Bigg Boss Telugu: లవ్ స్టోరీ బయటపెట్టిన రైతు బిడ్డ.. బేబీ మూవీలా పల్లవి ప్రశాంత్ ప్రేమ కథ
Bigg Boss Pallavi Prashanth Love Story: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ప్రేమ కథలు వినిపించాయి. ఎవరూ ఊహించని విధంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తన లవ్ స్టోరీని కంటెస్టెంట్స్‌తోపాటు బిగ్ బాస్ ప్రేక్షకులకు చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు డిసెంబర్ 1వ తేది ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..
Bigg Boss 7 Telugu Day 89 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ మధ్యలో ఏ సీజన్‌లో జరగని విధంగా బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. స్పెషల్ టికెట్ కింద హౌజ్ మేట్స్‌కు సాయంత్రం గంటపాటు నిద్రపోయే అవకాశం కల్పించాడు. దీంతో కంటెస్టెంట్స్ ఎగిరి గంతేసారు.

బిగ్ బాస్ సర్ ప్రైజ్
బిగ్ బాస్ చెప్పినట్లుగా కంటెస్టెంట్స్ అంతా సాయంత్రం నిద్రపోయారు. వారు లేచి చూసే సరికి గార్డెన్‌లో ఛాయ్, బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. వాటిని ఆస్వాదిస్తూ తమ ప్రేమ కథలను చెప్పాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో మొదటగా అంతా శివాజీ లవ్ స్టోరీ చెప్పాలని కోరారు. అందుకు ఒప్పుకున్న శివాజీ తన ప్రేమ కథను చెప్పాడు.
ఇంకా లవ్ స్టోరీ నడుస్తోంది
"మాస్టర్ సినిమా అయిపోయింది. ఒక పెద్దాయన ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగింది. ఆరోజు ఫస్ట్ టైమ్ నా భార్యను కలిశాను. అదే మా లవ్ స్టోరీలో మొదటి రోజు. అప్పటికే మనం సెలబ్రిటీ. ఒక ఏడాదిపాటు నడిచింది. చిక్కడపల్లిలో తను ట్యూషన్‌కు వెళ్తుంటే రోజూ వెళ్లి కలిసేవాడిని. డిగ్రీ పూర్తయ్యాక చివరి సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. లవ్ స్టోరీ ఇప్పటికీ నడుస్తుంది" అని హీరో శివాజీ తెలిపాడు.
మొహం చూసుకోడా
శివాజీ తర్వాత శోభా, గౌతమ్, అమర్, అర్జున్ తమ లవ్ స్టోరీస్ చెప్పారు. ఫైనల్‌గా పల్లవి ప్రశాంత్ లవ్ స్టోరీ చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. దీంతో ప్రశాంత్ ఎమోషనల్ అయి చెప్పనని అన్నాడు. హౌజ్ మేట్స్ అంతా బలవంతం పెట్టడంతో తన లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. చిన్నప్పుడు అద్దంలో మొహం చూసుకోడా అని ఎవరో అన్నారని, ఎలా ఉంటాడని వెటకారంగా అనేవాళ్లని, అందుకే అమ్మాయిల జోలికి వెళ్లలేదని ప్రశాంత్ చెప్పాడు.
మధ్యలో ఫ్రెండ్ వచ్చాడు
"పెద్దయ్యాకా ఓ రోజు తను ట్రాక్టర్‌పై వెళ్తుంటే ఓ అమ్మాయి హాయ్ చెప్పింది. కొన్నాళ్లకు మెసేజ్ చేసింది. తను ఎవరో తెలియకుండా మెసేజ్ చేస్తే బ్లాక్ చేస్తానని బెదిరించా. దాంతో తను నా మరదలు అని తెలిసింది. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయికి ఫ్రెండ్ అంటూ ఒకడు వచ్చాడు. అప్పటి నుంచి నాకు మెసేజ్‌లు చేయడం తగ్గించింది. వాడు ఒక్క మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇచ్చేది" అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
పొలం పని వదిలేస్తేనే
"చాలా రోజుల తర్వాత ఓ రోజు ఫోన్ చేసి పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్‌గా చెప్పింది. నాకు తెలిసింది పొలం పనే. దీన్ని విడిచి రానని చెప్పేశా. అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయింది" అని రైతుబిడ్డ ప్రశాంత్ తెలిపాడు. మధ్యలో వచ్చిన ఓ ఫ్రెండ్ వల్ల తనకు బ్రేకప్ అయిందని దాదాపుగా బేబీ మూవీ టైప్ లవ్ స్టోరీని చెప్పాడు పల్లవి ప్రశాంత్.