Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ నుంచి నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాలి - మాజీ కంటెస్టెంట్ ట్వీట్ వైర‌ల్‌-bigg boss 8 telugu eliminates nagarjuna from hosting of bigg boss babu gogineni tweet viral n convention ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ నుంచి నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాలి - మాజీ కంటెస్టెంట్ ట్వీట్ వైర‌ల్‌

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ నుంచి నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాలి - మాజీ కంటెస్టెంట్ ట్వీట్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Aug 25, 2024 07:24 AM IST

Bigg Boss 8 Telugu: నాగార్జున‌ను బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ సీజ‌న్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేశాడు.హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

బిగ్‌బాస్ 8 తెలుగు
బిగ్‌బాస్ 8 తెలుగు

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ తెలుగు షో నుంచి నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాల‌ని బిగ్‌బాస్ సీజ‌న్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేశాడు. హైద‌రాబాద్‌లోని తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్‌ను నిర్మించార‌ని ఆరోపిస్తూ శ‌నివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ క‌బ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో నాగార్జున‌ను బిగ్‌బాస్ నుంచి తొల‌గించాలంటూ బాబుగోగినేని ట్వీట్ చేశారు.

ఎలిమినేట్ హిమ్‌...

నాగార్జున‌ను ఉద్దేశించి అక్రమ కట్టడాలకు సంబంధించి దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలంటూ బాబు గోగినేని ట్వీట్ చేశాడు.

లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్‌లో బాబుగోగినేని పేర్కొన్నారు. ఎలిమినేట్ హిమ్, బిగ్ బాస్...ఇట్లు.. మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ అత‌డు ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

క‌బ్జా కాదు...

ఎన్ క‌న్వెన్ష‌న్ నిర్మించిన భూమి క‌బ్జాది కాద‌ని, ప‌ట్టా భూమి అని నాగార్జున ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాడు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్ర‌మించుకోలేద‌ని ఇందులో పేర్కొన్నాడు. త‌ప్పుడు స‌మాచారంతో చ‌ట్ట విరుద్ధంగా ఈ కూల్చివేత జ‌రిగింద‌ని నాగార్జున నాగార్జున తెలిపాడు. కూల్చివేసే ముందుకు త‌మ‌కు నోటీసులు కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పాడు.

ఏడు రోజుల్లో...

కాగా బిగ్‌బాస్ 8 తెలుగు మ‌రో ఏడు రోజుల్లో మొద‌లుకానుంది. సెప్టెంబ‌ర్ 1 నుంచి మొద‌లుకానున్న కొత్త‌ సీజ‌న్‌కు నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించానున్నాడు. ఇటీవ‌లే ఈ కొత్త సీజ‌న్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌పై నాగార్జున కోర్టును ఆశ్ర‌యించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు.

ఈ వివాదాల కార‌ణంగా నాగార్జున బిగ్‌బాస్‌ను కొన‌సాగిస్తాడా? ఆయ‌న స్థానంలో మ‌రో కొత్త హోస్ట్ వ‌స్తాడా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ నాగార్జున త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తే హోస్ట్‌గా ఎవ‌రు వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

కంటెస్టెంట్స్ వీళ్లేనా...

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో కంటెస్టెంట్స్‌గా ప‌లువురు సినిమా, టీవీ ఆర్టిస్టుల‌తో పాటు సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. చక్రవాకం సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ బిగ్‌బాస్ సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రో సీరియ‌ల్ హీరో నిఖిల్ మలిక్కల్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

హీరో అభిరామ్ వర్మ, సింగర్ సాకేత్ కొమండూరి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా జబర్దస్త్ రీతూ చౌదరి, యాంకర్ సౌమ్యరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

యూట్యూబ‌ర్‌...

సోష‌ల్ మీడియా తో పాపుల‌ర్ అయినా యూట్యూబర్ బెజవాడ బేబక్క కూడా బిగ్ బాస్ 8 తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న‌ట్లు స‌మాచారం.వీరితో పాటు మొగలిరేకులు సీరియల్ ఫేమ్ అంజలి పవన్, కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్‌ యష్మీ గౌడ కూడా బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. మొత్తం వంద రోజుల పాటు సీజ‌న్ 8 జ‌రుగ‌నుంది. గ‌త సీజ‌న్స్‌కు భిన్నంగా కొత్త టాస్క్‌లు, గేమ్ షోల‌తో సీజ‌న్ 8ను డిజైన్ చేసిన‌ట్లు తెలిసింది.