Bigg Boss 7 Telugu : బాడీ పెంచేదుకు ఇంజెక్షన్ తీసుకున్నావంటూ గౌతమ్ సైగలు.. కోపంతో ప్రిన్స్ అరుపులు-bigg boss 7 telugu latest episode goutham krishna shows fingers to prince yawar about injection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss 7 Telugu Latest Episode Goutham Krishna Shows Fingers To Prince Yawar About Injection

Bigg Boss 7 Telugu : బాడీ పెంచేదుకు ఇంజెక్షన్ తీసుకున్నావంటూ గౌతమ్ సైగలు.. కోపంతో ప్రిన్స్ అరుపులు

బిగ్ బాస్ 7 తెలుగు
బిగ్ బాస్ 7 తెలుగు (Star Maa)

Bigg Boss 7 Telugu : హౌస్ మేట్ అయ్యేందుకు కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ జరుగుతోంది. ఈ సందర్భంలో కొంతమంది కంటెస్టెంట్లు విచక్షణ కోల్పోయి అరుస్తున్నారు. చిన్నగా మెుదలైన గొడవ పెద్దగా అవుతోంది.

బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిగా మారుతోంది. కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే మరో టీమ్ చేస్తున్న పాలిటిక్స్ తో కొంతమందికి అన్యాయం జరుగుతోంది. కానీ బిగ్ బాస్ స్ట్రాటజీతో కంటెస్టెంట్ల మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది. పవర్ అస్త్రాను సాధించేందుకు మరో ముగ్గురు సిద్ధమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్లో మరో హౌస్ మేట్ ఎవరో తేలిపోనుంది. శివాజీ, అమర్‍దీప్, షకీలా రేసులో ఉన్నారు. ఈ ముగ్గురు ఫైనల్స్ కు వచ్చేందుకు జరిగిన పోటీలో గొడవలు ఘోరంగా జరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

తాజా ఎపిసోడ్ మెుదలవ్వడానికి ముందు ప్రిన్స్ యావర్, శివాజీ, షకీలా చేతిలో మాయాస్త్రాలు ఉన్నాయి. ఇందులో ఇద్దరినీ మాత్రమే పవర్ అస్త్రా కోసం ఎంపిక చేయాలి. చివరగా వచ్చిన గౌతమ్ సెలక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ప్రిన్స్ దగ్గర ఉన్న మాయాస్త్రాన్ని తీసుకుని.. శివాజీ చేతిలో పెట్టాడు. శివాజీ టీమ్ ను సరిగా మేనేజ్ చేశాడని, అందరితో ఆడించాడని కారణాలు చెప్పాడు గౌతమ్. రెండు టాస్క్ ల్లో ఆడి.. గెలిపించానని ప్రిన్స్ యావర్ చెప్పుకొచ్చాడు. అమర్ దీప్ కూడా.. ఇది సరైన కారణం కాదని వెల్లడించాడు. యావర్ మాయాస్త్రాన్ని ఇవ్వలేదు. కెమెరాల దగ్గరకు వెళ్లి.. న్యాయం కావాలంటూ అరిచాడు. గేట్స్ ఓపెన్ చేస్తే వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు.

సరైన కారణం చెప్పి.. తీసుకోవాలని గౌతమ్ పై అరిచాడు ప్రిన్స్ యావర్. అది సరైన కారణమే.. అంటూ గౌతమ్ కూడా తిరిగి అరవడం మెుదలుపెట్టాడు. ఇద్దరూ కోపంతా ఊగిపోయారు. గట్టిగట్టిగా అరిచారు. యావర్ చేతితో ఏదో సైగ చేసేందుకు ప్రయత్నించగా.. గౌతమ్ కూడా ఇంజెక్షన్స్ చేస్తున్నట్టుగా సైగ చేశాడు. దీంతో యావర్ కు మరింత కోపం వచ్చింది. నేను బాడీ పెంచేందుకు ఇంజెక్షన్ తీసుకున్నానా అంటూ.. కోపంతో ఊగిపోయాడు. నువ్ చూశావా డబ్బులు ఇచ్చావా అంటూ అరుపులు మెుదలుపెట్టాడు. ఇది కరెక్ట్ కాదు.. బిగ్ బాస్ నేను వెళ్లిపోతానని ఏడిచాడు. ఈ విషయాన్ని గౌతమ్ సమర్థించుకున్నాడు. నేను డాక్టర్ ను ఇంజెక్షన్ తీసుకున్నట్టు నాకు తెలుసని చెప్పాడు.

అమర్ దీప్ వెళ్లి.. యావర్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. శుభ శ్రీ సైతం యావర్ తో పర్సనల్ గా మాట్లాడింది. చాలా మంది యావర్ కు చెప్పే ప్రయత్నం చేశారు. కష్టపడి ఆడానని, అలా ఎలా తీసుకుంటారని చెప్పుకొచ్చాడు ప్రిన్స్. మెుత్తానికి కంటెస్టెంట్లు కన్విన్స్ చేయడంతో మాయాస్త్రాన్ని గౌతమ్ కృష్ణ చేతికి ఇచ్చాడు. అది తీసుకెళ్లి.. శివాజీకి ఇచ్చాడు గౌతమ్. పవర్ అస్త్రా రేసు నుంచి తప్పుకొన్నాడు ప్రిన్స్. బిగ్ బాస్ కన్ఫెషన్ రూములోకి పిలిచి ధైర్యం చెప్పాడు. తర్వాత కాస్త సెట్ అయ్యాడు.

పవర్ అస్త్రా కోసం పోటీ పడేందుకు మరో కంటెస్టెంట్‍ను సెలక్ట్ చేసే అవకాశాన్ని హౌస్ మేట్ సందీప్ కు ఇచ్చాడు బిగ్ బాస్. అమర్ దీప్ ను సెలక్ట్ చేశాడు సందీప్. దీంతో పవర్ అస్త్రా కోసం శివాడీ, షకీలా, అమర్ దీప్ మధ్య పోటీ నెలకొంది. బిగ్ బాస్ చెవిలో గట్టిగా అరవాలని టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే గట్టిగా అరుస్తారో వారికి పవర్ అస్త్రా రానుంది. అది వీకెండ్ ఎపిసోడ్లో తెలియనుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.