Bigg Boss 6 Telugu Final Trp Rating: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 చెత్త రికార్డును మూటగట్టుకున్నది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ సీజన్‌లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. రేవంత్‌తో పాటు శ్రీహాన్ ఫైనల్‌కు చేరుకున్నారు.
శ్రీహాన్ నలభై లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకొని పోటీ నుంచి తప్పుకోవడంతో రేవంత్ విన్నర్‌గా నిలిచాడు. ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు హీరోలు రవితేజ, నిఖిల్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. కాగా బిగ్‌బాస్ సీజన్ 6 ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో పూర్తిగా విఫలమైంది. కంటెస్టెంట్స్‌లో గేమ్ స్పిరిట్ లేకపోవడం, బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లలో ఆసక్తి లోపించడంతో సీజన్ మొత్తం ఆర్టిఫిషియల్‌గా సాగింది.
బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ కేవలం 8.17 మాత్రమే టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఇప్పటివరకు జరిగిన ఆరు సీజన్స్ ఫైనల్స్‌తో కంపేర్ చేస్తే ఇదే లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ కావడం గమనార్హం. అత్యధికంగా బిగ్‌బాస్ ఫోర్త్ సీజన్ 19.51 టీఆర్‌పీ రేటింగ్ సాధించగా...ఐదో సీజన్ ఫైనల్ 16.04 టీఆర్‌పీని సాధించింది. గత సీజన్‌లో సగం కూడా ఆదరణ సీజన్ 6 ఫైనల్‌కు దక్కకపోవడం గమనార్హం.
ఈ టీఆర్‌పీ రేటింగ్స్ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ సీజన్‌లో బిగ్‌బాస్ నిర్వహకులు భారీగా మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ సీజన్ 7కు నాగార్జున స్థానంలో కొత్త హోస్ట్ రాబోతున్నట్లు తెలిసింది. హోస్ట్ కోసం పలువురు స్టార్ హీరోల పేర్లను పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. హోస్ట్ ఎవరన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు కంటెస్టెంట్ సెలక్షన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.