Bigg Boss 7 Telugu : లచ్చిందేవి.. లచ్చిందేవి.. బిగ్ బాస్ బొచ్చు టాస్క్
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ టాస్కులు కొన్ని వెరైటీగా అనిపిస్తాయి. ఇలా చేస్తున్నాడేంటి అనిపిస్తుంది. ఓ టాస్క్ ను మాత్రం చాలా సీజన్ల నుంచి కంటిన్యూ చేస్తు్న్నాడు. అదే హెయిర్ కట్. తాజా ఎపిసోడ్‍లోనూ ప్రియాంక హెయిర్ కట్ చేయించుకుంది.
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఆసక్తిగా సాగుతోంది. కంటెస్టెంట్లు హౌస్ మెట్ అయ్యేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చినా.. చేసేస్తు్న్నారు. ఇక హెయిర్ కట్ టాస్క్ ఎప్పటి నుంచో ఇస్తు్న్నాడు బిగ్ బాస్. ఈ సీజన్లో కూడా అదే ఆనవాయితీ కంటిన్యూ చేశాడు. తాజాగా ప్రియాంక కూడా పవర్ అస్త్రా కోసం రేసులో ఉండేందుకు హెయిర్ కట్ చేయించుకుంది. దీంతో అందరూ షాక్ అయ్యారు.
మూడో పవర్ అస్త్రా కోసం పోటీ పడేందుకు కంటెస్టెంట్లు సిద్ధమయ్యారు. ప్రిన్స్ యావర్.. తనను ఛాలెంజ్ చేసిన కంటెస్టెంట్లను ఓడించి.. కంటెండెర్ అయ్యాడు. తర్వాత శోభా శెట్టిని గౌతమ్, ప్రశాంత్ ఛాలెంజ్ చేశారు. అయితే బిగ్ బాస్ యాక్టివిటీ హౌసులోకి పిలిచి.. బాగా కారం ఉన్న చికెన్ పెట్టాడు. అందులోని తినే పీసులను బట్టి.. కంటెండర్ గా ఉంటావో లేదో డిసైడ్ అవుతుందని చెప్పాడు. దీంతో 27 చికెన్ పీసులు తిన్నది శోభా శెట్టి. బాగా కారం ఉండటంతో చాలా ఇబ్బంది పడింది. తనకు కారం అంటే పడదు అని తెలిసి.. బిగ్ బాస్ ఇలాంటి పోటీ పెట్టాడని బాధపడింది.
తర్వాత శోభా శెట్టిని ఛాలెంజ్ చేసిన గౌతమ్, పల్లవి ప్రశాంత్ ను పిలిచాడు బిగ్ బాస్. మళ్లీ బాగా కారం ఉన్న 28 పీసులు పెట్టి.. శోభా 27 తిందని, తక్కువ టైములో 28 తింటే కంటెండెర్ అవుతారని చెప్పాడు. దీంతో ప్రశాంత్, గౌతమ్ పోటీ పడ్డారు. గౌతమ్ 27 చికెన్ పీసులు తిన్నాడు. అయితే తాను మాత్రం 28 తిన్నట్టుగా అనుకున్నాడు. కానీ అందులో ఓ చిన్న పీసు మిగిలిపోయింది. దీంతో కంటెండర్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రశాంత్ కూడా తినలేకపోయాడు. దీంతో శోభా శెట్టినే కంటెండర్ గా ప్రకటించాడు బిగ్ బాస్.
ఇక అమర్ దీప్ ను ఛాలెంజ్ చేసింది ప్రియాంక. దీంతో మీకు ఇష్టమైన దానికి వదులుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. అదేంటంటే మీ హెయిర్ అని చెప్పగా.. అందరూ షాక్ అయ్యారు. ఓ రెండు ఫొటోలను పంపారు. దాని ప్రకారం చేయించుకోవాలని చెప్పాడు. అమర్ దీప్ మాత్రం అస్సలు చేయించుకోనని చెప్పాడు. హెయిర్ కట్ చేస్తే.. తాను బాగా కనిపించను అని చెప్పుకొచ్చాడు. తనకు తల మీద కుట్లు ఉన్నాయని అవి కనిపిస్తాయని వివరించాడు. రవితేజ అంటే తనకు ఇష్టమని, అదే హెయిర్ స్టైల్ మెయింటెన్ చేస్తున్నానని తెలిపాడు.
మెుత్తానికి ప్రియాంక హెయిర్ కట్ చేయించుకునేందుకు రెడీ అయింది. కాసేపు ఆలోచించింది.. ఏడ్చింది. కానీ ధైర్యంగా వెళ్లి.. హెయిర్ కట్ చేయించుకుంది. లుక్ కూడా బాగా ఉందని సంబరపడిపోయింది. ప్రియాంక కంటెండర్‍గా పోటీలో ఉంది. అయితే మీమర్స్ మాత్రం.. విక్రమార్కుడు సినిమాలోని ఓ సీన్ ను వేసి ట్రోల్ చేస్తున్నారు. యావర్, ప్రియాంక, శోభా శెట్టి మూడో పవర్ అస్త్రా కోసం రేసులో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరిని రేసు నుంచి తప్పించాలని బిగ్ బాస్ చెప్పగా.. శోభా శెట్టి, ప్రియాంక యావర్ ను టార్గెట్ చేశారు. దీంతో యావర్ వారిపై సీరియస్ అయ్యాడు.