Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో చివరి మెగా చీఫ్ కావడానికి కిందా మీదా పడి కొట్టుకున్న పృథ్వీ, అవినాష్.. ప్రోమో
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో చివరిసారి మెగా చీఫ్ కావడం కోసం పృథ్వీ, అవినాష్ కిందామీదా పడుతూ కొట్టుకున్నంత పని చేశారు. దీనికోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాస్తా చివరికి తీవ్ర స్థాయికి చేరి యష్మి, విష్ణుప్రియ మధ్య పెద్ద చిచ్చే పెట్టింది.
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ చివరి దశకు చేరుకుంది. సెమీఫినాలే వీక్ లో చివరిసారి మెగా చీఫ్ కావడానికి కంటెస్టెంట్లకు మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే దీనికోసం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్లు కిందామీదా పడి కొట్టుకున్నంత పని చేయడం గమనార్హం. బుధవారం (నవంబర్ 20) రాత్రి టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
బిగ్ బాస్ 8 తెలుగు ఈరోజు ప్రోమో
బిగ్ బాస్ 8 తెలుగు చివరి దశకు వస్తున్న కొద్దీ షోని రక్తి కట్టించేందుకు నిర్వాహకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. హౌజ్ లో నుంచి వెళ్లిపోయిన వాళ్లతో ఈ వారం నామినేషన్లు చేయించిన బిగ్ బాస్.. తాజాగా ఈ సీజన్ చివరి మెగా ఛీఫ్ కావడం కోసం కంటెస్టెంట్లకు ఓ అవకాశం ఇచ్చాడు. దీనికోసం వాళ్లకో టాస్క్ ఇచ్చాడు.
ఎవరైతే చీఫ్ అవడానికి అవకాశం ఉంటుందో వాళ్ల టీషర్ట్ లను లాన్లోకి విసురుతారు. ఆ కంటెస్టెంట్ తన టీషర్ట్ ను మిగిలిన వారి నుంచి కాపాడుకుంటూ ఎదురుగా ఉన్న బొమ్మకు దానిని వేయాలి. ఆ కంటెస్టెంటే మెగా చీఫ్ అవుతారు. ఈ ఎపిసోడ్ బుధవారం (నవంబర్ 20) రాత్రి టెలికాస్ట్ కానుండగా.. తాజాగా స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది.
అవినాష్ వర్సెస్ పృథ్వీ
ఈ టాస్క్ లో భాగంగా మొదట ప్రేరణ టీషర్ట్ ను విసిరారు. దానిని ఆమె బొమ్మకు ధరించేలోపే నబీల్, యష్మిలాంటి వాళ్లు పట్టుకొని చించేశారు. ఆ తర్వాత గౌతమ్ టీషర్ట్ కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. పృథ్వీ టీషర్ట్ ను విసిరిన సమయంలో అవినాష్ కు, అతనికి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరూ కిందామీదా పడి కొట్టుకున్నంత పని చేశారు. ఎవరి టీమ్ వాళ్లకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించగా.. ప్రత్యర్థి టీమ్ ఆ టీషర్ట్ ను అందుకొని చించేయడం ఈ ప్రోమోలో కనిపిస్తోంది.
చివరికి ఈ టాస్క్ కాస్తా తీవ్రంగా మారింది. చివరికి యష్మి, విష్ణుప్రియ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బిగ్ బాస్ 8 తెలుగు సెమీఫినాలే వీక్ లో చివరి మెగాచీఫ్ గా మారి తమను తాము రక్షించుకునేది ఎవరు అన్నది ఈరోజు ఎపిసోడ్లో తేలనుంది.
మరోవైపు బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్ రెండో రోజు కూడా జరిగాయి. మంగళవారం (నవంబర్ 19) నాడు జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ వచ్చి నామినేట్ చేశారు. నాగ మణికంఠ వచ్చి మొదట నిఖిల్‌ను తర్వాత నబీల్ను నామినేట్ చేశాడు.
హౌజ్ నుంచి వెళ్తూ కంటెస్టెంట్స్‌కు విన్నర్ రేస్‌లో ఎవరున్నారే విషయం చెప్పాడు. గౌతమ్, నిఖిల్, నబీల్ ముగ్గురు విన్నర్ రేస్‌లో ఉన్నారని నాగ మణికంఠ చెప్పాడు.