Bigg Boss 6 Telugu Episode 23: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే
Bigg Boss 6 Telugu Episode 23: ఈ వారం నామినేషన్స్‌లో పదిమంది కంటెస్టెంట్స్ నిలిచారు. ఇనాయా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతూ, రాజ్, అర్జున్ కళ్యాణ్, కీర్తి నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
Bigg Boss 6 Telugu Episode 23: నామినేషన్స్ వచ్చాయంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం కామన్ గా మారిపోయింది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ కంటెస్టెంట్స్ మాటల యుద్ధం, వాదనలతో ముగిసింది. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం పది మంది నిలిచారు.ఇనాయా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతూ, రాజ్ ఓటింగ్ ప్రకారం నామినేట్ అవ్వగా అర్జున్ కళ్యాణ్, కీర్తి లను హోస్ట్ నామినేట్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
కెప్టెన్ కారణంగా ఆదిరెడ్డిని నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. తొలుత శ్రీహాన్ వంతు రాగా అతడు రాజ్‌ను నామినేట్ చేశాడు. అడవిలో దొంగ గేమ్‌లో రాజ్ రూల్స్‌కు విరుద్ధంగా ఆడాడని చెప్పాడు. ఆ తర్వాత ఇనాయాను నామినేట్ చేశాడు. పిట్టగొడవలో ఇనాయా తప్పు ఉంది కాబట్టే ఆమెను నామినేట్ చేసినట్లు చెప్పాడు.
ఫౌల్ గేమ్ ఆడిన ఇనాయా
ఆ తర్వాత సుదీప కూడా ఇనాయానే నామినేట్ చేసింది. అబద్దాన్ని పదిమార్లు చెప్పినంత మాత్రానా అది నిజం కాదని, ఇనాయా బిహేవియర్‌లో మార్పు వచ్చిందని అందుకే నామినేట్ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత రేవంత్‌ను కూడా నామినేట్ చేసింది. గేమ్‌ను గ్రూప్‌గా కాకుండా పర్సనల్‌గా ఆడినందుకు రేవంత్‌ను నామినేట్ చేసినట్లు చెప్పింది.
గీతూ చంటి, ఇనాయాను నామినేట్ చేసింది. ఇనాయా ఫౌల్ గేమ్ ఆడిందని పేర్కొన్నది. ఆరోహి... రేవంత్, ఇనాయాను నామినేట్ చేసింది. శ్రీసత్య కూడా ఇనాయా, రేవంత్‌ను నామినేట్ చేసింది. వంట టాస్క్‌లో రేవంత్ మాటలు తనను హార్ట్ చేశాయని చెప్పింది. సూర్య, రేవంత్‌లను బాలాదిత్య నామినేట్ చేశాడు.
ఏజ్ గురించి జోక్స్ వేయడం నచ్చలేదు...
ఇనాయా...సుదీప, శ్రీహాన్‌ను నామినేట్ చేసింది. తన ఏజ్ గురించి శ్రీహాన్ తప్పుగా మాట్లాడాడని అన్నది. తన గురించి ఏం తెలుసునని అలా మాట్లాడావని సీరియస్ అయ్యింది. తన ఏజ్, బాడీ వాయిస్ విషయంలో ఎవరు జోక్ చేసినా నచ్చదని చెప్పింది. గీతూ, ఇనాయాను చంటి నామినేట్ చేశాడు. అర్జున్ కళ్యాణ్...రాజ్, గీతూ లను నామినేట్ చేశాడు.
శ్రీహాన్, ఇనాయా గొడవ పడుతున్నప్పుడు మధ్యలోకి గీతూ రావడం తనకు నచ్చలేదని అందుకే గీతూను నామినేట్ చేసినట్లు చెప్పాడు. వాసంతి, ఇనాయాలను ఆర్జే సూర్య నామినేట్ చేశాడు. శ్రీసత్య, అరోహిలను రేవంత్ నామినేట్ చేశాడు. రాజ్...శ్రీహాన్, ఆరోహిలను నామినేట్ చేశాడు. తన వాయిస్‌ను ఆరోహి ఇమిటేట్ చేయడం నచ్చలేదని రాజ్ పేర్కొన్నాడు.
ఇనాయా ఎమోషనల్
సూర్య,ఇనాయాను రోహిత్-మరీనా నామినేట్ చేశారు. ఇనాయా గేమ్‌లో అగ్రెసివ్‌గా ఆడుతున్నదని, కానీ అదే తనకు మైనస్ అవుతుందని రోహిత్ చెప్పాడు. రోహిత్ మాటలకు ఇనాయా ఎమోషనల్ అయ్యింది. కీర్తి కూడా ఇనాయాను నామినేట్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరి గొడవ పడ్డారు. ఆ తర్వాత ఆమె రేవంత్‌ను కూడా నామినేట్ చేసింది. ప్రతి విషయంలో తన బాధను ఎలివేట్ చేస్తున్నారని, ఆ విషయం నచ్చలేదని అందుకే రేవంత్‌ను నామినేట్ చేసినట్లు చెప్పింది.
ఫైమా ఆరోహిని నామినేట్ చేసింది. ఆమె మాట్లాడేవిధానం బాగాలేదని చెప్పింది. ఆ తర్వాత సుదీపను నామినేట్ చేసింది. గేమ్‌లో సుదీప ఎక్కువగా కనిపించలేదని అందుకే ఆమెను నామినేట్ చేసినట్లు ఫైమా పేర్కొన్నది. ఆరోహిని ఆదిరెడ్డి నామినేట్ చేశాడు. కెప్టెన్‌గా తాను చెప్పిన మాటను వినకపోవడం బాధించిందని అన్నాడు. ఆమెతో పాటు సుదీపను కూడా నామినేట్ చేశాడు. నామినేషన్ టాస్క్ లో ఇనాయాకు తొమ్మిది ఓట్లు వచ్చాయి.