Bigg Boss 8 Telugu launch Live streaming: బిగ్‍బాస్ 8 గ్రాండ్ లాంచ్ రేపే.. టైమ్, టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Bigg Boss 8 Telugu Grand launch Live Streaming: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ సమీపించింది. గ్రాండ్ లాంచ్ రేపే (సెప్టెంబర్ 1) జరగనుంది. కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోనుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ టైమ్, లైవ్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
బిగ్‍బాస్ అభిమానులు వేచిచూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ రేపే (సెప్టెంబర్ 1) షురూ కానుంది. ఏడు సీజన్లు సక్సెస్ అవగా.. ఎనిమిదో సీజన్‍పై కూడా చాలా క్యూరియాసిటీ ఉంది. ఈ 8వ సీజన్‍కు కూడా టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. అన్నీ లిమిట్‍లెస్ అంటూ కొంతకాలంగా ప్రోమోలతో హైప్ పెంచేశారు నాగార్జున. రేపే ఈ బిగ్‍బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ జరగనుంది. ఈ గ్రాండ్ లాంచ్ వివరాలివే.
బిగ్‍బాస్ సీజన్ 8 గ్రాండ్‍లాంచ్: టైమ్
బిగ్‍బాస్ సీజన్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 1) జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున పరిచయం చేయనున్నారు. కంటెస్టెంట్ల ఇంట్రడక్షన్స్, డ్యాన్సులు, స్పెషల్ పర్ఫార్మెన్సులు ఉంటాయి.
టెలికాస్ట్ ఎక్కడ?
గత సీజన్లలాగానే బిగ్‍బాస్ తెలుగు 8 కూడా స్టార్ మా టీవీ ఛానెల్‍లోనే ప్రసారం అవుతుంది. రేపు (సెప్టెంబర్ 1) సాయంత్రం 7 గంటల నుంచి గ్రాండ్ లాంచ్ లైవ్ టెలికాస్ట్ స్టార్ మా ఛానెల్‍లో చూడొచ్చు. సెప్టెంబర్ 2 నుంచి ఎపిసోడ్ల టైమింగ్‍ను గ్రాండ్ లాంచ్‍లో స్టార్ మా రివీల్ చేస్తుంది.
లైవ్ స్ట్రీమింగ్
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే స్ట్రీమింగ్ అవనుంది. గ్రాండ్ లాంచ్‍ను హాట్‍స్టార్‌లో కూడా రేపు సాయంత్రం 7 గంటల నుంచి చూడొచ్చు. ఆ తర్వాతి నుంచి ఈ ఓటీటీలో 24 గంటలు బిగ్‍బాస్ ప్రసారం అవుతుంటుంది.
కంటెస్టెంట్లు వీళ్లేనా?
బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లో కంటెస్టెంట్లుగా ఎవరు వస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే కొందరి పేర్లు రూమర్ల ద్వారా బయటికి వచ్చాయి. ప్రముఖ కమెడియన్ అలీ తమ్ముడు, నటుడు ఖయ్యుం హౌస్‍లోకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. ‘లాహిరి లాహిరి లాహిరి’లో ఫేమ్ హీరో ఆదిత్య ఓం కూడా ఈ సీజన్‍లో కంటెస్టెంట్‍గా ఉండనున్నారని సమాచారం. యాంకర్ విష్ణుప్రియ కూడా ఈ సీజన్‍లో ఆడనున్నారు.
నటుడు అభయ్ నవీన్, టీవీ నటుడు నిఖల్ మలియక్కల్, నటుడు అభిరామ్ వర్మ, యూట్యూబర్లు బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, విస్మయ్ శ్రీ కూడా ఈ సీజన్‍లో కంటెస్టెంట్లుగా ఉంటారని లీకుల ద్వారా వెల్లడైంది. ఆర్జే శేఖర్ బాషా, ప్రేరణ కంభం, యష్మి గౌడ, నైనిక అనరుస, పరమేశ్వర్ హివ్రాలే, సోనియా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఉండే 14 మంది కంటెస్టెంట్లు ఎవరనేది రేపు (సెప్టెంబర్ 1) అధికారికంగా వెల్లడికానుంది. కొన్ని ఎపిసోడ్ల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొందరు కంటెస్టెంట్లు రానున్నారు.
ఒక్కసారి కమిటైతే లిమిట్ లేదంటూ కొంతకాలంగా బిగ్‍బాస్ తెలుగు 8 ప్రోమోలతో నాగార్జున హైప్ పెంచేశారు. ఈసారి ఎంటర్‌టైన్‍మెంట్, ఫన్, ట్విస్టులు, టర్నులకు లిమిటే లేదంటూ చెబుతూ వస్తున్నారు. ఈసారి ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటుందా అని కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సర్‌ప్రైజింగ్‍గా ఏమైనా ఉంటుందా అనేది చూడాలి.