Bigg Boss 7 Telugu: మరొకరితో రతిక లవ్ ట్రాక్.. ప్రశాంత్ పక్కనే ఆ సీన్స్.. క్యూట్ అంటూ శోభా
Bigg Boss 7 Telugu Rathika Love Track: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే ఊహకందని విధంగా సాగుతోంది. సెప్టెంబర్ 15వ ఎపిసోడ్‍లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. అందులో రతిక మరొకరితో లవ్ ట్రాక్ నిడిపించడం ఒకటి.
Bigg Boss 7 Telugu September 15th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సెప్టెంబర్ 15వ ఎపిసోడ్‍లో రెండో పవర్ ఆస్త్రా కోసం ఆరుగురు పోటీ పడగా.. ఫైనల్‍గా శివాజీ, షకీలాను ఉంచారు మహాబలి టీమ్. దీంతో మహాబలి టీమ్ కెప్టెన్ గౌతమ్ కృష్ణ, రణధీర కంటెండర్ ప్రిన్స్ యావర్ మధ్య ఘోరమైన ఫైట్ జరిగింది. ఈ గొడవ జరిగే క్రమంలోనే తాను శివాజీ, ప్రిన్స్ యావర్‍కు మాయాస్ర్త భాగాలు ఇవ్వాలని చెప్పానని, తన మహాబలి టీమ్ వినలేదని గట్టిగా అరుస్తూ అబద్ధాలు చెప్పింది.
ట్రెండింగ్ వార్తలు
ప్రశాంత్ పక్కనే
నిజానికి శివాజీ, షకీలాకే సపోర్ట్ చేసిన రతిక.. యావర్ గొడవ పడటంతో ప్లేటు అటు తిప్పింది. యావర్ కంటే షకీలా ఎలా అర్హురాలు అంటూ సొంత టీమ్‍పైనే చిందులేసింది. అదంతా చూసిన ప్రిన్స్.. రతికపై మనసు పాడేసుకున్నాడు. తనతో క్లోజ్‍గా ఉన్నాడు. అలా ఉండటాన్ని రతిక కూడా ఎంకరేజ్ చేసింది. పల్లవి ప్రశాంత్, శివాజీ పక్కన ఉండగానే బిగ్ బాస్ నేను రతకిను ఇష్టపడుతున్నాను అని ప్రిన్స్ చెప్పాడు. ఐ లైక్ యూ అని ప్రిన్స్ అంటే.. ఐ లైక్ యు టూ అని రతిక చెప్పింది.
చాలా మంచి హార్ట్
మరి అబ్బాయిల్లో ఎవరు ఇష్టం అని శివాజీ అంటే.. అబ్బాయిలు ఎవరు లేరు. అమ్మాయిలే అని ప్రిన్స్ అనడంతో రతిక తెగ నవ్వేసింది. తర్వాత రతిక బాల్కనీలో ఉంటే.. గార్డెన్ ఏరియాలో ఉన్న ప్రిన్స్ నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది అన్నట్లుగా సౌండ్ చేస్తూ చేతులతో హార్ట్ సింబల్ వేశాడు. రతిక కూడా హార్ట్ సింబల్ వేసి చూపించింది. ఇదంతా పల్లవి ప్రశాంత్ గమనించాడు. నువ్ రతికను లవ్ చేస్తున్నావా అని ప్రశాంత్ అడిగాడు. తనది చాలా మంచి హార్ట్. ఇవాళే నాకు అర్థమైంది అని ప్రిన్స్ అన్నాడు.
అదంతా నమ్మకురా
ప్రిన్స్ చెప్పినదానికి అదంతా నమ్మకురా నాయనా.. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తర్వాత తెలుస్తుంది అని ప్రశాంత్ అన్నాడు. అనంతరం బాల్కనీలో కూర్చున్న శోభా శెట్టి, రతిక.. ప్రిన్స్ గురించి మాట్లాడుకున్నారు. గౌతమ్ కంటే.. ప్రిన్స్ క్యూట్‍గా అనిపిస్తాడు అని శోభా శెట్టి అంది. నాకు ముందు నుంచే గౌతమ్ నచ్చడు, ఒరిజినల్‍గా ఉండడు అని రతిక, శోభా మాట్లాడుకున్నారు. కాగా ఇంతకుముందు ప్రశాంత్‍తో రతిక చనువుగా ఉంటూ లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే. రెండో వారం నామినేషన్స్ నుంచి రతికకు దూరంగా ఉంటూ వచ్చాడు ప్రశాంత్.