Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేరణ, పృథ్వీ - యష్మితో మణికంఠ గొడవ
Bigg Boss 8 Telugu: తమ టీమ్‌లను సెలెక్ట్ చేసుకునే బాధ్యతను ముగ్గురు చీఫ్స్‌కు బిగ్‌బాస్ ఇచ్చాడు. ఇందులో అభయ్ నవీన్, ప్రేరణ, పృథ్వీ...నిఖిల్‌కు హ్యాడించారు. బాత్‌రూమ్ వాడుకునే విషయంలో యష్మితో మణికంఠ గొడవపడ్డాడు.
Bigg Boss 8 Telugu: మైండ్‌బ్లాక్ సాంగ్‌తో మూడో రోజు ఫుల్ జోష్‌గా కంటెస్టెంట్స్ స్టార్ట్ చేశారు. డ్యాన్సుల్లో అందరూ పోటీపడ్డారు. ఆ తర్వాత పృథ్వీ పొరపాటుగా టూత్‌పేస్ట్ బదులుగా బ్రష్‌కు ఫేష్‌వాష్ పెట్టుకోవడంతో బిగ్‌బాస్ హౌజ్‌లో నవ్వులు పూశాయి. నిఖిల్‌తో పాటు మిగిలిన వాళ్లు అతడిని ఆటపట్టించారు. ఆ తర్వాత శేఖర్ బాషాకు బేబక్క కరాటే నేర్పించింది. సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలు చెప్పింది.
గొడవలపై క్లారిటీ...
నాగ మణికంఠతో నామినేషన్ టైమ్‌లో జరిగిన గొడవలపై విష్ణుప్రియ అతడికి క్లారిటీ ఇచ్చింది. అందరూ నిన్ను నామినేట్ చేస్తుండటంతో కృంగిపోతున్నావని నిన్ను ఓదార్చానంటూ మణికంఠతో విష్ణుప్రియ చెప్పింది. తన లైఫ్ ఏమైపోతుందో అంటూ విష్ణుప్రియతో చెబుతూ మణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన వల్ల ఇతరుల లైఫ్ ఎఫెక్ట్ కాకూడదంటూ చెప్పాడు. ప్రేరణ, విష్ణుప్రియ ఎంత చెప్పిన మణికంఠ హౌజ్‌లోని ఇతరులతో కలవలేకపోయాడు. ఏడుస్తూనే కనిపించాడు.
బిగ్‌బాస్ టాస్క్...
హౌజ్‌లోని చీఫ్స్‌కు తమ సొంత సైన్యాన్ని నిర్మించుకునే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. బేబక్క, శేఖర్ బాషా, నబీద్‌లకు మాత్రం చీఫ్ అయ్యే అవకాశం లేదని ప్రకటించాడు. నచ్చిన క్లాన్‌లో చేరే అవకాశాన్ని వారికి ఇచ్చాడు. మీరు తీసుకునే నిర్ణయం మీ ప్రయాణంపై ప్రభావాన్ని చూపొచ్చని బిగ్‌బాస్ అన్నాడు.చీఫ్స్ చైర్స్‌పై నిఖిల్, నైనిక, యష్మిగౌడ కూర్చుకున్నారు.
యష్మి టీమ్‌లో...
తొలుత శేఖర్...యష్మి టీమ్‌లో చేరుతున్నట్లుగా చెప్పాడు. నా చిట్టా మొత్తం యష్మికి తెలుసు కాబట్టి తాను ఆమె టీమ్‌లో ఉండబోతున్నట్లు వెల్లడించాడు. నిఖిల్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగున్నాయని, అందుకే అతడి టీమ్‌లో తాను చేరబోతున్నట్లు బేబక్క అన్నది. నైనిక టీమ్‌లో నబీద్ చేరాడు. మిగిలిన టీమ్‌మేట్స్‌ను సెలెక్ట్ చేసుకునే బాధ్యతను చీఫ్స్‌కు అప్పగించాడు బిగ్‌బాస్. తమ టీమ్‌లో ఉంటే ప్లస్‌లు ఏమిటో ఒక్కో చీఫ్ కంటెస్టెంట్స్ అందరికి వివరించారు.
నిఖిల్‌కు హ్యాండ్...
ప్రేరణ ను తమ టీమ్‌లో చేర్చుకునేందుకు నిఖిల్, యష్మి పోటీపడ్డారు. నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేరణ...యష్మి టీమ్‌లో చేరింది. ఆదిత్య, సీత, విష్ణుప్రియలను నైనిక తమ టీమ్‌లో చేర్చుకున్నది. ఆ తర్వాత అభయ్ నవీన్, పృథ్వీలను తన టీమ్‌లో చేరాలని నిఖిల్ కోరాడు. కానీ వారు మాత్రం యష్మి టీమ్‌లో చేరారు. చివరగా సోనియాకు ఆప్షన్ లేకపోవడంతో నిఖిల్ టీమ్‌లో చేరింది. నైనిక, యష్మి క్లాన్స్‌లో మెంబర్స్ ఎక్కువగా ఉండటంతో మీ రెండింటిలో ఏది బెస్ట్ అన్నది మీరే నిరూపించుకోవాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు.
ఆ తర్వాత గ్యాస్ హాఫ్ చేయకపోవడంతో బేబక్కకు బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. తన టవల్‌ను ఆదిత్య ఓం వాడంతో ప్రేరణ అతడిపై సీరియస్ అయ్యింది. ఆమెకు ఆదిత్య సారీ చెప్పాడు. ఆ తర్వాత బాత్‌రూమ్ యూజ్‌లో చేసే విషయంలో యష్మితో మణికంఠ గొడవ పడ్డాడు. ఆ తర్వాత యష్మి, నైనిక టీమ్‌లకు బాల్ పట్టు గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన టీమ్...నిఖిల్ టీమ్‌లోని ఓ మెంబర్‌ను తమ టీమ్‌లో చేర్చుకునే అవకాశం ఇచ్చాడు.