Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కోసం 50 మంది లాయర్లు.. వాళ్లపై పరువు నష్టం దావా.. ఆ కంటెస్టెంటే టార్గెట్
Bigg Boss Winner Pallavi Prashanth Defamation Case: చంచల్ గూడా జైలు నుంచి బయటకు వచ్చిన బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్ తనపై తప్పుడు ప్రచారం చేసిన కొంతమందిపై పరువు నష్టం దావా వేయనున్నాడు. వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా ఇటీవలే బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు.
జైలు నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో పేరు మార్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లను గుర్తిస్తున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తనపై కొందరు దుష్ప్రచారం చేసినట్లు, వాళ్లపై పరువు నష్టం దావా కేసు వేయడానికి పల్లవి ప్రశాంత్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొందరు యూట్యూబర్లపై ప్రశాంత్ కేసు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పల్లవి ప్రశాంత్ దగ్గర 50 మంది లాయర్లు పని చేస్తున్నారు. ఈ పరువు నష్టం కేసుకు సంబంధించిన విషయంలో వారు బిజీగా ఉన్నారట.
ఇక తనుపై తప్పుడు ప్రచారం చేసినట్లుగా పేర్కొంటూ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివపై పల్లవి ప్రశాంత్ లాయర్లు టార్గెట్ చేసినట్లు ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. దీనిలో ఎంతవరకు నిజముందో ముందు ముందు తెలియాల్సి ఉంది. అయితే, డిసెంబర్ 17న అల్లర్లు జరగడానికి ప్రధాన కారకుడు పల్లవి ప్రశాంత్ అని పోలీసులు కేస్ ఫైల్ చేశారు. కానీ, తనపై తప్పుడు ప్రచారం చేశారని పల్లవి ప్రశాంత్, అతని లాయర్లు నిజం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది.