Bigg Boss Sivaji: షాకింగ్.. శివాజీ ఎలిమినేట్.. ఉత్త చేతులతో బయటకొచ్చిన మాస్టర్ మైండ్-bigg boss 7 telugu grand finale sivaji eliminated as top 3 contestant ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Sivaji: షాకింగ్.. శివాజీ ఎలిమినేట్.. ఉత్త చేతులతో బయటకొచ్చిన మాస్టర్ మైండ్

Bigg Boss Sivaji: షాకింగ్.. శివాజీ ఎలిమినేట్.. ఉత్త చేతులతో బయటకొచ్చిన మాస్టర్ మైండ్

Sanjiv Kumar HT Telugu

Bigg Boss 7 Telugu Sivaji Eliminate: బిగ్ బాస్ 7 తెలుగు నుంచి హీరో శివాజీ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు మాస్టర్ మైండ్‌గా నిలిచిన శివాజీ ఉత్త చేతులతో బయటకు వచ్చేశాడు.

బిగ్ బాస్ నుంచి శివాజీ ఎలిమినేట్.. ఉత్త చేతులతో బయటకు వెళ్లిన మాస్టర్ మైండ్

Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేలో ఊహించిన ఎలిమినేషన్ జరిగింది. ఫినాలే వీక్‌లోకి ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అర్జున్, యావర్ టాప్ 6 కంటెస్టెంట్స్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. వీరి నుంచి డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విజేతను ప్రకటించనున్నారు.

అయితే గ్రాండ్ ఫినాలేలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అలా ఇప్పటికే టాప్ 6 ప్లేసులో అర్జున్ అంబటిని యాంకర్ సుమ బయటకు తీసుకొస్తే, టాప్ 5 కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయింది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ఇక టాప్ 4 కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, యావర్ రూ. 15 లక్షల సూట్ కేస్‌తో హౌజ్‌ను వీడి బయటకు వచ్చాడు.

నా సామిరంగ ప్రమోషన్స్‌లో భాగంగా హౌజ్‌లోకి సూట్ కేస్‌తో వెళ్లారు అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్. వీరిద్దరి ఇచ్చిన ఆఫర్‌ను ఒప్పుకున్న యావర్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో టాప్ 3లో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ ఉన్నారు. అయితే వీరి స్థానాల్లో ఓటింగ్‌ను మార్పు వచ్చింది. మొదట్లో ఇదే వరుస క్రమం రాగా.. ఆఖరి రోజున శివాజీ, అమర్ స్థానాలు మారాయి. మొదటి స్థానంలో ప్రశాంత్ ఉంటే.. రెండో స్థానంలోకి అమర్ ఎగబాకాడు.

ఇక మూడో స్థానంలో శివాజీ నిలవడంతో టాప్ 3 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ 7 తెలుగు సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం శివాజీనే. అందుకే ఆయనకు మాస్టర్ మైండ్, చాణక్య అని బిరుదులు వచ్చాయి. కానీ, అంతటి గేమ్ ఆడిన శివాజీ హౌజ్ నుంచి ఎలాంటి మనీ లేకుండా ఉత్త చేతులతో బయటకు వచ్చేశాడు. ఇది శివాజీ ఫ్యాన్స్‌కు పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.