Bigg Boss 7 Nominations : మళ్లీ ఫిట్టింగ్ పెట్టేసిన పెద్దయ్య.. నామినేషన్స్‌లో ఏడుగురు
Bigg Boss 7 Nominations : బిగ్ బాస్ సీజన్ 7లో మూడోవారం నామినేషన్స్ జరిగాయి. ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఎపిసోడ్ చివరలో ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ప్రారంభమైన టైములో ఉన్న ఆసక్తి మాత్రం ఇప్పుడు లేదని చాలా మందికి అనిపిస్తుంది. మెుదట్లో కాస్త ఆసక్తిగా సాగేవి ఎపిసోడ్స్.. ఇప్పుడు మాత్రం కాస్త బోర్ గా సాగుతున్నాయి. సరిగా కంటెస్టెంట్స్ ఎంటర్ట్మైన్మెంటే ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెుత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడో వారానికి వచ్చేసింది. నామినేషన్స్ కూడా జరిగాయి.
ట్రెండింగ్ వార్తలు
నామినేషన్స్ సందర్భంగా కొంతమంది మధ్య గొడవ జరిగింది. కొందరు నామినేషన్స్ సమయంలో బాగా సీరియస్ అయ్యారు. దామిని మీద యావర్ గట్టిగా ఫైర్ అయ్యాడు. ఇక నామినేట్ అయిన కంటెస్టెంట్స్ చూసుకుంటే.. శుభశ్రీ, ప్రియాకం, దామిని, గౌతమ్, యావర్, రతిక, అమర్ దీప్ ఉన్నారు.
నామినేషన్స్ కు దూరంగా ఉంటూ వచ్చిన శుభశ్రీని కొందరు కంటెస్టెంట్స్ ఈసారి టార్గెట్ చేశారు. ఇంటి పనుల్లో యాక్టివ్ గా ఉంటడం లేదని నామినేట్ చేశారు. కానీ శుభశ్రీ మాత్రం.. ఇందుకు అస్సలు ఒప్పుకోలేదు. తాను కూడా పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. కంటెస్టెంట్స్ మాత్రం.. నువ్ చపాతీలు చేయడం మాత్రమే పని అనుకుంటున్నావని తెలిపారు. అమర్ దీప్, రతిక, దామిని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా దామిని మీద ఫైర్ అయింది.
టీమ్ మాట వినలేదని రతికను నామినేట్ అయింది. గౌతమ్ కూడా గతవారం టాస్క్ ల విషయంపైనే నామినేట్ అయ్యాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ వస్తున్న ప్రియాంక కూడా ఈసారి టార్గెట్ అయింది. ప్రియాంక ప్రవర్తన బాగాలేదని ప్రిన్స్ యావర్ నామినేట్ చేశాడు. నువ్ కూడా సరిగా ఉండటం లేదని ఫైర్ అయింది ప్రియాంక. అందరి పనులు చేస్తుంటే.. ఎవరికీ తెలియడం లేదని, ఇక రేపటి నుంచి చూపిస్తానంటూ చెప్పింది. యావర్ ను దామిని నామినేట్ చేస్తుంటే.. పెద్ద యుద్ధమే జరిగింది. నీ ప్రవర్తన సరిగా లేదని యావర్ కు దామిని చెప్పింది. మెున్న పవర్ అస్త్రా రేసు నుంచి తప్పుకొన్నాక.. నువ్ చేసింది డ్రామాలాగా అనిపించిందని చెప్పింది. దీంతో యావర్ సీరియస్ అయ్యాడు. అది నా ఎమోషన్ డ్రామా ఎలా అవుతుంది. నువ్ చెప్పిన విషయాన్ని వెనక్కు తీసుకోమని కాసేపు గొడవ పడ్డాడు. కంటెస్టెంట్స్ యావర్ కు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వినిపించుకోలేదు. పెద్ద పెద్దగా మళ్లీ అరిచాడు యావర్.
అమర్ దీప్ కూడా ఈసారి నామినేషన్స్ లోకి వచ్చాడు. తేజ పద్ధతి కూడా బాగా లేదని, పుల్లలు పెడుతున్నాడని నామినేట్ చేశారు. ఇక్కడ కూడా కాసేపు వాగ్వాదం జరిగింది. నామినేషన్స్ ముగిసేసరికి.. శుభశ్రీ, ప్రియాంక, గౌతమ్ కృష్ణ, దామిని, యావర్, రతిక, తేజ ఉన్నారు. కాగా ఇక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు.
సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రాలు ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరికి ఓ టాస్క్ ఇచ్చాడు. నామినేషన్స్ లో ఉన్న ఓ కంటెస్టెంట్ ను సేవ్ చేయాలని, అలాగే సేఫ్ గా ఉన్న కంటెస్టెంట్స్ లోని ఒకరిని నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో నామినేషన్స్ లో ఉన్న తేజను సేవ్ చేసి అమర్ దీప్ ను సెలక్ట్ చేశారు. దీంతో అమర్ దీప్ సీరియస్ అయ్యాడు. పవర్ అస్త్రా కోసం ఛాన్స్ ఇచ్చినా ఉపయోగించుకోలేదని సందీప్ చెప్పాడు. ప్రశాంత్ కోసం నన్ను నామినేట్ చేశారని శివాజీతో అన్నాడు అమర్ దీప్. కావాలనే టార్గెట్ చేసినట్టుగా ఉందని చెప్పుకొచ్చాడు.