Bigg Boss Telugu: అట్టడుగు స్థానానికి రతిక.. ఫస్ట్ ప్లేస్ కోసం నలుగురి పోటీ.. బోరున ఏడ్చిన శోభా శెట్టి
Bigg Boss 7 Telugu Today Episode: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో 11వ వారం నామినేషన్ల గొడవ పూర్తయిందో లేదో హౌజ్ మేట్స్ కి కొత్త చిచ్చు పెట్డాడు పెద్దయ్య. ఈసారి పర్ఫామెన్స్ ను బట్టి మీ స్థానాలను ర్యాంక్ చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. దీంతో హౌజ్ మేట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
Bigg Boss Telugu November 12th Episode Promo: సోమవారం, మంగళవారం నామినేషన్లలో బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్ హౌరెత్తింది. ఇక బుధవారం నాడు ర్యాంకింగ్ పేరుతో కంటెస్టెంట్ల మధ్య పెద్ద చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 7 తెలుగు నవంబర్ 12వ తేది ప్రోమోను తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ ప్రోమోలో ప్రతి ఒక్కరి ఓవరాల్ పర్ఫామెన్స్ ను దృష్టిలో ఉంచుకుని హౌజ్ మేట్స్ అంతా చర్చించి ర్యాంకింగ్స్ చేసుకోవాలని బిగ్ బాస్ చెబుతాడు.
ట్రెండింగ్ వార్తలు
బిగ్ బాస్ అనౌన్స్ మెంట్‌తో ర్యాకింగ్స్ ఉన్న స్థానాల్లో హౌజ్ మేట్స్ నిలుచుంటారు. మొదటి ర్యాంక్‌లో యావర్, అర్జున్, గౌతమ్, శివాజీ నిల్చున్నారు. పల్లవి ప్రశాంత్, ప్రియాంక రెండో స్థానంలో, మూడో స్థానంలో శోభా ఉన్నారు. నాలుగో ర్యాంక్‌లో అమర్, అశ్విని ఉన్నారు. నేను టాప్ 5లో ఉండాలనుకుంటున్న అని రతిక రోజ్ అంది. కానీ, హౌజ్ మేట్స్ అంతా తనకు పదో స్థానం ఇచ్చారు. దాంతో రతిక వాదనకు దిగింది. అర్జున్‌తో గట్టిగానే వాదించింది రతిక రోజ్.
ఇదంతా హౌజ్ మేట్స్ నిర్ణయం అని శివాజీ చెప్పడంతో వెళ్లి పదో స్థానంలో నిల్చుంది రతిక రోజ్. నాకు అయితే మొదటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరిక ఉందని అమర్ అంటే.. లాస్ట్ వీక్ చూసినదాన్ని బట్టి 6 అనుకుంటున్నా అని గౌతమ్ చెప్పాడు. దాంతో నవ్వాడు అమర్. అది నాది అని మరి మరి చెబుతున్నాను అంటూ అమర్ చెప్పడం హైలెట్‌గా ఉంది. తర్వాత అమర్, ప్రియాంక మధ్య కూడా చిన్న డిస్కషన్ వచ్చినట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.
స్వతహాగా నువ్ పెద్దగా ఏం చేయలేదని శోభాతో అర్జున్ అన్నాడు. తర్వాత శోభాకు ఏడో స్థానం ఇచ్చారు. దాంతో నాకు సెవెంత్ ప్లేస్ ఏంట్రా అని.. ప్రియాంక, అమర్‌తో చెప్పుకుని శోభా బోరున ఏడ్చేసింది. వాళ్లు డిసైడ్ చేయడమేంట్రా అని అమర్ అన్నాడు. నాకు లక్ ఫేవర్ చేసిందంటా.. లోపలికి వెళ్లి అంత స్పైసీ చికెన్ తిని ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసురా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శోభా శెట్టి.
టాపిక్