Bigg Boss 6 Telugu Elimination:మిడ్ వీక్ ఎలిమినేషన్ - శ్రీసత్యకు బిగ్‌బాస్ షాక్ ఇవ్వనున్నాడా
Bigg Boss 6 Telugu Elimination: బిగ్‌బాస్ 6 తెలుగు మిడ్ వీక్‌లో శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ పర్సెంట్ తక్కువగా రావడంతో శ్రీసత్య హౌజ్‌ను వీడినట్లు సమాచారం.
Bigg Boss 6 Telugu Elimination: బిగ్‌బాస్ 6 తెలుగులో ఫైనల్ చేరే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తితో పాటు శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు హౌజ్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు. మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు
ఆ కంటెస్టెంట్ ఎవరన్నది గురువారం (నేడు) తేలనుంది. శ్రీసత్య, రోహిత్, కీర్తిలలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో అందరి కంటే అతి తక్కువగా ఓట్లు శ్రీసత్యకు వచ్చినట్లు సమాచారం. ఆమె హౌజ్‌ను వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శ్రీసత్య ఎమిటినేట్ అయినట్లుగా పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ సీజన్‌లో ముందు నుంచి శ్రీసత్యపై నెగెటివిటీ ఎక్కువగానే ఉంది. టాస్క్‌లలో పెద్దగా పార్టిసిపేషన్ లేదు. శ్రీహాన్, అర్జున్ కళ్యాణ్, రేవంత్ సహాయంతో గెలుస్తూ వచ్చింది. ఎమోషనల్ గేమ్ ఫైనల్‌లో వర్కవుట్ కాలేదని తెలిసింది. ఆమె కంటే కీర్తి, రోహిత్ లకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు చెబుతున్నారు.
ఫైనల్ ఎప్పుడంటే
అరుగురిలో ఒకరు ఎలిమినేట్ అయితే మిగిలిన ఐదుగురు ఫైనల్‌కు చేరుకుంటారు.ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరన్నది ఆదివారం తేలనుంది. బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 18న జరుగనున్నది.
బిగ్‌బాస్ 6 తెలుగు మిడ్ వీక్‌లో శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ పర్సెంట్ తక్కువగా రావడంతో శ్రీసత్య హౌజ్‌ను వీడినట్లు సమాచారం.