Bigg Boss 7 Telugu: సొంత వాళ్లనే తిట్టిన రతిక.. మాయాస్త్ర విజేతలుగా రణధీర.. హైలెట్‍గా శివాజీ
Bigg Boss 7 Telugu Maayasthra Task Winner: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో మాయాస్త్ర గెలుచుకునేందుకు రెండో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఎవరు గెలిచారు, బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
Bigg Boss 7 Telugu September 13th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో మొదటి నుంచే ఇంట్రెస్టింగ్ టాస్కులు ఆడిపిస్తున్నారు. ఇప్పటికే పవరాస్త్రను ఆట సందీప్ గెలుచుకున్నాడు. తర్వాత మాయాస్త్ర అంటూ ఇంటి సభ్యులు అయ్యేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అంతా రణధీర, మహాబలి టీమ్స్ గా విడిపోయారు. రణధీర టీమ్‍లో శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా ఉండగా.. మహాబలి గ్రూపులో గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, దామిని, పల్లవి ప్రశాంత్, రతిక, శుభ శ్రీ ఉన్నారు.
ఎక్కడెక్కడో పెట్టి
మాయాస్త్రలో భాగంగా ఇచ్చిన పూల్ రాజా పూల్ టాస్కులో రణధీర టీమ్ గెలిచింది. దాంతో వచ్చిన కీను కొట్టేసేందుకు మహాబలి టీమ్ సభ్యులు తెగ తంటాలు పడ్డారు. కానీ, శివాజీ వేసిన ప్లాన్స్ తో వాళ్లకు చుక్కలు కనిపించాయి. తన దగ్గరే కీ పెట్టుకుని ఎక్కడెక్కడో పెట్టినట్లు చేశాడు. దాంతో వాళ్లు అనేక చోట్ల వెతికారు. కానీ, ఫలితం దక్కలేదు. అందమైన పూల వనం, గులాబీ పువ్వు అంటూ శివాజీ హింట్స్ ఇచ్చాడు. కానీ అది మహాబలి టీమ్ కనిపెట్టలేకపోయింది.
పోటీలో ఆరుగురు
ఇక రెండో టాస్కుగా మలుపుతో గెలుపు అనే టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ఆడేటప్పుడు రతిక తన సొంత టీమ్ వాళ్లనే చెత్త టీమ్, వెధవ టీమ్ అంటూ తిట్టింది. అనంతరం మహబలికి 1 పాయింట్ తీసుకొచ్చాడు ప్రశాంత్. కానీ, రెండు పాయింట్లతో రణధీర టీమ్ గెలిచింది. దీంతో రెండో కీ అందుకున్నారు. దాంతో ఫన్ యాక్టివిటీ రూమ్‍కు వెళ్లి రణధీర టీమ్ పలు అస్త్రాలను గెలుచుకున్నారు. రణధీర టీమ్‍లోని ఆరుగురు మాయాస్త్రాన్ని గెలుచుకునేందుకు పోటీ పడే కంటెండర్స్ గా నిలిచారు.
ముప్పు తిప్పలు పెట్టి
రణధీర టీమ్‍లోని శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా ఆరుగురు మాయాస్త్రం కోసం పోటీ పడే కంటెండర్స్ గా ఎన్నికయ్యారు. అంటే తర్వాతి టాస్కులో వీరు ఆరుగురు పోటీ పడనున్నారు. ఇక టాస్కుల్లో గెలుచుకున్న కీని కాపాడుకునేందుకు శివాజీ సూపర్బ్ ప్లాన్స్ వేసి హైలెట్ అయ్యాడు. మహాబలి టీమ్‍ని ముప్పు తిప్పలు పెట్టాడు. మరోవైపు ఏది దొరక్క ఆట సందీప్ పవరాస్త్రను శుభ శ్రీ, దామిని కలిసి దొంగతనం చేశారు.