Rathika-Prashanth Video : మళ్లీ మెుదలు.. రతిక-ప్రశాంత్ రొమాంటిక్ వీడియో లీక్!-bigg boss 7 telugu rathika rose and pallavi prashanth romantic video released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss 7 Telugu Rathika Rose And Pallavi Prashanth Romantic Video Released

Rathika-Prashanth Video : మళ్లీ మెుదలు.. రతిక-ప్రశాంత్ రొమాంటిక్ వీడియో లీక్!

రతిక-పల్లవి ప్రశాంత్
రతిక-పల్లవి ప్రశాంత్ (unsplash)

Rathika-Prashanth Video : పల్లవి ప్రశాంత్, రతిక రోస్ మీద ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ప్రశాంత్ ను రతిక ఆడుకుంటుందని చాలా మంది చెప్పుకొచ్చారు. తాజాగా అందరూ పడుకున్నాక.. వీరిద్దరూ మాట్లాడుకున్న వీడియో ఒకటి బిగ్ బాస్ లీక్ చేశాడు.

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ఇప్పటి వరకూ ఒక్క ప్రేమ కథ కూడా మెుదలుకాలేదు. ప్రతీ సీజన్లో కచ్చితంగా ఓ లవ్ ట్రాక్ నడిచేది. కానీ ఈ సీజన్లో మాత్రం ఎవరి మధ్య మ్యాజిక్ వర్కౌట్ కావడం లేదు. మెుదట్లో రతిక చుట్టే ప్రశాంత్ తిరిగాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అనుకున్నారు. కానీ మధ్యలో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది రతిక. నామినేషన్స్ సమయంలో ప్రశాంత్ కు వ్యతిరేకమైంది. దీంతో ప్రశాంత్ కూడా చాలా హర్ట్ అయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

మధ్యలో ప్రిన్స్ యావర్ కూడా ఎంటర్ అయ్యాడు. కాస్త ఇంట్రస్ట్ చూపించాడు. ఈ విషయాన్ని పక్కనే ఉండి చూస్తూ.. ప్రశాంత్ కాస్త బాధపడినట్టుగా అనిపించింది. మిగతా వాళ్లు.. కూడా ప్రశాంత్ బాధపడుతాడు అని చెప్పుకొచ్చారు. యావర్ ను ఓ సందర్భంలో ఆమెను లవ్ చేస్తున్నావా అని నేరుగా అడిగేశాడు. ఆమె అంటే ఇష్టమని యావర్ కూడా చెప్పాడు. మెుదటి నామినేషన్స్ సందర్భంగా రతిక చేసిన కామెంట్స్ నుంచి ప్రశాంత్ మాత్రం మాట్లాడం లేదు. తాజాగా వీరిద్దరు సరదాగా ఉన్న వీడియోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు.

నిజానికి బిగ్ బాస్ లాంచ్ అయి.. అందరూ ఇంట్లోకి వచ్చాక.. రతికను లేడీ లక్ అని చెప్పాడు ప్రశాంత్. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ సరదాగా ఉన్నారు. ప్రశాంత్ అయితే.. రతిక ఎక్కడ ఉంటే.. అక్కడే ఉండేవాడు. ఇతర కంటెస్టెంట్స్ కూడా వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ఫిక్స్ అయిపోయారు. అంతలా కనెక్ట్ అయినట్టుగా అనిపించింది. నామినేషన్స్ లో కూడా ఈ కారణం చెప్పినట్టుగా ఉన్నారు. కానీ తర్వాత మాత్రం రతిక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్ ను కూడా టార్గెట్ చేసింది రతిక. అందరూ ప్రశాంత్ ను నామినేట్ చేస్తుండగా.. నువ్ ఆమె చుట్టూ తిరగడం సరిగా లేదని చెప్పుకొచ్చారు. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పానా అని రతికను ప్రశ్నించాడు ప్రశాంత్. చూస్తున్న అందరికీ తెలుసు అని రతిక చెప్పింది. దీంతో ప్రశాంత్ షాక్ అయ్యాడు. వేరే వాళ్లు నామినేట్ చేసిన సమయంలోనూ.. రైతుబిడ్డ అని చెబుతూ.. ఇక్కడకు వచ్చి ఏం చేస్తున్నావ్ అని గట్టిగా ప్రశ్నించింది రతిక. ఇక అప్పటి నుంచి ప్రశాంత్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. తర్వాత మెున్న ఫ్రెండ్స్ అంటూ చేతులు కలిపారు. కానీ పెద్దగా మాత్రం మాట్లాడుకోలేదు.

ఇక తాజాగా పెద్దయ్య విడుదల చేసిన వీడియో వీరిద్దరూ మాట్లాడుకోవడం చూడొచ్చు. ఓ బెడ్ రూమ్ లో రతిక పడుకుని ఉంది. మధ్యలో గ్లాస్ ఉంది. ఇటువైపు ప్రశాంత్ ఉన్నాడు. కొంచెం ముందుకు రా అని ప్రశాంత్ అన్నట్టుగా వాయిస్ వినిపిస్తుంది. డ్యాన్స్ రాదని బాగా చేశావ్ అని రతిక చెప్పగా.. డిస్కో డ్యాన్సర్ అంటూ ప్రశాంత్ పాట పాడాడు. ఫ్లోర్ మూమెంట్ వేస్తూ కామెడీ చేశాడు. తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు. ఇక మళ్లీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చూడాలిక.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.