Bigg Boss Nominations: లీకైన బిగ్ బాస్ నామినేషన్స్.. ఆ ఇద్దరి మధ్య ఘోరమైన ఫైట్.. మరో ఇద్దరు సేఫ్
Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు మిగిలారు. వీరికి ఎప్పటిలాగే నామినేషన్స్ నిర్వహించగా 12వ వారం 8 మంది నామినేట్ అయ్యారు. నామినేషన్ల నుంచి సేఫ్ అయిన ఇద్దరు ఎవరనే విషయంలోకి వెళితే..
Bigg Boss 7 Telugu 12th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ఇప్పుడు 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 11వ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవడంతో గతం వారం ఉన్నట్లుగానే ఈవారం 10 మంది ఉన్నారు. ఇక ఈ కంటెస్టెంట్స్ కి 12 వారానికి సంబంధించిన నామనేషన్స్ నిర్వహించాడు బిగ్ బాస్.
ఈసారి వినూత్నంగా బిగ్ బాస్ 7 తెలుగు 12వారం నామినేషన్స్ జరిగాయి. ఒక రూమ్‌లో చుట్టూ అడవి ఫీల్ కలిగేలా సెట్ చేశారు. అక్కడ కంటెస్టెంట్స్ సింహాన్ని ఎదుర్కోవాలని, అది బాగా ఆకలితో ఉందని, దాని నోట్లో నామినేట్ చేయాలనికునేవారి ఫొటోతో ఉన్న చికెన్ ముక్కలను పెట్టి సింహం ఆకలి తీర్చాలని బిగ్ బాస్ చెప్పాడు. అలా నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టమని బిగ్ బాస్ ఆదేశించాడు.
బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ప్రిన్స్ యావర్, రతికను అమర్ దీప్ నామినేట్ చేశాడు. బాల్ టాస్కులో ఫౌల్ గేమ్ ఆడావని అమర్ దీప్ కారణంగా చెబితే.. అది చూడకపోవడం సంచాలక్‌గా అమర్ తప్పు అని యావర్ డిఫెండ్ చేసుకున్నాడు. అలాగే హీరో శివాజీని, పల్లవి ప్రశాంత్‌ను గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. తర్వాత వచ్చిన అర్జున్ అంబటి కూడా హీరో శివాజీని నామినేట్ చేశాడు.
హీరో శివాజీతో పాటు ప్రిన్స్ యావర్‌ను అర్జున్ నామినేట్ చేసినట్లు సమాచారం. ఇలా నామినేషన్లలో మొత్తంగా 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 7 తెలుగు 12 వారం నామినేషన్లలో శివాజీ, రతిక, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, అశ్విని ఉన్నారు. ఇక ప్రియాంక, శోభా శెట్టి మాత్రం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు.
ఇదిలా ఉంటే 12 వారం నామినేషన్స్ కూడా చాలా హోరాహోరీగా సాగినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఇందులో ప్రిన్స్ యావర్-అమర్ దీప్ మధ్య భారీగా ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ అరుపులతో గొడవ పడ్డారట. అలాగే, శివాజీ, గౌతమ్ మధ్య కూడా వాగ్వాదం జరిగిందని సమాచారం.