Bigg Boss 7 Telugu Nominations: బిగ్‍బాస్‍లో ఈ వారం నామినేషన్లలో ఎవరు ఉండనున్నారంటే!
Bigg Boss 7 Telugu Nominations: బిగ్‍బాస్ 13వ వారంలో ఎవరెవరు నామినేషన్లలో ఉండనున్నారో సమాచారం బయటికి వచ్చింది. మొత్తంగా ఏడుగురు నామినేట్ కానున్నారని తెలుస్తోంది.
Bigg Boss 7 Telugu Nominations: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 13వ వారంలో అడుగుపెట్టింది. 12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో అశ్వినీ శ్రీ, రతిక రోజ్ ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ప్రస్తుతం బిగ్‍బాస్ హౌస్‍లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. 13వ వారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం అయిన నేడు (నవంబర్ 27) జరగనుంది. ఈసారి కూడా కంటెస్టెంట్ల మధ్య హీట్‍గా వాగ్వాదం జరిగినట్టు ప్రోమోలను చూస్తే తెలుస్తోంది. కాగా, ఈవారం ఎలిమినేషన్ కోసం కంటెస్టెంట్లు ఎవరెవరు నామినేట్ కానున్నారో సమాచారం లీకైంది.
ఈసారి కూడా హౌస్‍లో నామినేషన్ల ప్రక్రియ మంచి రసవత్తరంగా సాగింది. నామినేట్ చేయాలనుకునే వారి ముఖానికి పెయింట్‍ను పూయాలని కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ చెప్పారు. నామినేషన్లలో ముఖ్యంగా శివాజీని ఎక్కువ మంది కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు. ప్రియాంక, అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ.. శివాజీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ, శివాజీ మధ్య వాగ్వాదం నడిచింది.
శోభా శెట్టి, యావర్ మధ్య కూడా మాటల గొడవ జరిగింది. నమ్మినందుకు మోసం చేశావంటూ అమర్ దీప్‍ను పల్లవి ప్రశాంత్ ప్రశ్నించారు. అలాగే, శోభా శెట్టి, ప్రశాంత్ మధ్య కూడా మాటల వార్ నడిచింది.
నామినేట్ అయింది వీరే!
బిగ్‍బాస్ 13వ వారం అమర్‌దీప్ చౌదరి తప్ప మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని సమాచారం బయటికి వచ్చింది. ప్రోమోల్లోనూ ఇది స్పష్టమవుతోంది.
13వ వారంలో అంబటి అర్జున్, శోభా శెట్టి, శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ నామినేట్ కానున్నారు. ఈసారి అమర్‌ను ఎవరూ నామినేట్ చేయలేదు.
నామినేషన్ల సందర్భంగా పల్లవి ప్రశాంత్, శోభ మధ్య మాటల యుద్ధం జరిగింది. అమర్ కెప్టెన్సీ పోయేందుకు కారణమైనందుకే ప్రశాంత్‍ను నామినేట్ చేస్తున్నానని శోభ చెప్పారు. ఇందుకు ప్రశాంత్ అంగీకరించలేదు. “నా వల్ల కెప్టెన్సీ పోయిందా” అని అమర్‌ను ప్రశ్నించారు. అమర్ ఏమీ మాట్లాడలేదు. ప్రశాంత్ ఏదో మాట్లాడుతుంటే.. ప్రశాంత్ పాయింట్ చెప్పనివ్వు అంటూ గట్టిగా అరిచారు శోభ. దోస్తానా గేమ్ మళ్లీ మొదలుపెట్టావ్ అంటూ ప్రశాంత్ అన్నారు. పెయింట్ పూయడానికి వస్తుంటే శోభను అడ్డుకున్నారు. ప్రశాంత్, యావర్‌ను సపోర్ట్ చేస్తున్నారంటూ శివాజీతో వాగ్వాదానికి దిగారు గౌతమ్. వీరి మధ్య కూడా మాటల వార్ బాగానే జరిగింది. ఈ నామినేషన్ల తంతు నేటి ఎపిసోడ్‍లో రానుంది.