Bigg Boss 6 Telugu Online Voting Results 9th Week: బిగ్ బాస్ 6 తెలుగు 9వ వారం ఆన్‌లైన్ ఓటింగ్ ఫలితాలు
Bigg Boss 6 Telugu Online Voting Results 9th Week: బిగ్ బాస్ 6 తెలుగు 9వ వారం ఆన్‌లైన్ ఓటింగ్‌లో ఎవరు ముందున్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారన్న ఆసక్తికర విషయాలు ఒకసారి చూద్దాం.
Bigg Boss 6 Telugu Online Voting Results 9th Week: బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభమైన ఈ రియాల్టీ షో 9వ వారానికి చేరింది. ఈ వీకెండ్ మరో కంటెస్టెంట్ హౌజ్‌ను వీడాల్సి ఉంది. 9వ వారం కూడా 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
వీళ్లలో ప్రేక్షకులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓటేస్తారు. అతి తక్కువ పబ్లిక్ ఓట్లు పొందిన కంటెస్టెంట్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారు. ఈసారి నామినేషన్ల లిస్ట్‌లో ఆదిత్య, ఫాయిమా, గీతు, ఇనాయా, కీర్తి, మెరీనా, రేవంత్, రోహిత్, శ్రీహాన్ ఉన్నారు. వీళ్లలో గురువారం (నవంబర్ 3) వరకూ చూసుకుంటే ఫాయిమా అతి తక్కువ ఓట్లు సాధించింది. ఇక రేవంత్ టాప్‌లో ఉన్నాడు.
రేవంత్‌కు ఇప్పటి వరకూ 13163 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం ఓట్లలో 21.73 శాతం రేవంత్ సాధించాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఇనాయా (8,289.. 13.68 శాతం), ఆదిత్య- (6972.. 11.51 శాతం), శ్రీ (5973.. 9.86 శాతం), కీర్తి (9.62%.. 5,828), గీతు (8.46%.. 5,128), రోహిత్ (8.38%.. 5,079), మెరీనా (8.38%.. 5,077), ఫాయిమా (8.38%.. 5,076) ఉన్నారు.
ఓట్లు ఎలా వేయాలో తెలుసా?
ఒకవేళ నామినేట్ అయిన వాళ్లలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఉంటే వాళ్లకు కేటాయించిన నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఓటు వేసి వాళ్లను కాపాడుకునే వీలుంటుంది. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో కంటెస్టెంట్‌కు గరిష్ఠంగా 10 మిస్డ్ కాల్స్ ఇవ్వొచ్చు. ఇక ఒకవేళ మీరు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ షో చూస్తుంటే.. ఈ యాప్ ద్వారా కూడా కంటెస్టెంట్లకు ఓటు వేయవచ్చు.
ఈ యాప్‌లో బిగ్ బాస్ తెలుగు షోలోకి వెళ్లి.. అక్కడున్న ఓటు బటన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు ఓటు వేయొచ్చు. ఒక్కరికే వేయొచ్చు లేదంటే ఆ ఓటును నామినేట్ అయిన వాళ్లందరికీ పంచే వీలు కూడా ఉంటుంది. సెలక్షన్ అయిపోయిన తర్వాత డన్ బటన్ నొక్కాలి. ఒక ఎపిసోడ్‌కు ఒక కంటెస్టెంట్‌కు గరిష్ఠంగా పది ఓట్లు వేయొచ్చు.