Bigg Boss 7 Telugu : గౌతమ్ బట్టలిప్పించిన నాగర్జున.. నువ్ కూడా స్టెరాయిడ్స్ తీసుకున్నావా అని ప్రశ్న!
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా సాగింది. ఒక్కొక్కరి గురించి చెబుతూ.. కింగ్స్ మీటర్లో వారి పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా కలర్ ఇచ్చాడు నాగర్జున. ఈ సందర్భంగా కొందరికి క్లాస్ పీకాడు.
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రోజురోజుకు ఇంట్రస్ట్ పెరుగుతుంది. మెుదట్లో కాస్త డల్ గా నడిచినా.. ఇప్పుడు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. కంటెస్టెంట్లు కూడా.. హౌస్ మేట్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగర్జున వచ్చి.. వారమంతా చేసిన పనులను రివ్యూ చేసి.. క్లాసు కూడా పీకుతున్నాడు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్లో కొందరి గురించి గట్టిగానే మాట్లాడాడు.
ట్రెండింగ్ వార్తలు
రెండో పవర్ అస్త్రా కోసం జరిగిన పోటీలో గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రిన్స్ తన బాడీని చూపిస్తూ.. గౌతమ్ మీదకు వెళ్లాడు. ఈ సందర్భంగా గౌతమ్.. ఇంజెక్షన్ అంటూ సైగలు చేశాడు. దీనిపై ప్రిన్స్ చాలా హర్ట్ అయ్యాడు. బయటకు వెళ్లిపోతానని ఏడిచాడు. బిగ్ బాస్ ప్రిన్స్ ను కన్ఫెషన్ రూముకి పిలిచి.. మోటివేట్ చేశాడు. అయినా కూడా యావర్ మాత్రం బాధపడ్డాడు. గౌతమ్ సారీ చెప్పాలని కోరాడు.
ఇక వీకెండ్ ఎపిసోడ్లో ఈ విషయంపై నాగర్జున మాట్లాడాడు. ప్రిన్స్ యావర్ కు కింగ్స్ మీటర్లో గ్రీన్ ఇచ్చి.. మెచ్చుకున్నాడు. చాలా బాగా ఆడావని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో గౌతమ్ కృష్ణను లేపి.. ప్రిన్స్ స్టెరాయిడ్స్ తీసుకుని బాడీ పెంచిన విషయం నీకు తెలుసా అని ప్రశ్నించాడు. ఒక మనిషిని అలా ఎలా అంటావని నిలదీశాడు. నువ్ అన్న మాటలు హౌస్ లో ఎవరికీ నచ్చలేదని, నాకు కూడా నచ్చలేదని నాగర్జున చెప్పాడు. నచ్చని వారు చేయి పైకి లేపాలని కోరగా.. అందరూ లేపారు.
ఏదో ఆవేశంలో అలా అన్నాను అని గౌతమ్ అన్నాడు. నీ షర్ట్ తీసి చూపించు అని నాగర్జున అనగా.. గౌతమ్ చొక్కా విప్పాడు. మరి నీకు కూడా బాడీ ఉంది కదా.. అది కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటే వచ్చిందా అని ప్రశ్నించాడు నాగర్జున. నేనే ఓ డాక్టర్ స్టెరాయిడ్స్ తీసుకున్న విషయం నాకు తెలుసు అని మిగతా కంటెస్టెంట్లతోనూ చెప్పావని, ఎలా డిసైడ్ చేశావని ప్రశ్నించాడు. యావర్ ఎడమ చేతిపై ఇంజక్షన్ తీసుకున్నట్టుగా మార్క్ ఉందని గౌతమ్ చెప్పగా.. అది హీట్ వలన.. ప్రోటిన్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా అలా వస్తుందని వివరించాడు నాగర్జున.
నేను ఎలాంటి టెస్ట్ కైనా రెడీ అని చెప్పాడు ప్రిన్స్ యావర్. నువ్ చేసింది కరెక్ట్ కాదని యావర్ కు సారీ చెప్పమని నాగర్జున ఆదేశించాడు. దీంతో గౌతమ్ వెళ్లి.. యావర్ కు సారీ చెప్పాడు. ఇద్దరూ కౌగిలించుకున్నాడు. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ చేయకని వార్నింగ్ ఇచ్చాడు నాగ్.