Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ హౌజ్‌లో షాకింగ్ ట్విస్ట్.. మళ్లీ ఎంటరైన మాజీ కంటెస్టెంట్.. ఆ ఇద్దరూ నామినేట్
Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ హౌజ్ లో షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కోసం ఓ మాజీ కంటెస్టెంట్ హౌజ్ లోకి అడుగుపెట్టింది. ఆమె ఇద్దరి పేర్లను నామినేట్ చేస్తూ వాళ్ల తలలపై షుగర్ బాటిల్స్ పగలగొట్టింది.
Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ 8 తెలుగు షోని రక్తి కట్టించేందుకు కొత్త కొత్త ట్విస్టులు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. తాజాగా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కోసం ఈ సీజన్ మాజీ కంటెస్టెంట్ సోనియా ఆకులను హౌజ్ లోకి తీసుకురావడం విశేషం. ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ ఆమెకు కల్పించడం విశేషం.
హౌజ్‌లోకి సోనియా..
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ మొదట్లోనే హౌజ్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ సోనియా ఆకుల. అయితే నాలుగో వారమే ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ అనుకోకుండా సోమవారం (నవంబర్ 18) ఎపిసోడ్లో మరోసారి హౌజ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈసారి గేమ్ ఆడటానికి కాకుండా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కోసం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
ఈ వారం నామినేషన్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతోంది. ఎక్స్ హౌజ్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు అని అనగానే హౌజ్ లోకి సోనియా ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే హౌజ్ మేట్స్ షాకయ్యారు. ఇద్దరు సభ్యులను తగిన కారణాలు చెప్పి, వాళ్ల తలపై షుగర్ బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సోనియాకు సూచించాడు.
ప్రేరణ, నిఖిల్ నామినేట్
ఈ సందర్భంగా సోనియా తన తొలి నామినేషన్ లో ప్రేరణను ఎంచుకుంది. క్యారెక్టర్ లెస్ అనే పదం వాడావంటూ ప్రేరణ నామినేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో సోనియా వివరించింది. ఆ సమయంలో గౌతమ్ బాధ్యతారహితంగా ఉన్నాడంటూ ప్రేరణ వివరణ ఇవ్వబోగా.. గౌతమ్ సీరియస్ అయ్యాడు. నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటూ తన పేరు ఎందుకు లాగావంటూ అతడు ప్రేరణతో వాగ్వాదానికి దిగాడు.
ఆ తర్వాత నిఖిల్ పేరును సోనియా నామినేట్ చేసింది. పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావంటూ ఆమె ప్రశ్నించింది. ఆ తర్వాత నిఖిల్, యష్మి మధ్య కూడా ఓ రేంజ్ లో వాదన జరిగింది. మొత్తానికి ఈ వారం నామినేషన్ల కోసం మాజీ కంటెస్టెంట్ సోనియాను రంగంలోకి దింపి బిగ్ బాస్ ఆసక్తి రేపాడు. నామినేషన్ల ప్రక్రియ ఎప్పటిలాగే వాడివేడిగా జరిగినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ప్రేరణ, నిఖిల్ పేర్లను నామినేట్ చేస్తూ వాళ్ల తలలపై సోనియా.. షుగర్ బాటిల్స్ పగలగొట్టింది. ముఖ్యంగా నిఖిల్ తలపై చాలా కోపంగా బాటిల్ పగలగొడుతూ.. గాడ్ బ్లెస్ యూ అని సోనియా అనడం విశేషం.
మరోవైపు ఆదివారం (నవంబర్ 17) వీకెండ్ ఎపిసోడ్లో అవినాష్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయేలా కనిపించాడు. అయితే నబీల్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ ద్వారా అవినాష్ ను కాపాడాడు. అతని వల్లే తనకు ఆ షీల్డ్ వచ్చిందన్న నబీల్.. ఈ వారానికి అతన్ని రక్షించాడు. మరి ఈ వారం నామినేట్ అయిన ప్రేరణ, నిఖిల్ లలో ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.