Bigg Boss Nominations: ఈవారం నామినేషన్లలో 8 మంది.. శివాజీతోపాటు అతనొక్కడే సేఫ్
Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ 7 తెలుగులో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు మిగిలారు. బిగ్ బాస్ తెలుగు 11వ వారం నామినేషన్లలో 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే, కెప్టెన్ శివాజీతోపాటు ఆ కంటెస్టెంట్ ఒక్కడే నామినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు.
Bigg Boss 7 Telugu 11th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు పదకొండో వారం నామినేషన్లు కూడా బాగానే హోరా హోరీగా సాగాయి. ప్రిన్స్ యావర్-అమర్ దీప్, అశ్విని-ప్రియాంక-రతిక, అర్జున్-పల్లవి ప్రశాంత్ మధ్య గట్టిగానే వార్ జరిగింది. దీంతో ఈ వారం కూడా నామినేషన్ల ప్రక్రియ రెండు రోజులు సాగింది. బాటిల్ బ్రేక్ చేసే కాన్సెప్టుతో జరిగిన 11వ వారం నామినేషన్ల పరంపర సోమవారం (నవంబర్ 13) మొదలై మంగళవారం (నవంబర్ 14) పూర్తి అయ్యాయి.
అదే హైలెట్
ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో పది మంది సభ్యులు మిగిలారు. వారికి సోమవారం 11వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం అర్జున్-ప్రశాంత్, శోభా-రతిక-ప్రియాంక మధ్య బాగానే వార్ జరిగింది. అలాగే మంగళవారం నాటి నామినేషన్లలో ఎక్కువగా అమర్ దీప్-ప్రిన్స్ యావర్ మధ్య వాగ్వాదం హైలెట్ అయింది. వీరు గొడవ పెట్టుకున్న దానికి ప్రధాన కారణం రతిక అని చెప్పొచ్చు.
రతిక చెప్పడంతో
రతిక చెప్పిన మాట విని అమర్ దీప్‌ను నామినేట్ చేశాడు ప్రిన్స్ యావర్. తను హైప్ కోసమే రతిక చుట్టూ తిరుగుతున్నట్లు అమర్ దీప్ అన్నందుకు హర్ట్ అయ్యానంటూ నామినేట్ చేశాడు యావర్. ఈ క్రమంలో ఒకరిమీదకు మరొకరు వెళ్లిపోయారు. దాదాపు కొట్టుకునేంత పని చేశారు. కానీ, మధ్యలోకి వచ్చి కెప్టెన్ శివాజీ వారిని అడ్డుకున్నాడు. ఇదే కాకుండా అశ్విని-ప్రియాంక మధ్య కూడా గట్టి మాటల యుద్ధం జరిగింది. ఈ గొడవలు పక్కన పెడితే 11వ వారం ఎక్కువగా రివేంజ్ నామినేషన్స్ జరిగాయి.
వారిద్దరికే ఎక్కువ ఓట్లు
అలా బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం నామినేషన్లలో ఎనిమిది మంది ఉన్నారు. వారిలో అమర్ దీప్, శోభా శెట్టి, రతిక రోజ్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, అశ్విని శ్రీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ నామినేషన్లలో ఉన్నారు. అయితే, ఎనిమిది మందిలో ఎక్కువగా రతిక, శోభా శెట్టికి ఎక్కువ నామినేషన్ ఓట్లు పడినట్లు తెలుస్తోంది.
దివాళీ సెలబ్రేషన్స్
ఇక కెప్టెన్ అయిన కారణంగా శివాజీ నామినేషన్లలో లేడు. అలాగే అర్జున్ అంబటి ఒక్కడే నామినేట్ చేసిన కారణంగా పల్లవి ప్రశాంత్ కూడా నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యాడు. నామినేషన్ల తర్వాత బిగ్ బాస్ తెలుగు హౌజ్‌లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. హౌజ్ మేట్స్ అంతా కలిసి బాణాసంచా కాల్చి దివాళి పండుగను జరుపుకున్నారు.