Bigg Boss 6 Telugu Episode 26: రేవంత్‌కు బిగ్‌బాస్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ - హౌజ్‌లో మ‌రో కొత్త ల‌వ్ స్టోరీ-bigg boss 6 telugu revanth gets emotional after seeing video of his wife baby shower event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu Episode 26: రేవంత్‌కు బిగ్‌బాస్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ - హౌజ్‌లో మ‌రో కొత్త ల‌వ్ స్టోరీ

Bigg Boss 6 Telugu Episode 26: రేవంత్‌కు బిగ్‌బాస్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ - హౌజ్‌లో మ‌రో కొత్త ల‌వ్ స్టోరీ

Bigg Boss 6 Telugu Episode 26: రేవంత్ కు బిగ్‌బాస్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇచ్చిన గిఫ్ట్ చూసి రేవంత్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. హౌజ్‌లో న‌మ్మిన వాళ్లే త‌న‌ను మోసం చేస్తున్నారంటూ గీతూ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ది. ఆరోహిపై ఆర్జే సూర్య అలుగుతూ క‌నిపించాడు. వీటితో పాటు 26వ‌ ఎపిసోడ్‌లోని హైలైట్స్ ఏవంటే

రేవంత్ (Twitter)

Bigg Boss 6 Telugu Episode 26: హోటల్ టాస్క్ లో అర్జున్ తనకు బాగా హెల్ప్ చేశాడంటూ చెప్పిన శ్రీసత్య అతడికి థాంక్స్ చెప్పింది. నువ్వు అడిగిందానికి ఏదైనా రెట్టింపు ఇస్తా అంటూ అర్జున్ కళ్యాణ్ ఆమెతో మ‌రోసారి పులిహోర క‌ల‌ప‌డానికి ట్రై చేశాడు. టాస్క్ అయిపోయింది ఇప్పుడు అవ‌స‌రం లేదంటూ మ‌రోసారి అత‌డిని అవైడ్ చేసింది. ఆరోహి తనకు డబ్బులు ఇవ్వలేదనేంటూ గీతుఎమోషనల్ అయ్యింది. నీమీద ఒక ఎమోషన్ పెట్టుకున్నానని కానీ నువ్వువంద రూపాయ‌లు కూడా ఇవ్వకుండా త‌న‌ను మోసం చేశావంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నది. ఆ త‌ర్వాత సెల్ఫ్‌లెస్‌గా ఉన్నా కూడా అందరూ తనను మోసంచేశారంటూ మ‌రోసారి త‌న బాధ‌ను ఫైమాతో చెప్పుకుంటూ ఏడుస్తూ క‌నిపించింది.

అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య తమ లవ్ స్టోరీతో జనాలకు అట్రాక్ట్ చేస్తున్నారంటూ రోహిత్‌, మ‌రీనాల‌తో ఇనాయా చెబుతూ క‌నిపించింది. కానీ ఎలాంటి ల‌వ్ స్టోరీస్ లేక‌పోవ‌డం వ‌ల్ల రాజ్ డేంజర్ లో పడిపోతున్నాడంటూ పేర్కొన్నది. వంట చేస్తున్న స‌మ‌యంలో ఆరోహి త‌న‌కు హెల్ప్ చేయ‌క‌పోవ‌డంపై సూర్య కోపంగా క‌నిపించాడు. అత‌డి కోపం చూసి ఆరోహి తినకుండా అలిగి వెళ్లిపోవడంతో సూర్య కూడాతన ప్లేట్ ను డ‌స్ట్‌బిన్‌లో పడేసి వెళ్లిపోయాడు. ఆరోహికి సూర్య అన్నం తినిపించ‌డం, వారి అల‌క‌లు, కోపాలు చూస్తుంటే బిగ్‌బాస్ హౌజ్‌లో మ‌రో కొత్త ల‌వ్ స్టోరీ మొద‌లైన‌ట్లుగా అనిపిస్తోంది.

రేవంత్ ను ఒక్కడినే బిగ్‌బాస్‌ గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు. రేవంత్ భార్య సీమంతం వేడుకల తాలూకు వీడియోను బిగ్‌బాస్‌ అతడికి చూపించాడు. ఆ వీడియో చూస్తూ రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వీడియో చూడగానే క‌ప్‌ గెలిచినంత ఆనందంగా ఉందని రేవంత్ అన్నాడు.

కష్టపడి గెలిచి కప్పు తీసుకెళ్లి తనకు పుట్ట‌బోయే బిడ్డ‌కు గిఫ్ట్ గా ఇస్తానంటూ చెబుతూ క‌నిపించాడు. తనకు కూతురు పుడితే రేవన్విత అంటూ పేరు పెడతాననిఅన్నాడు.తన భార్య కోసం నా కనులే కలిశా అనే పాట పాడాడు.