటూ ఆమె పరుగెత్తికెళ్లి హగ్ చేసుకొని కిస్ ఇచ్చింది.

ఆ తర్వాత ఆయన అందరి ముందూ నువ్వు బాగా ఆడాలని చెప్పడంతో.. అవన్నీ ఇక్కడ చెప్పొద్దు.. పర్సనల్ గా మాట్లాడుకుందామని చెబుతుంది. ఇక విష్ణుప్రియ హౌజ్ లో ఎక్కడ తప్పు చేస్తోంది? బయటకు ఆమె గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలను ఆమె తండ్రి వివరించారు.

హౌజ్‌లో ఉత్తుత్తి ప్రేమలే కదా..

బిగ్ బాస్ హౌజ్ లో జరిగేవంతా ఉత్తుత్తివే కదా అని ఈ సందర్భంగా విష్ణుప్రియ తండ్రి అనడంతో అంతా పెద్దగా నవ్వారు. ఆయన అలా అనడానికి ఓ కారణం ఉంది. హౌజ్ లో అందరితో మాట్లాడుతూ విష్ణుప్రియ తండ్రి కాస్త ఎమోషనల్ అయ్యారు. గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటూ వాళ్లకు అన్యాయం చేశానని చెప్పారు.

దీనికి టేస్టీ తేజ స్పందిస్తూ.. దానిని సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.. ఆమె ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లండంటూ చెబుతాడు. దీనికి విష్ణుప్రియ సిగ్గుపడుతుండగా.. ఆమెకు నచ్చిన వాడు దొరికాలిగా అని ఆమె తండ్రి అంటాడు. అది విని అందరూ నవ్వుతుంటే.. పృథ్వీతో ఆమె ప్రేమాయణం గురించే అనుకొని.. హౌజ్ లో జరిగేవన్నీ ఊరకే జరిగేవే కదా అని ఆయన అన్నారు. దీంతో ఆ పక్కనే ఉన్న పృథ్వీ కూడా నవ్వుతూ కనిపించాడు.

అమ్మాయిని చూడమన్న టేస్టీ తేజ

మనం మనం ఒక ఊరు.. నాకో అమ్మాయిని చూడండి అని టేస్టీ తేజ.. విష్ణుప్రియ తండ్రిని అడుగుతాడు. దీంతో ఆ పక్కనే ఉన్న రోహిణి నీకు అవదులే అంటుంది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ఓ 20 పుల్అప్స్ చేసి చూపించు.. అప్పుడు చూద్దామంటారు.

అతి కష్టమ్మీద చేస్తున్న టేస్టీ తేజకు గౌతమ్ హెల్ప్ చేస్తాడు. ఇలా బిగ్ బాస్ 8 తెలుగు ఈరోజు (నవంబర్ 14) ఎపిసోడ్ ప్రోమో సరదాగా సాగిపోయింది. ఇప్పటికే నబీల్, యష్మి, గౌతమ్ లాంటి వాళ్ల పేరెంట్స్ హౌజ్ లోకి వచ్చి వాళ్లతో కాసేపు గడిపి వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లో రానున్న రోజుల్లో మరి ఇంకెవరెవరికి సర్‌ప్రైజ్ లు ఉంటాయో చూడాలి.

Whats_app_banner