Bigg Boss Voting: షాకింగ్ ఓటింగ్.. వాళ్ల కారణంగా అతనికి ఎక్కువగా.. బెస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్
Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం ఓటింగ్ లెక్కల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి హీరో శివాజీ, రైతు బిడ్డ ప్రశాంత్ నామినేషన్లలో లేకపోయేసరికి వారి ఓట్లు మరొకరికి చాలా ప్లస్ అయ్యాయి. దీంతో అమర్ దీప్ వెనుకంజలో పడిపోయాడు.
Bigg Boss 7 Telugu 11th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం నామినేషన్లు అరుపులు, గొడవలతోపాటు కాస్తా రొమాంటిక్ అండ్ కామెడీగా కూడా నడిచాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ పదకొండో వారం నామినేషన్లలో శోభా శెట్టి-రతిక రోజ్-ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్-అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్-అమర్ దీప్ మధ్య భారీ బిగ్ ఫైట్ జరిగింది. యావర్, అమర్ అయితే కొట్టుకునేంత పని చేశారు.
అమర్-అశ్విని మధ్య నామినేషన్స్ కామెడీగా సాగాయి. నా మనోభావాలు దెబ్బతిన్నాయి బావా అంటూ అమర్‌ను అశ్విని నామినేట్ చేయడంతో హౌజ్ అంతా కేకలు పెట్టారు. ఇలా సాగిన బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం నామినేషన్లలో అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ,, ప్రిన్స్ యావర్ ఎనిమిది మంది ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా హీరో శివాజీ, అర్జున్ ఒక్కడే నామినేట్ చేయడంతో పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యారు.
మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఆరోజు నుంచో ఓటింగ్ పోల్స్ పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. మొదటి రోజు ఓటింగ్ పోల్స్ చూస్తే.. వాటిలో 31.91 శాతంతో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే, సాధారణంగా యావర్‌కు ఓట్స్ బాగానే పడతాయి. కానీ, ఈసారి శివాజీ, ప్రశాంత్ నామినేషన్లలో లేకపోయేసరికి వారికి ఫ్రెండ్ అయినా యావర్‌కు అత్యధికంగా ఓట్స్ పడినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రభావంతో సీరియల్ హీరో అమర్ దీప్ రెండో స్థానంతో వెనుకంజలో పడిపోయాడు.
అమర్ దీప్‌కు 22.31 శాతం ఓట్లు వచ్చాయి. 14.38 శాతంతో మూడో స్థానంలో రతిక రోజ్, 7.79 శాతంతో నాలుగో స్థానంలో అర్జున్, 6.67 శాతంతో ఐదో స్థానంలో ప్రియాంక, 6.27 శాతంతో అశ్విని శ్రీ ఆరో స్థానంలో ఉన్నారు. ఇక 6.1 శాతంతో గౌతమ్ కృష్ణ ఏడో స్థానం, 4.56 శాతంతో శోభా శెట్టి 8వ స్థానంతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. శుక్రవారం వచ్చేవరకు ఈ ఓటింగ్ మారే అవకాశం ఉంది.
ఒకవేళ ఇలాగే ఉంటే ఎప్పటిలానే శోభా శెట్టికి బదులు తనకంటే బెటర్ కంటెస్టెంట్ అయిన గౌతమ్‌ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. లేదా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన శోభా శెట్టినే ఎలిమినేట్ చేసే మరో ఛాన్స్ కూడా ఉంది. మరి చూడాలి బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారనేది.