Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్లను టార్చర్ పెట్టిన రతిక.. బూతులు తిట్టిన అమర్ దీప్
Bigg Boss 7 Telugu Rathika Rose: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో 4 వారాల ఇమ్యునిటీ దక్కించుకునేందుకు మాయాస్త్ర అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ క్రమంలో రతిక రోజ్ కంటెస్టెంట్లకు చుక్కలు చూపించింది. ఇంకా బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
Bigg Boss 7 Telugu September 14th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సెప్టెంబర్ 14వ ఎపిసోడ్‍లో మాయాస్త్రం కోసం ఆరుగురు కంటెండర్లు పోటీ పడ్డారు. మాయాస్త్రం టాస్కులో భాగంగా హౌజ్ మేట్స్ అంతా రణధీర, మహాబలి అని రెండు టీములుగా విడిపోయిన విషయం తెలిసిందే. దీంట్లో రణధీర టీమ్ (శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా) విజయం సాధించి వారంతా కంటెండర్లుగా సెలెక్ట్ అయ్యారు. వారిక చెరొకటి మాయాస్త్ర భాగం వచ్చింది.
ఎవరూ సెలెక్ట్ చేయాలి
రణధీర టీమ్‍లోని ఒకరి దగ్గర ఉన్న మాయాస్త్ర భాగాన్ని మరొకరికి ఇచ్చి ఆఖరుగా ఇద్దరిని సెలెక్ట్ చేయాల్సిందిగా మహాబలి టీమ్‍కు (గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, దామిని, పల్లవి ప్రశాంత్, రతిక, శుభ శ్రీ ) బిగ్ బాస్ చెప్పాడు. అయితే వారిలో అర్హులు ఎవరో తగిన కారణాలు చెప్పి.. ఫైనల్ కంటెండర్స్ ను సెలెక్ట్ చేయాలి. దానికి మహాబలి టీమ్ సభ్యులు ఎప్పుడు ఎవరూ సెలెక్ట్ చేయాలి అనేది స్థానాల వారీగా నిర్ణయించుకున్నారు. ముందుగా వెళ్లిన శుభ శ్రీ.. శోభా శెట్టి కంటే ప్రిన్స్ గేమ్ బాగా ఆడాడు అని చెప్పి ఆమె మాయాస్త్ర భాగాన్ని యావర్‍కు ఇచ్చింది.
తర్వాత పల్లవి ప్రశాంత్ వెళ్లి అమర్ దీప్ ఆట సరిగా ఆడలేదని, చాలా ఎక్స్ పెక్ట్ చేశానని చెప్పి అతని భాగాన్ని శివాజీకి ఇచ్చాడు. ఇక మూడో ప్లేసులో వెళ్లేది రతిక అని మహాబలి టీమ్ అంతా నిర్ణయిస్తే ఆమె మాత్రం అస్సలు వెళ్లలేదు. ఆరో స్థానంలో వెళితే గేమ్ మార్చొచ్చని, తను అనుకున్న వారిని సెలెక్ట్ చేయొచ్చని రతిక వాదనకు దిగింది. మహాబలి అనుకున్న ప్లాన్ రతిక వల్ల ఎక్కడా బెడిసికొడుతుందో అని టీమ్ దానికి ఒప్పుకోలేదు. రతిక కూడా ఏమాత్రం తగ్గలేదు. ఒక్కో టీమ్ మెంబర్‍పై అరవడం మొదలు పెట్టింది.
అంతా బఫూన్స్
గట్టిగా మాట్లాడకు. నేను కూడా మాట్లాడగలను అంటూ దామినిపై గట్టిగా అరిచింది. దీంతో దామిని కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపు వాదన తర్వాత మూడో స్థానంలో దామిని వెళ్లి ప్రియాంక భాగాన్ని షకీలాకు ఇచ్చింది. ఇక నాలుగో స్థానంలో కూడా వెళ్లేందుకు రతిక ఏమాత్రం ఒప్పుకోలేదు. అప్పటికే సహనం కోల్పోయిన ఆట సందీప్, గౌతమ్ తెగ ఫ్రస్టేట్ అయ్యారు. అంతా చెండాలంగా ఉంది. ఈ టీమ్ అంతా బఫూన్స్, అలాగే ప్రవరిస్తున్నారు అని తన టీమ్‍పై కామెంట్స్ చేసింది రతిక.
రతికకు, మహాబలి టీమ్ మొత్తానికి బీభత్సమైన వాగ్వాదం జరిగింది. దీంతో రతిక సమయాన్ని వృథా చేస్తుందని గమనించిన బిగ్ బాస్ తర్వాత మహాబలి టీమ్ నుంచి ఎవరు రావాలనేది రణధీర టీమ్ మెంబర్స్ డిసైడ్ చేయాలని చెప్పాడు. అలాగే రణధీర టీమ్‍లో ప్రస్తుతం ఎవరు చేతిలో మాయాస్త్ర భాగం లేదో వారు ఇక ఆటలో లేనట్లే అని ప్రకటించాడు. అంటే శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక్ గేమ్ నుంచి తప్పుకున్నట్లే. దీంతో అమర్ దీప్ కోపంతో ఊగిపోయాడు.
బీప్ సౌండ్ వేసి
రెండు రోజులు అంత కష్టపడి ఆడి అంత చిన్న కారణంతో ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు పల్లవి ప్రశాంత్ చెప్పిందే పాయింటే కాదంటూ, అసలు గేమే తెలియదని, ఎందుకు వస్తారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాయాస్త్ర భాగం ప్రశాంత్ వల్ల కోల్పోవడం, రతిక సమయం వేస్ట్ చేయడం వల్లే బిగ్ బాస్ ప్రకటన రావడంతో ఇద్దరిని కలిపి బూతులు తిట్టాడు అమర్ దీప్. అతని మాటలకు బీప్ వేశారు. మనం ఒక షోలో ఉన్నామని గుర్తు పెట్టుకుని మాట్లాడు అమర్ అని శోభా శెట్టి అంది. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ రతిక బాగానే టార్చర్ చేసింది.