Bigg Boss 7 Telugu : నాగర్జునగారు ఇది వీకెండ్ ఎపిసోడేనా? ఎలిమినేట్ చేసేయండి సర్!
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ పెద్దగా ఆసక్తిగా అనిపించలేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండానే సాగిపోయింది. కాస్త ప్రేక్షకులకు కూడా ఇబ్బందిగానే అనిపించింది.
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా మెుదలైంది. మెుదట్లో కాస్త ఇంట్రస్ట్ గా అనిపించింది. అంతెందుకు కిందటి వీకెండ్ ఎపిసోడ్ కూడా బాగుంది. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. ఈ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం.. అంత చప్పగా సాగినట్టుగా ఉంది. పెద్దగా ట్విస్టులేమీ లేవు. ఏదో సీరియల్ సాగినట్టుగా సాగిందనే అభిప్రాయం జనాల్లో ఉంది. కంటెసెంట్లతో మాట్లాడటం, భల్లాలదేవ, కట్టప్ప అంటూ మనసులోని మాట తెలుసుకోవడం తప్ప.. పెద్దగా ఎపిసోడ్ ఆసక్తిగా లేదు.
ట్రెండింగ్ వార్తలు
మెుదటి వారం పవర్ అస్త్రాను సందీప్ సాధించుకున్నాడు. రెండో వారం పవర్ అస్త్రాను శివాజీ సాధించుకున్నాడు. ఈ పవర్ అస్త్రాలు సాధించుకునేవరకూ.. ఎపిసోడ్స్ కాస్త ఆసక్తిగానే సాగాయి. అయితే సండే ఫండే డిఫరెంట్‍గా ప్లాన్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కథ మాత్రం.. అడ్డం తిరిగింది.. ఏదో సాగిపోయిందంటే.. సాగిందిలే అన్నట్టుగానే ఎపిసోడ్ ఉంది. అక్కడక్కడ కాస్త ఫన్ జనరేట్ అయింది అంతే. మిగత ఎపిసోడ్ అంతా.. బోర్ గానే సాగింది.
హౌస్‍లో బాహుబలి ఎవరు? కట్టప్ప ఎవరు? అంటూ ఒక్కొ కంటెస్టెంట్‍ను అడిగాడు నాగర్జున. ఇందులో పెద్దగా ట్విస్టులు, ఎంటర్ట్మైన్మెంట్ లేకుండానే సాగిపోయింది. ఒక్కొక్కరు వచ్చి.. తమకు సరైన ప్రత్యర్థి ఎవరు? తమకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అంటూ చెప్పుకొచ్చారు. ఎవరి కారణాలు వారు వివరించారు. ఇక్కడ మాత్రం పెద్దగా ఆసక్తిగా మాత్రం ఏం అనిపించలేదని అభిప్రాయం జనాల్లో ఉంది. వీకెండ్ ఎపిసోడ్ అంటే.. టీవీలకే అతుక్కుపోయేలా ఉండాలని అభిప్రాయం ఉంది. బిగ్ బాస్ సీజన్ మెుదట్లో ఉన్న ఆసక్తిని ఇప్పటికీ ఆ టీమ్ మళ్లీ క్రియేట్ చేయలేకపోతుంది.
అందరూ అనుకున్నట్టుగానే షకీలాను హౌస్ నుంచి పంపించేశారు. ఇక్కడ మాత్రం కాస్త ఎమోషనల్ అయ్యారు జనాలు కూడా. అందరినీ అమ్మలాగా చూసుకుంటూ వచ్చింది షకీలా. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింది. ఆమె వెళ్లిపోతున్న సమయంలో అమర్‍దీప్ ఏడవడం, టేస్టీ తేజ బాధపడటం.. ఇలా హౌస్‍లోని ప్రతీ ఒక్కరు తమ బాధను వ్యక్తం చేయడం కాస్త ఇంట్రస్టింగ్‍గా అనిపించింది. దామిని పాట పడి.. షకీలాను ఏడ్పించింది. ఇది మాత్రం ప్రేక్షకులను కాస్త కట్టిపడేసింది.
అంతకు ముందు ఎపిసోడ్ మెుత్తం సాదాసీదాగా నడిచింది. ఇదే అభిప్రాయం బిగ్ బాస్ రెగ్యూలర్‍గా చూసే ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. వీకెండ్ ఎపిసోడ్ అంటే.. చాలా అంచనాలతో ప్రేక్షకులు ఉంటారు. కానీ ఈసారి వీకెండ్ ఎపిసోడ్ మాత్రం.. అంతగా ఆసక్తిగా అనిపించలేదు. దీంతో ఇటు ప్రేక్షకులు నాగర్జునగారు ఇది వీకెండ్ ఎపిసోడేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మీమర్స్ అయితే.. అందరినీ ఎలిమినేట్ చేసేయండి సర్ అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. హోస్ట్ గా నాగర్జున అద్భుతం.. కానీ కంటెస్టెంట్ల దగ్గర నుంచి ఇంకా ఎంటర్ట్మైన్మెంట్ వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ అదిరిపోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.