Bigg Boss 7 Telugu Day 19: ‘రూ.100 లేక ఇబ్బందులు పడ్డా’: బోరున ఏడ్చేసిన యావర్
Bigg Boss 7 Telugu Day 19: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 19వ రోజు ప్రిన్స్ యావర్ బోరున విలపించాడు. శివాజీతో తన కష్టాలను చెప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో బయటికి వచ్చింది.
Bigg Boss 7 Telugu Day 19: బిగ్బాస్ తెలుగు 7వ సీజన్‍లో కంటెస్టంట్‍ల మధ్య పోరు హోరుగా సాగుతోంది. కంటెండర్‌షిప్ కోసం జరిగిన తంతులో 19వ రోజు ప్రిన్స్ యావర్, ప్రియాంకా జైన్, శోభా శెట్టి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఓ దశలో ప్రియాంకకు వేలు చూపిస్తూ గట్టిగా అరిచేశాడు యావర్. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్ ప్రోమోలను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోల్లో ఏముందంటే..
ట్రెండింగ్ వార్తలు
కంటెండర్‌షిప్ కోసం ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ రేసులో ఉండగా.. బిగ్‍బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఎవరు వీకెస్ట్ కంటెండరో మిగిలిన కంటెస్టెంట్లు నిర్ణయించేలా ఓ గేమ్ పెట్టారు. యావర్, శోభా, ప్రియాంక బొమ్మలు పెట్టి.. వీకెస్ట్ అనుకునే వారి బొమ్మపై సుత్తితో కొట్టాలని కంటెస్టెంట్‍లకు చెబుతారు. ఈ క్రమంలో ప్రిన్స్ యావర్ కోపపడతాడు. తనతోనే ఇమ్యూనిటీ కోసం టాస్క్ ఆడేందుకు ప్రియాంక ఇష్టపడుతోందని శోభా చెబుతోంది. దీంతో లేడీస్‍తోనే ప్రియాంక టాస్క్ ఆడుతుందా అని బిస్‍బాగ్‍ను యావర్ అడిగాడు. ఈ క్రమంలో యావర్, ప్రియాంక మధ్య గొడవ జరిగింది. ప్రియాంకకు వేలు చూపిస్తూ ఆరిచాడు యావర్. మధ్యలో సందీప్ కలగజేసుకొని యావర్‌ను వారిస్తాడు. దీంతో ఇంకా కోపం తెచ్చుకున్న యావర్.. తన బొమ్మనే సుత్తితో పగలగొడతాడు.
ఆ తర్వాత రెండో ప్రోమోలో.. ప్రిన్స్ యావర్ బోరున ఏడ్వడం ఉంది. శివాజీతో అతడు మాట్లాడాడు. తన సోదరుడిని నుంచి తనకు ఈ కోపం వచ్చిందని యావర్ చెప్పాడు. ఓ దశలో జీవితంలో రూ.100 కూడా లేక ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు యావర్. అతడిని శివాజీ ఓదార్చాడు. “దేవుడు నిన్ను ఇక్కడి వరకు పంపాడు, నీకు కూడా టైమ్ వస్తుంది” అని యావర్‌ను శివాజీ ఓదార్చాడు. ఆ తర్వాత ప్రియాంక, శోభాశెట్టి మధ్య మూడో పవర్ అస్త్ర, మూడు వారాల ఇమ్యూనిటీ కోసం గేమ్ జరిగింది. యంత్రపు ఎద్దుపై సవారీ చేస్తూ ఎక్కువసేపు ఎవరు ఉంటారో వారు విజేత అని బిగ్‍బాస్ ప్రకటించారు. ఈ గేమ్‍లో శోభకు గాయమైనట్టు ప్రోమోలో ఉంది. మరి, పవర్ అస్త్ర టాస్కులో ఎవరు గెలిచారో నేటి బిగ్‍బాస్ 19వ రోజు ఎపిసోడ్‍లో వెల్లడికానుంది. ప్రోమోలను ఈ కింద చూడండి.
aa