Bigg Boss Shobha Shetty: నాకు పీరియడ్స్.. ఇది అందరిముందు చెప్పాలా అంటూ శోభా శెట్టి.. అమర్ దీప్‌కు బ్యాక్ పెయిన్-bigg boss 7 telugu shobha shetty reveals she has periods in 11th week nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss 7 Telugu Shobha Shetty Reveals She Has Periods In 11th Week Nominations

Bigg Boss Shobha Shetty: నాకు పీరియడ్స్.. ఇది అందరిముందు చెప్పాలా అంటూ శోభా శెట్టి.. అమర్ దీప్‌కు బ్యాక్ పెయిన్

Sanjiv Kumar HT Telugu
Nov 16, 2023 06:02 AM IST

Bigg Boss 7 Telugu Shobha Shetty: బిగ్ బాస్ 7 తెలుగులోకి ఒక కంటెస్టెంట్‌గా వచ్చిన కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభా శెట్టి తనకు పీరియడ్స్ అంటూ నామినేషన్ ప్రక్రియలో చెప్పేసింది. దాంతో సమాధానం చెప్పలేక కంగుతిన్నాడు ప్రిన్స్ యావర్.

నాకు పీరియడ్స్.. ఇది అందరిముందు చెప్పాలా అంటూ శోభా శెట్టి.. అమర్ దీప్‌కు బ్యాక్ పెయిన్
నాకు పీరియడ్స్.. ఇది అందరిముందు చెప్పాలా అంటూ శోభా శెట్టి.. అమర్ దీప్‌కు బ్యాక్ పెయిన్ (Instagram)

Bigg Boss 7 Telugu 11th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు పదకొండో వారం నామినేషన్లు రెండు రోజుల పాటు హోరా హోరీగా సాగాయి. ఈ వారం నామినేషన్లలో అమర్ దీప్, శోభా శెట్టి, రతిక రోజ్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, అశ్విని శ్రీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అయితే, ఈ నామినేషన్స్ జరిగే సమయంలో శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

ట్రెండింగ్ వార్తలు

శోభా శెట్టిని నామినేట్ చేసిన ప్రిన్స్ యావర్.. తను కెప్టెన్‌గా ఫెయిల్ అయింది. బిగ్ బాస్ నుంచి లేఖ వచ్చింది. కెప్టెన్, డిప్యూటి కెప్టెన్ వీఐపీ రూమ్‌లో పడుకోవాలి చెప్పారు కదా. మరి నువ్వెక్కడ పడుకుంటున్నావ్ అని అడిగాడు. నేను 3 రోజులు వీఐపీ రూమ్‌లో పడుకున్నాను. నా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల వేరే చోట పడుకున్నాను అని శోభా చెప్పింది. దాంతో అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమర్‌కి బ్యాక్ పెయిన్ ఉంది. తను కూడా డిప్యూటి కదా. అతను కూడా అక్కడే పడుకున్నాడు. మరి నువ్వెందుకు బిగ్ బాస్ చెప్పినట్లు చేయలేదు అని యావర్ నిలదీశాడు.

నేను పీరియడ్స్ లో ఉన్నాను. ఈ మాట నేను నీకు చెప్పకూడదు. కానీ, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావ్ కాబట్టి చెప్తున్నాను. నాకు పీరియడ్స్ కాబట్టి బెడ్ లేకుంటే పడుకుందాం అని స్టాండర్డ్ రూమ్‌లో పడుకున్నా. ఈ విషయాన్ని నేను నీతో చెప్పాలా. ఇది చెప్పాల్సిన విషయమా అని శోభా శెట్టి అసలు విషయం చెప్పింది. దీంతో కంగు తిన్న యావర్ సరే ఈ విషయాన్ని వదిలేయ్. నీ ప్లాబ్లమ్‌ని నేను గౌరవిస్తాను అని యావర్ అన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.