Bigg Boss 7 Telugu: షాకింగ్.. హీరోహీరోయిన్లకు గుండు.. అనుకుంది సాధించిన ప్రియాంక
Bigg Boss 7 Telugu Amardeep Priyanka: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్‍లో మూడో పవరాస్త్ర కంటెండర్‍గా నిరూపించుకోవడానికి శోభా శెట్టి, అమర్ దీప్‍కు షాకింగ్ టాస్క్ ఇచ్చాడు పెద్దయ్య.
Bigg Boss 7 Telugu September 21st Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో మూడో పవరాస్త్ర గెలుచుకునేందుకు కంటెండర్లుగా అర్హులమని నిరూపించుకునేందుకు పెద్దయ్య టాస్క్ లు ఇచ్చాడు. శోభా శెట్టికి అత్యంత కారమైన చికెన్ టాస్క్ ఇవ్వగా ఆమె గెలిచింది. అంతకుముందు ప్రిన్స్ యావర్ కూడా తాను కంటెండర్‍గా డిజర్వ్ అని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా అమర్ దీప్ చౌదరికి తన ఎలిజిబిలిటీని నిరూపించుకునే అవకాశం వచ్చింది.
అమర్ దీప్ చౌదరి అనర్హుడు అని ప్రియాంక జైన్ తన అభిప్రాయం చెప్పిన విషయం తెలిసిందే. గురువారం (సెప్టెంబర్ 21) నాటి ఎపిసోడ్‍లో జానకి కలగనలేదు సీరియల్ హీరోహీరోయిన్లు అయినా అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్ మధ్య పోటీ పడింది. అయితే ఈ ఇద్దరికి కంటెండర్ కోసం గుండు చేయించుకోవాల్సిందిగా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అమర్ దీప్ చౌదరికి పూర్తిగా గుండు, ప్రియాంక బాబ్ కట్ (చెవుల కింది వరకు హెయిర్ ఉండటం) చేయించుకోవాలని పెద్దయ్య ఆదేశించాడు.
ఈ టాస్కులో ఎవరు ఉంటారు.. ఎవరు గివప్ ఇస్తారో తేల్చుకోమన్నాడు బిగ్ బాస్. అయితే, గుండు అనేసరికి అమర్ దీప్ తన వల్ల కాదని అన్నాడు. తన తలపై కుట్లు పడ్డాయని, గుండు చేయించుకుంటే కనిపిస్తుందని, అది అంతా బాగొదని చెప్పాడు. అలాగే నేను రవితేజకు అభిమాని అని తెలుసుగా. ఆయన నా జుట్టుపై చేయి వేసి.. నాలాగే ఉందని అన్నారు అని అమర్ చెప్పాడు. మళ్లీ 3 నెలలకు పెరుగుతుంది కదా అని తేజ సెటైర్ వేశాడు.
రకరకలా కారణాలు చెప్పి అమర్ దీప్ చేతులెత్తేసాడు. ఇక ప్రియాంక జుట్టు కత్తిరించుకోవడానికి ముందు ఓకే అని.. తర్వాత అమర్ దీప్ లేడుగా అని, మళ్లీ అమ్మాయిలకు ఇలాంటి హెయిర్ కట్ అంటే మాములు విషయం కాదు కదా అంటూ రకరకాల మాటలు చెప్పింది. కానీ, ఫైనల్‍గా మాత్రం జుట్టు కత్తిరించుకుని కంటెండర్ అయింది. కంటెండర్ అవుదామనుకున్నది సాధించింది ప్రియాంక. జుట్టు కత్తిరించాకా.. తన లుక్ చాలా క్యూట్ ఉందని, వావ్ అంటూ మురిసిపోయింది. దీంతో మూడో పవరాస్త్ర కోసం కంటెండర్స్ గా ప్రిన్స్, శోభా, ప్రియాంక నిలిచారు.
సంబంధిత కథనం
టాపిక్