Bigg Boss Elimination: బిగ్‌బాస్‌లో ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ - డేంజర్ జోన్‌లో విష్ణుప్రియ, పృథ్వీ
Bigg Boss Elimination: ఈ వారం ఓటింగ్‌లో గౌతమ్, యష్మి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నారు. ఓటింగ్‌లో చివరలో ఉన్న పృథ్వీ, విష్ణుప్రియ, అవినాష్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వీక్ విష్ణుప్రియ, పృథ్వీలలో ఒకరు హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగులో ఫ్యామిలీ వీక్ మొదలైంది. మంగళవారం ఎపిసోడ్‌లోకి రోహిణి, నబీల్ ఫ్యామిలీ మెంబర్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రోహిణి తల్లి హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌పై పంచులు వేసి అందరిని నవ్వించింది. గౌతమ్, రోహిణి లవ్ స్టోరీపై రోహిణి మదర్ వేసిన పంచ్‌లు మంగలవారం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.
రోహిణి తల్లితో పాటు మేనల్లుడు కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూసి రోహిణి ఎమోషనల్ అయ్యింది. హౌజ్‌లోని అందరితో రోహిణి తల్లి మాట్లాడింది. మా అమ్మాయితో చీటికిమాటికి గొడవలు పడకు అంటూ పృథ్వీపై సెటైర్లువేసింది.
లవ్ ట్రాక్‌పై ఆరాలు...
రోహిణి పెళ్లి టాపిక్‌కు టేస్టీ తేజ ఆమె మదర్ దగ్గర తీసుకొచ్చాడు. రోహిణికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? హెల్తీబాయ్ మీకు నచ్చాడా? ఓకే అంటే చెప్పండి అని రోహిణి తల్లితో తేజ అన్నాడు. రోహిణి, గౌతమ్‌లకు ఓకే అయితే నాకు ఒకే అని కుండబద్దలు కొట్టినట్లుగా తేల్చేసింది. కానీ నువ్వు రోహిణి వెంట పడుతున్నావు...తను ఒకే అనలేదుగా అంటూ గౌతమ్‌తో రోహిణి తల్లి అన్నది.
ఇంటికి తీసుకొచ్చేయనా…
ఆమె మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక గౌతమ్ తడబడిపోయాడు. వాడు ఎప్పుడు అక్క అని పిలుస్తాడో తెలియదని, అప్పుడే ఫిక్స్ అవ్వొద్దని అవినాష్ పంచ్‌లు వేశాడు. ఆ తర్వాత రోహిణి కూడా గౌతమ్ ఎలా ఆడుతున్నాడని తల్లిని అడిగింది. బాగా ఆడుతున్నాడని ఆమె సమాధానం చెప్పగానే ఇంటికి తీసుకొచ్చేయమంటావా అంటూ ఫన్నీగా అడిగింది. గౌతమ్ ఏమైనా బొమ్మనుకుంటున్నావా అంటూ అవినాష్ సెటైర్లు వేశాడు.
మీరు బాగా ఆడుతున్నారని అవినాష్, రోహిణి, తేజలతో రోహిణి తల్లి అన్నది. కమెడియన్లకు కప్పులు రావనే భ్రమలు పెట్టుకోవద్దని, చివరి వరకు పోరాడాలని చెప్పింది. నబీల్ కూడా తన తల్లి హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ కాకుండా బాగా ఆడాలని కొడుకుకు నబీల్ తల్లి సలహా ఇచ్చింది. కప్పు గెలవాలని సూచించింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ తనకే వచ్చిన సంగతి చెప్పాడు.అంతకుముందు గిన్నెలు కడిగే విషయంలో మెగా చీఫ్ ప్రేరణతో గౌతమ్ గొడవపడ్డాడు.
గౌతమ్ టాప్...
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఓటింగ్‌లో గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. టాస్క్‌ల్లో బాగా ఆడటమే కాకుండా ప్రేరణ, నిఖిల్, పృథ్వీలతో గొడవలు అతడికి బాగా కలిసివచ్చాయి. గౌతమ్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో యష్మి ఉన్నది. నిఖిల్ ఫ్యాన్స్ ఆమెకు భారీగా సపోర్ట్ చేసినట్లు సమాచారం. టేస్టీ తేజమూడో ప్లేస్‌లో ఉన్నాడు.
డేంజర్ జోన్‌లో...
విష్ణుప్రియ తో పాటు పృథ్వీ, అవినాష్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఓటింగ్‌లో విష్ణుప్రియ చివరి ప్లేస్‌కు పడిపోయినట్లు సమాచారం. డేంజర్ జోన్‌లో ఉన్న ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పృథ్వీతో ఆమె లవ్ ట్రాక్ అంతగా వర్కవుట్ కాకపోవడం, టాస్క్‌ల్లో విఫలం కావడం విష్ణుప్రియకు మైనస్‌గా మారినట్లు చెబుతోన్నారు. పృథ్వీ కూడా తేజతో గొడవలు మైనస్‌గా మారడటంతో ఓట్లు తక్కువగా పడటానికి కారణమని అంటోన్నారు.
ఎవిక్షన్ ఫ్రీ పాస్...
విష్ణుప్రియ, పృథ్వీ తర్వాత అవినాష్‌కు కూడా తక్కువ ఓట్లు పడ్డట్లు పడినట్లు తెలిసింది. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను ఉపయోగించి అవినాష్‌ను నబీల్ సేవ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవినాష్ సేవ్ అయితే విష్ణుప్రియ, పృథ్వీలలో ఒకరు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారని సమాచారం.