Bigg Boss Finale: ఫినాలే అస్త్ర విజేతగా అర్జున్.. బిగ్ బాస్ దిక్కుమాలిన స్ట్రాటజీ.. లెక్కలు తారుమారు-bigg boss 7 telugu finale astra winner arjun ambati and enter to finale ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Finale: ఫినాలే అస్త్ర విజేతగా అర్జున్.. బిగ్ బాస్ దిక్కుమాలిన స్ట్రాటజీ.. లెక్కలు తారుమారు

Bigg Boss Finale: ఫినాలే అస్త్ర విజేతగా అర్జున్.. బిగ్ బాస్ దిక్కుమాలిన స్ట్రాటజీ.. లెక్కలు తారుమారు

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu Ticket To Finale: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో 13వ వారం పెట్టిన టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అర్జున్ అంబటి గెలుచుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అర్జున్ ఈవారం ఎలిమినేట్ కాకుండా ఉంటేనే నేరుగా ఫినాలేలోకి వెళ్లగలడు.

బిగ్ బాస్ ఫినాలే అస్త్ర విజేతగా అర్జున్.. బిగ్ బాస్ దిక్కుమాలిన స్ట్రాటజీ.. లెక్కలు తారుమారు

Bigg Boss 7 Telugu Finale Astra Winner: బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం నామినేషన్ల తర్వాత నుంచి జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ ముగిసింది. ఈ టాస్కుల్లో పెట్టిన అన్ని గేమ్స్‌లలో ఎక్కువగా గెలిచి ఫినాలే అస్త్రను గెలుచుకున్నాడు అర్జున్ అంబటి. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో చివరిగా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి నిలిచారు. వీళ్లలో టాస్కుల్లో జోరు చూపించే ప్రశాంత్ ఔట్ కావడంతో అర్జున్‌కు ప్లస్ అయింది.

చివరిగా మిగిలిన ప్రశాంత్, అమర్, అర్డున్‌కు తాడు లాగే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో తాడు నడుముకు ఉంటుంది. చుట్టూ జెండాలు ఉంటాయి. బలం ఉపయోగించి ఆ జెండాల దగ్గరికి వెళ్లి వాళ్ల బాస్కెట్‌లో జెండాలు వేయాలి. దీంతో అర్జున్ బలం ముందు అమర్, ప్రశాంత్ ఓడిపోయారు. ఇక ప్రశాంత్‌కు తక్కువ పాయింట్స్ ఉండటంతో ఔట్ అయిపోయాడు. ఫైనల్‌గా అర్జున్, అమర్ పోటీ పడ్డారు. రెండు తాడుల సాయంతో బ్యాలెన్స్ చేస్తూ పాము నోట్లోకి బాల్‌ని తీసుకుని వెళ్లాలి.

ఈ టాస్క్‌లో అమర్‌పై అర్జున్ గెలిచాడు. దీంతో ఫినాలే అస్త్రను గెలిచి టికెట్ టు ఫినాలేలోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు అర్జున్. అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇచ్చిన అర్జున్ ఈవారం నామినేషన్స్‌లో ఉన్నాడు. ఈవారం ఎలిమినేట్ కాకుండా ఉంటేనే అర్జున్ నేరుగా ఫినాలేకు వెళ్లగలడు. లేకుంటే టికెట్ టు ఫినాలే క్యాన్సిల్ అవుతుంది. లేదా ప్రశాంత్ ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించి అర్జున్‌ను సేవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది.

ఇదిలా ఉంటే టికెట్ టు ఫినాలేలో కంటెస్టెంట్స్ గెలుచుకున్న పాయింట్స్ మాత్రమే పెడితే ఎవరు విన్నర్ అనేది ఎప్పుడో తెలిసేది. కానీ, ఔట్ అయిపోయిన కంటెస్టెంట్స్ పాయింట్లలో కొంత మొత్తాన్ని ఆటలో ఉన్నవాళ్లకు ఇవ్వాలన్న రూల్ పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఎక్కువ టాస్క్‌లు గెలిచిన అర్జున్ చివరిగా రావడం, ప్రిన్స్ యావర్ ఔట్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ దిక్కుమాలిన స్ట్రాటజీతో గౌతమ్, గౌతమ్, అమర్‌కు ప్లస్ అయ్యాయి. అలా లెక్కలు తారుమారైన ఫైనల్‌గా అర్హుడైన అర్జున్‌ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచాడు.