Bigg Boss 8 Remunerations: బిగ్‍బాస్ 8లో కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ వివరాలివే! ఒక్కొక్కరికి వారానికి ఎంతంటే..
Bigg Boss 8 Telugu Contestants Remuneration: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో హౌస్‍లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఈ సీజన్ ఆట షురూ అయింది. అయితే, ఈ సీజన్‍లో కంటెస్టెంట్లకు వారానికి ఒక్కక్కరికి ఎంత రెమ్యూనరేషన్ అనే సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
పాపులర్ రియాల్టీ షో బిగ్‍బాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన నయా సీజన్ మొదలైపోయింది. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ షురూ అయింది. ఆదివారమే (సెప్టెంబర్ 2) గ్రాండ్ లాంచ్‍తో ఈ సీజన్ ప్రారంభమైంది. ముందుగా హౌస్‍లోకి 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. ఈసారి కూడా సినీ, టీవీ నటీనటులు, సోషల్ మీడియా ఇన్‍ఫ్లయెన్సర్లు హౌస్‍లోకి అడుగుపెట్టారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కంటెస్టెంట్లకు స్టార్ మా ఛానెల్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తోందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఈ సీజన్‍లో కంటెస్టెంట్లకు నిర్వాహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో సమాచారాన్ని వెల్లడించారు మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. తన యూట్యూబ్ ఛానెల్‍లో వివరాలను వెల్లడించారు.
బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లో కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్లు ఇలా..
నాగ మణికంఠ - టీవీ నటుడు - వారానికి రూ.1.20లక్షలు
పృథ్విరాజ్ - టీవీ నటుడు - వారానికి రూ.1.50లక్షలు
సోనియా ఆకుల - సినీ నటి - వారానికి రూ.1.50లక్షలు
బెజవాడ బేబక్క - యూట్యూబర్ - వారానికి రూ.1.50లక్షలు
నబీల్ ఆఫ్రిది - యూట్యూబర్ - వారానికి రూ.2లక్షలు
కిర్రాక్ సీత - సినీ నటి, యూట్యూబర్ - వారానికి రూ.2లక్షలు
ప్రేరణ - టీవీ నటి - వారానికి రూ.2లక్షలు
అభయ్ నవీన్ - సినీ నటుడు - వారానికి రూ.2లక్షలు
నైనిక - డ్యాన్సర్ - వారానికి రూ.2.20లక్షలు
నిఖిల్ - టీవీ నటుడు - వారానికి రూ.2.25లక్షలు
శేఖర్ బాషా - ఆర్జే - వారానికి రూ.2.50లక్షలు
యష్మి గౌడ - టీవీ నటి - వారానికి రూ.2.50లక్షలు
ఆదిత్య ఓం - సినీ నటుడు - వారానికి రూ.3లక్షలు
విష్ణుప్రియ - యాంకర్ - వారానికి రూ.4లక్షలు
పాపులారిటీ, సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో ఫాలోయింగ్ సహా మరిన్ని విషయాల ఆధారంగా బిగ్‍బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ నిర్ణయిస్తారని ఆదిరెడ్డి వివరించారు. తొలి వారం మొత్తం ముందుగానే కంటెస్టెంట్లకు ఇస్తారని వెల్లడించారు. హౌస్‍లో ఉన్న మొత్తం వారాలకు లెక్కేసి కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ ఇస్తారని ఆయన తెలిపారు. ఎలిమినేట్ అయ్యాక 80 శాతం మొత్తాన్ని నెలలోపు, మిగిలిన 20 శాతాన్ని తొమ్మిది నెలల తర్వాత నిర్వాహకులు ఇస్తారని తెలిపారు.
విష్ణుప్రియకే హయ్యెస్ట్
ఈ లెక్కల ప్రకారం, బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో యాంకర్ విష్ణుప్రియకే అత్యధిక రెమ్యూనరేషన్ ఉంది. ఆమెకు హౌస్‍లో ఉండే ప్రతీ వారానికి రూ.4లక్షల రెమ్యూనరేషన్ అందనుంది. యాంకరింగ్, స్పెషల్‍లతో పాటు గ్లామర్‌తోనే విష్ణు పాపులర్ అయ్యారు. ఈ సీజన్‍లో మోస్ట్ ఫేమస్ కంటెస్టెంగ్‍గా ఉన్నారు. వారానికి రూ.3లక్షలతో తర్వాతి ప్లేస్‍లో ఉన్నారు నటుడు ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో పాటు ఆ తర్వాత కొన్ని చిత్రాలను ఆయన చేశారు. ఈ సీజన్‍లో అందరి కంటే తక్కువ రెమ్యూనరేషన్ టీవీ నటుడు నాగ మణికంఠకే ఉంది. అతడికి వారానికి రూ.1.20లక్షలు దక్కనున్నాయి. ఇవి పూర్తిగా కచ్చితంగా కాదని, కాస్త తేడాలు ఉండొచ్చని ఆదిరెడ్డి తన వీడియోలో తెలిపారు.