Bigg Boss Nabeel: విష్ణుప్రియను టార్గెట్ చేసిన ప్రేరణ - నిఖిల్ త్యాగం - ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్న నబీల్
Bigg Boss Nabeel: శుక్రవారం బిగ్‌బాస్ఎపిసోడ్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇంటి సభ్యుల గొడవలు, వాదనలతో సాగింది. చివరకు ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ నబీల్‌కు దక్కింది. ప్రేరణ కోసం నిఖిల్ త్యాగానికి సిద్ధపడగా...గౌతమ్ అతడిపై సెటర్లు వేశాడు.
Bigg Boss Nabeel: బిగ్‌బాస్ తెలుగు శుక్రవారం ఎపిసోడ్‌లో మెగా చీఫ్ అయిన ప్రేరణ ఫస్ట్ డేనే బిగ్‌బాస్ ఇరికించేశాడు. కంటెస్టెంట్స్‌కు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ దక్కించుకోవడం కోసం బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. పాము తనదగ్గరున్న ఆకలి తీర్చుకోవడానికి మీ వద్ద ఉన్న గోల్డెన్ ఎగ్స్ అడుగుతుందని బిగ్‌బాస్ అన్నాడు. ఎవరి ఎగ్ అయితే పాము తినేస్తుందో వారికి షీల్డ్ దక్కదని, పాము ఎవరి ఎగ్ అయితే తినదో వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుందని బిగ్‌బాస్ అన్నాడు.
హరితేజ సెటైర్లు...
ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాకూడదని అనుకుంటున్న ఐదుగురు సభ్యులను సెలెక్ట్ చేయమని మెగా చీఫ్ ప్రేరణకు పరీక్ష పెట్టాడు బిగ్‌బాస్. విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజల ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది ప్రేరణ. మెగా చీఫ్ అయిన ప్రేరణపై గంగవ్వ ఫైర్ అయ్యింది. నీ ఫ్రెండ్స్‌ను కాపాడుకున్నావని హరితేజ పంచ్‌లు వేసింది.
ఆ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను యష్మికి దక్కకుండా అవినాష్, నబీల్ చేశారు. తనను మెగా చీఫ్ టాస్క్‌లో ఓడించిన యష్మిపై నబీల్ రివేంజ్ తీర్చుకున్నాడు. బ్రీఫ్‌కేస్ వచ్చిన తర్వాత టాస్కులు సరిగ్గా ఆడలేదని రీజన్ చెప్పారు. వారి రీజన్స్ సరిగ్గా లేవంటూ యష్మి వాదించింది. విష్ణుప్రియ, పృథ్వీ కలిసి ప్రేరణ ఎగ్‌ను తీసేశారు.
టేస్టీ తేజ బలి...
ఆ తర్వాత గౌతమ్, నిఖిల్ వంతు వచ్చింది. ప్రేరణ ఎగ్ తీయాలని గౌతమ్ సలహా ఇచ్చాడు. నిఖిల్ అందుకు ఒప్పుకోలేదు. ప్రేరణ బదులు తన ఎగ్ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. దాంతో ఇద్దరు కలిసి చాలా డిస్కస్ చేసుకొని టేస్టీ తేజ ఎగ్‌ను పాము నోటిలో వేశారు. గౌతమ్, నిఖిల్ ఇద్దరు కలిసి తనకు అన్యాయం చేశారని టేస్టీ తేజ బాధపడ్డాడు. తనకు ఎవిక్షన్ పాస్ దక్కకుండా చేసిన నిఖిల్‌పై టేస్టీ తేజ రివేంజ్ తీర్చుకున్నాడు.
నబీల్‌కు ఎవిక్షన్ పాస్...
యష్మి, టేస్టీ తేజ వంతు వచ్చినప్పుడు ...రోహిణి పేరును యష్మి చెప్పగా...నబీల్, నిఖిల్ పేర్లు చెప్పాడు తేజ. చివరకు తనకు ఎవిక్షన్ పాస్ అక్కరలేదని నిఖిల్ అనడంతో అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశారు. యష్మి కూడా రోహిణి ఎగ్ వేసింది. ఇద్దరు చెరో ఎగ్ వేయడంతో టేస్టీ తేజతో నిఖిల్, పృథ్వీ, హరితేజ గొడవపడ్డారు. చివరకు నబీల్ ఎగ్ ఒక్కటే మిగలడంతో అతడికి ఎవిక్షన్ షీల్డ్ దక్కింది.
పృథ్వీ గొడవ...
అంతకుముందు శుక్రవారం ఎపిసోడ్‌లో నబీల్, పృథ్వీ గొడవపడ్డారు. ఒకరిలోని తప్పుల్ని మరొకరు బయటపెట్టుకున్నారు. మెగా చీఫ్ టాస్క్‌లో కలిసి ఆడాలని డిసైడయిన వీరు ఆ తర్వాత ఒకరికొకరు ద్రోహం చేసుకున్నారు. వాటి ఫలితంగా ఓడిపోయారు.
ఆవినాష్, యష్మి గొడవను ఆపేసేందుకు ప్రయత్నించగా...టేస్టీ తేజ మాత్రం ఫైట్‌ను ఆపొద్దంటూ సైగలు చేశాడు. మెగా చీఫ్ అయిన ప్రేరణ...విష్ణుప్రియను టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. విష్ణుప్రియ బెడ్ దగ్గర ఉన్న సామాన్లు నీట్‌గా సర్ధుకోమని చెప్పింది. ప్రేరణ మాటల్ని విష్ణుప్రియ పట్టించుకోలేదు. దాంతో ప్రేరణనే స్వయంగా సామాన్లు సర్ధేసింది.