Bigg Boss 7 Telugu : అప్పుడు ప్రశాంత్.. ఇప్పుడు రతిక.. ఇక అందరికీ టార్గెట్ ఆమేనా?
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిగా మారుతుంది. మెుదట్లో కాస్త బోర్ అనిపించినా.. రాను రాను ఇంట్రస్ట్ పెరుగుతుంది. ప్రస్తుతమైతై కంటెస్టెంట్లు అంతా ఒకవైపు ఉంటే.. రతిక మాత్రం ఒకవైపు మాత్రమే ఉన్నట్టుగా అనిపిస్తుంది.
కిందటి వారం నామినేషన్స్ సమయంలో ఎక్కువగా టార్గెట్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. 9 మంది ప్రశాంత్ కు వ్యతిరేకంగా నామినేషన్ చేశారు. అయితే బయట నుంచి మాత్రం ప్రశాంత్ మద్దతు గట్టిగానే లభిస్తుంది. తాజాగా మాత్రం రతికను ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. దీనికి కారణం కూడా ఉంది. ఆమె మాత్రం మెుండిపట్టుదలతో ఉంటుంది. నేను అనుకున్నది కావాలని అన్నట్టుగా ఉంది. అందరి వెళ్లు ఆమె వైపే చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
ఉదాహరణకు పవర్ అస్త్ర.. దొంగిలించిన విషయంపై రచ్చ జరిగింది. ఈ సందర్భంగా.. ఆట సందీప్ మాత్రం రతికపై అనుమానం వ్యక్తం చేశాడు. కానీ నిజానికి తీసింది మాత్రం.. శుభ శ్రీ. తర్వాత టేస్టీ తేజ వచ్చి.. క్లారిటీ ఇచ్చాడు. అంటే సందీప్‍కు మనసులో రతికపై నెగెటివ్ ఉంది. అందుకే ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. మహాబలి టీమ్ వర్సెస్ రణధీర టిమ్ మధ్య పోటీ జరిగిన విషయం తెలిసిందే. రణధీర టీమ్ గెలిచింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఓ ఫిట్టింగ్ పెట్టాడు. మహాబలి టీమ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు వెళ్లి... రణదీర టీమ్ లో ఎవరైతే పవర్ అస్ర్తాకు అర్హులు కాదో వారి దగ్గర ఉన్న మాయాస్త్రా భాగాన్ని తీసుకుని ఇంకొ కంటెస్టెంట్ కు ఇవ్వాలి.
ఈ విషయంపై మహాబలి టీమ్ గంటలు గంటలు చర్చ చేసింది. ముందుగా శుభ శ్రీ వెళ్లింది.. తర్వాత పల్లవి ప్రశాంత్ వెళ్లాడు. తర్వాత రతికను పంపించాలని టీమ్ డిసైడ్ చేసింది. కానీ ఆమె మాత్రం నేను అస్సలు వెళ్లను అని భిష్మించుకుని కూర్చొంది. ఈ సందర్భంగా దామినితో పెద్ద యుద్ధమే జరిగింది. నేను వెళ్లను చెప్పేందుకు నువ్ ఎవరు అంటూ దామినిపై ఫైర్ అయింది రతిక. నువ్ గట్టిగా అరిస్తే.. నీకంటే.. ఎక్కువగా నేను కూడా అరవగలను అని చెప్పి పైపైకి వెళ్తూ మాట్లాడింది. గౌతమ్ తో కూడా రతికకు గొడవ అయింది. ఇక టేస్టీ తేజ అయితే.. నిన్ను పంపించి నేను తక్కువ కాలేను అని ముఖం మీద చెప్పేశాడు.
మహాబలి టీమ్‍లోని అందరూ ఆమెకు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరి మాట రతిక వినలేదు. నేను చివరికి మాత్రమే వెళ్తాను.. నేనే గేమ్ ఛేంజ్ చేస్తాను అని పట్టుబట్టింది. దీంతో ఇటు మహాబలి టీమ్ సభ్యులు, అటు రణధీర టీమ్ సభ్యులు రతిక తీరుపై మండిపడ్డారు. సంచాలకుడిగా ఉన్న ఆట సందీప్ కూడా ఫైర్ అయ్యాడు. ఇలానే కంటిన్యూ అయ్యేసరికి బిగ్ బాస్ టాస్క్ ఛేంజ్ చేశాడు. దీంతో అమర్ దీప్ గట్టి గట్టిగా రతికపై ఫైర్ అయ్యాడు. ఆమె చేసిన పనికి మిగతా వాళ్లంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందని శోభా శెట్టి కూడా బాధపడింది.
ఇలా హౌస్‍లోని ప్రతీ కంటెస్టెంట్ రతికకు వ్యతిరేకంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కిందటివారం ఇలానే.. పల్లవి ప్రశాంత్ పై హౌస్ మేట్స్ ఫైర్ అయ్యారు. ఒక్కడినే కార్నర్ చేసి.. నామినేషన్ చేశారు. ఇప్పుడు రతిక వంతు వచ్చినట్టుగా ఉంది. ప్రస్తుతానికైతే కంటెస్టెంట్స్ ఎవరూ రతిక మీద సాఫ్ట్ కార్నర్ లేదు. ఆమె గురించి అందరూ నెగెటివ్ గానే మాట్లాడుకుంటున్నారు. ఈ వారం అవకాశం వస్తే.. నామినేషన్స్ సమయంలో రతిక మెుండిగా ఉన్న విషయం చెబుతూ.. అందరూ నామినేషన్ చేసే ఛాన్స్ ఉంది. కంటెస్టెంట్ల నుంచి మాత్రం రతిక బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.