Bigg Boss 6 Telugu Promo: బిగ్ బాస్ సండే గెస్ట్ గా తమన్నా- అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య మధ్య ఏదో ఉంది-bigg boss 6 telugu tamannaah to grace the weekend episode promo viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Tamannaah To Grace The Weekend Episode Promo Viral

Bigg Boss 6 Telugu Promo: బిగ్ బాస్ సండే గెస్ట్ గా తమన్నా- అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య మధ్య ఏదో ఉంది

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 05:37 PM IST

Bigg Boss 6 Telugu Promo: బిగ్‌బాస్‌ వీకెండ్ కు తమన్నా స్పెషల్ గెస్ట్ గా హాజరుకానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.

అర్జున్ కళ్యాణ్
అర్జున్ కళ్యాణ్ (twitter)

Bigg Boss 6 Telugu Promo: బిగ్‌బాస్‌ సీజన్ 6 ప్రారంభం నుంచి ప్రతి వీకెండ్ ఓ గెస్ట్ సందడి చేస్తూనే ఉన్నారు. ఈ ఆదివారం మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ గెస్ట్ గా రానుంది. బిగ్‌బాస్‌ ద్వారా బబ్లీ బౌన్సర్ సినిమాను ప్రమోట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో తమన్నాపై పంచ్ లు వేస్తూ నాగార్జున కనిపించాడు. అమాయకత్వం, రఫ్ నెస్ ను ఒకే క్యారెక్టర్ లో చూపించడం చాలా టఫ్ జాబ్ అంటూ తమన్నా చెప్పగానే అమాయకత్వం నీకసలు లేదుగా అంటూ నాగార్జున ఆమెపై పంచ్ వేశాడు. ఈ సండే రోజు తమన్నా కానుక అంటూ ప్రకటించాడు నాగార్జున.

ఆ తర్వాత తమన్నా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టింది. ఎవరు మీకు లేడీ బౌన్సర్ గా ఉంటే బాగుంటుందో చెప్పాలని మేల్ కంటెస్టెంట్స్ ను కోరాడు నాగార్జున. తొలుత చంటి తనకు ఫైమా బౌన్సర్ గా ఉంటే బెటర్ అంటూ బ్యాండ్ ను ఆమె చేతికి కట్టాడు. రాజశేఖర్ రాత్రి పూట ఒక రకంగా పడుకుంటున్నాడని, తన దిండు, దుప్పటి మాయమవుతున్నాయని అతడి నుంచి తనను తాను కాపాడుకోవడానికే ఫైమాను బౌన్సర్ గా నియమించుకోవాలని అనుకుంటున్నట్లు చంటి పేర్కొన్నాడు. ఫైమా ఒక్కదానికే రాజ్ భయపడతాడంటూ చంటి నవ్వులను పూయించాడు.

ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్...గీతూ, శ్రీసత్యలలో ఒకరిని ఎంచుకుంటానని అన్నాడు. అతడు శ్రీసత్య పేరు చెప్పగానే ఆడియోన్స్ నుంచి కేకలు వినిపించాయి. ఆ స్పందనకు గల కారణాల్ని ఆడియోన్స్ ను అడిగి తెలుసుకున్నాడు నాగ్. వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఆడియోన్స్ చెప్పగానే తమ మధ్య ఏం లేదని శ్రీసత్య తనకు మంచి ఫ్రెండ్ అని అర్జున్ కళ్యాణ్. అతడి మాటలకు తాను ఏం అనలేదంటూ నాగ్ అనడం నవ్వులను పూయిస్తోంది.

చాలా సినిమాల్లో హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ ఫ్రెండ్ షిప్ తోనే మొదలవుతుందని తమన్నా ఆ టాపిక్ ను కొనసాగించింది. 100 పర్సెంట్ లవ్ లో నాగచైతన్య, తమన్నా మొదట కొట్టుకొనే ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారంటూ నాగార్జున చెప్పాడు. అందులో మహాలక్ష్మికి కూడా చికెన్ ఇష్టమంటూ శ్రీసత్యను ఉద్దేశించి నాగార్జున ఫన్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.