Bigg Boss 8 Telugu: వెళ్లిపోతానన్న అవినాశ్.. డోర్ తెరిచిన బిగ్‍బాస్: వీడియో
Bigg Boss 8 Telugu Today Promo: హౌస్‍లో నుంచి వెళ్లిపోతానని అవినాశ్ సరదాగా అంటే.. బిగ్‍బాస్ నిజంగానే డోర్ తెరిచారు. దీంతో హౌస్‍మేట్స్ అతడితో ఆట ఆడుకున్నారు. ఇదంతా ఫన్నీగా సాగింది. ప్రోమో ఇక్కడ చూడండి.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ఎనిమిదో వారంలో నామినేషన్లు చాలా హీట్‍గా జరిగాయి. కొందరు కంటెస్టెంట్లు హోరాహోరోగా గొడవ పడ్డారు. రెండు ఎపిసోడ్లలో ఈ తంతు ముగిశాక నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్‍లో సరదా సన్నివేశాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. విష్ణుప్రియ అన్న మాటతో హౌస్ నుంచి బయటికి పోతానని అవినాశ్ అంటే.. బిగ్‍బాస్ నిజంగానే తలుపు తెరిచేశారు. ఈ ప్రోమోలో ఏముందంటే..
పృథ్విపై విష్ణు కామెంట్.. హౌస్‍మేట్స్ ఫన్నీ రియాక్షన్స్
పృథ్విరాజ్ మెడలో చైన్ గురించి టేస్టీ తేజ అడగటంతో ఈ ప్రోమో మొదలైంది. “పృథ్వి.. మెడలో గొలుసు ఎక్కడ తీసుకున్నావ్ బ్రో” అని టేస్టీ తేజ అడిగారు. పృథ్వి ఏదో చెప్పబోతుంటే విష్ణుప్రియ మధ్యలో కల్పించుకున్నారు. “గోల్డ్.. గోల్డ్ వేసుకొని తిరగడం ఫస్ట్ టైమ్ చూస్తాన్నా” అని పృథ్విని విష్ణుప్రియ అన్నారు. ఈ కామెంట్‍తో మిగిలిన హౌస్‍మేట్స్ షాక్ అయ్యారు. ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటూ సరదాగా అన్నారు.
ఈ కామెంట్ అసలు బాగోలేదని అవినాశ్ అన్నారు. “ఇక నేను వెళతా సార్.. ఈ వెధవ జీవితం వద్దు” అని హరితేజ ఫన్నీగా అన్నారు. నేను పోతా అంటూ నయని పావని కూడా నిలబడ్డారు. హౌస్‍లో విష్ణుప్రియ, పృథ్వి మధ్య ట్రాక్ కొన్నాళ్లుగా నడుస్తోంది. పృథ్విని విష్ణు ఇప్పుడు గోల్డ్ అనడంతో మిగిలిన హౌస్‍మేట్స్ షాక్ అయినట్టుగా ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు.
డోర్ తెరిచిన బిగ్‍బాస్
ప్యాకప్.. వెళతా అంటూ అవినాశ్.. హౌస్ డోర్ వద్దకు వెళ్లారు. దీంతో నిజంగా డోర్ ఓపెన్ చేయాలి అని నిఖిల్ అన్నారు. బిగ్‍బాస్ అప్పుడు నిజంగానే డోర్ తీశారు. దీంతో అవినాశ్ షాకయ్యారు. అవినాశ్‍ను బయటికి పంపేందుకు హౌస్‍మేట్స్ ప్రయత్నించారు. కాళ్లు, చేతులు పట్టుకొని డోర్ వద్దకు తీసుకెళ్లారు. ఇంకోసారి వెళతావా అంటూ వారించారు. ఇదంతా ఫన్నీగా సాగింది. డోర్స్ మూసేయండి అని అవినాశ్, తేజ అడిగారు.
జిమ్ ట్రైనర్‌గా అవినాశ్
అవినాశ్ జిమ్ ట్రైనర్‌గా మారి ఇంటి సభ్యులకు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్‍బాస్ ఆదేశించారు. దీంతో నేనా అన్నట్టు అతడు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఆ తర్వాత టేస్టీ తేజతో వర్కౌట్స్ చేయించారు అవినాశ్. ఇది ఫన్నీగా సాగడంతో మిగిలిన హౌస్‍మేట్స్ పగలబడి నవ్వారు. మొత్తంగా నేటి ఎపిసోడ్ సరదాగా ఉంటుందనేలా ఈ ప్రోమో ఉంది.
హరితేజను సేవ్ చేసిన గౌతమ్.. నామినేషన్లు ఇలా..
ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ ఏకంగా రెండు ఎపిసోడ్ల పాటు సాగింది. కంటెస్టెంట్లు హోరాహోరీగా కారణాలు చెబుతూ వాగ్వాదాలు చేసుకున్నారు. చాలా హాట్‍గా నామినేషన్లు సాగాయి. ముఖ్యంగా రోహిణి, పృథ్వి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది. అతడిపై రోహిణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, నామినేషన్ నుంచి ఒకరిని తప్పించే పవర్‌ను మెగాచీఫ్ గౌతమ్ కృష్ణకు బిగ్‍బాస్ ఇచ్చారు. దీంతో హరితేజను గౌతమ్ సేవ్ చేశారు. మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. మహబూబ్, ప్రేరణ, నిఖిల్, నయని పావని, పృథ్విరాజ్, విష్ణుప్రియ నామినేషన్లలో ఉన్నారు.