Bigg Boss Telugu 8 Finale Views: దుమ్మురేపిన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే.. భారీస్థాయి వ్యూస్.. లెక్కలు ఇవే-bigg boss 8 telugu grand finale gets huge views in star maa tv channel and disney plus hotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Finale Views: దుమ్మురేపిన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే.. భారీస్థాయి వ్యూస్.. లెక్కలు ఇవే

Bigg Boss Telugu 8 Finale Views: దుమ్మురేపిన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే.. భారీస్థాయి వ్యూస్.. లెక్కలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 28, 2024 01:56 PM IST

Bigg Boss Telugu 8 Grand Finale Views: బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే భారీ వ్యూస్ దక్కించుకుంది. స్టార్ మాతో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని హోస్ట్ కింగ్ నాగార్జున నేడు వెల్లడించారు.

Bigg Boss Telugu 8 Finale Views: దుమ్మురేపిన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే.. భారీస్థాయి వ్యూస్.. లెక్కలు ఇవే
Bigg Boss Telugu 8 Finale Views: దుమ్మురేపిన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే.. భారీస్థాయి వ్యూస్.. లెక్కలు ఇవే (Disney Plus Hotstar)

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ఈనెలలోనే ముగిసింది. 105 రోజుల పాటు ఈ సీజన్ సాగింది. మొత్తంగా వైల్డ్ కార్డులను కలుపుకొని 22 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్‍లో పోటీ పడ్డారు. ఈ సీజన్‍కు ప్రారంభంలో పెద్దగా బజ్ రాకపోయినా వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్ల కంటెసెంట్స్ వచ్చాక ఆట రసవత్తరంగా మారింది. ఈనెల డిసెంబర్ 15వ తేదీన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఈ సీజన్ విన్నర్‌గా నిఖిల్ టైటిల్ సాధిస్తే.. గౌతమ్ కృష్ణ రన్నర్‌గా నిలిచాడు. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ గ్రాండ్ ఫినాలేకు వ్యూస్ భారీగా వచ్చాయి.

yearly horoscope entry point

రికార్డు స్థాయిలో వ్యూస్

బిగ్‍బాస్ 8 తెలుగుకు భారీస్థాయిలో వ్యూస్ దక్కాయి. స్టార్ మా ఛానెల్‍తో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని బిగ్‍బాస్ తెలుగు హోస్ట్, కింగ్ నాగార్జున వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీవీల్లో ఈ గ్రాండ్ ఫినాలేను 23 మిలియన్ (2.3 కోట్లు) మంది ప్రేక్షకులు చూశారు. డిజిటల్ ప్లాట్‍ఫామ్‍లో ఈ ఫినాలేకు 2 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయి.

ఈ వ్యూస్ లెక్కలతో మ్యాసివ్ ఫెనామిన్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగార్జున. సీజన్ మొత్తం వ్యూస్ విషయంలో ఒడుదొడుకులు ఎదురైనా ఫైనల్‍కు మంచి వ్యూస్ దక్కాయి. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ వచ్చారు. సందడి చేశారు. నిఖిల్‍కు ట్రోఫీ అందించారు. విజయ్ సేతుపతి, ఉపేంద్ర కూడా హాజరయ్యారు. స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సు సాగాయి.

నిఖిల్, గౌతమ్ మధ్య టఫ్ ఫైట్

బిగ్‍బాస్ 8 తెలుగు విజేతగా టీవీ సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ నిలిచాడు. అతడికి రూ.55లక్షల ప్రైజ్ మనీ దక్కింది. రెమ్యూనరేషన్‍గా మరో రూ.6.50లక్షల దాకా అందినట్టు సమాచారం. మొత్తంగా ఈ సీజన్ ద్వారా రూ.61లక్షలకుపైగా నిఖిల్ దక్కించుకున్నాడు. అతడికి మారుతీ సుజుకీ కారు కూడా లభించించింది. ఈ సీజన్‍లో సినీ యంగ్ హీరో గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో రన్నరప్‍గా నిలిచాడు. చివరి వరకు నిఖిల్, గౌతమ్ టైటిల్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ఓటింగ్‍లో నువ్వానేనా అన్నట్టు టఫ్ ఫైట్ సాగింది. చివరికి నిఖిల్ విన్నర్ అయ్యాడు. గౌతమ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఈ సీజన్‍లో మూడో స్థానంలో యూట్యూబర్ నబీల్ అఫ్రిది నిలిచాడు. నాలుగో ప్లేస్‍లో ప్రేరణ, ఐదో స్థానంలో అవినాశ్ నిలిచాడు. ఈ సీజన్‍లో గౌతమ్, అవినాశ్ వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టారు. ఫైనల్ వీక్ వరకు చేరారు.

Whats_app_banner

సంబంధిత కథనం