Bigg Boss 6 Telugu Episode 21: అర్జున్ కళ్యాణ్, కీర్తిని నామినేట్ చేసిన నాగార్జున-bigg boss 6 telugu episode 21 highlights arjun kalyan and keerthy who will be eliminated this week
Telugu News  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Episode 21 Highlights Arjun Kalyan And Keerthy Who Will Be Eliminated This Week
అర్జున్ కళ్యాణ్
అర్జున్ కళ్యాణ్ (twitter)

Bigg Boss 6 Telugu Episode 21: అర్జున్ కళ్యాణ్, కీర్తిని నామినేట్ చేసిన నాగార్జున

25 September 2022, 8:29 ISTHT Telugu Desk
25 September 2022, 8:29 IST

Bigg Boss 6 Telugu Episode 21: ఈ వారం నామినేషన్స్ లో అర్జున్ కళ్యాణ్, కీర్తి నిలిచారు. వారిద్దరిని నేరుగా నామినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించాడు. బాలాదిత్య, చంటి, రాజశేఖర్, రోహిత్ మరీనా, సుదీప, వాసంతి, కీర్తి, అర్జున్ కళ్యాణ్ ఆటతీరుకు తక్కువ మార్కులు ఇచ్చాడు నాగార్జున

Bigg Boss 6 Telugu Episode 21: ఈ వారం అర్జున్ క‌ళ్యాణ్‌, కీర్తిభ‌ట్ ల‌లో ఒక‌రు బిగ్‌బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతార‌ని నాగార్జున ప్ర‌క‌టించాడు. గ‌త వారం సుదీప‌, బాలాదిత్య‌, రోహిత్‌-మ‌రీనా, వాసంతి, కీర్తి, శ్రీహాన్‌, శ్రీస‌త్య‌ల‌ను ఆట‌తీరు బాగాలేద‌ని వారికి మ‌రో అవ‌కాశం ఇస్తున్న‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించాడు. ఈ వారం కూడా మ‌ళ్లీ వారిని సోఫా వెనుక నిల్చోమ‌ని అన్నాడు. ఈ ఏడుగురి ఆటతీరు విషయంలో చాలా భ్ర‌మ‌లు ఉన్నాయని, ఇందులో శ్రీహాన్‌, శ్రీస‌త్య మాత్ర‌మే తమ గేమ్ ను మెరుగుప‌రుచుకున్నార‌ని నాగార్జున అన్నాడు. వారిని సోఫాలో కూర్చొమ‌ని చెప్పాడు.

బాలాదిత్యకు షాక్...

హౌజ్ మేట్స్ వారి కోసం చ‌ప్ప‌ట్లు కూడా కొట్ట‌రా అన‌గానే వెన‌కాల ఉండిపోయామనే షాక్ లో చప్పట్లు కొట్టలేదని బాలాదిత్య అన్నాడు. బాలాదిత్య మాట‌ల‌కు నీ ఆట‌చూసి మేము కూడా షాక్‌లో ఉండిపోయాం అని నాగార్జున చెప్పాడు. బాలాదిత్య మాట‌తీరుకు 10 మార్కులు, మ‌నిషితీరుకు 9, ఆట‌తీరుకుమాత్రం 3 మార్కులు ఇచ్చాడు నాగార్జున‌. త‌న ఆట‌తీరు బాగాలేకపోవడం పట్ల వివ‌ర‌ణ ఇచ్చాడు. కానీ దానికి నాగార్జునతో పాటు ఆడియెన్స్ కూడా కన్వీన్స్ కాలేదు.

చ‌క్క‌గా తయారవ్వడమే కాదు ఆటతీరు కూడా అలాగే ఉంటే బాగుంటుందని వాసంతితో చెప్పాడు నాగార్జున. , పిలిచిబొట్టుపెట్టి ఆడ‌మ‌ని ఎవ‌రూ చెప్ప‌ర‌ని, తనను ఎవరూ, ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అనుకుంటే సోఫా వెన‌కాలే ఉండిపోతావ‌ని వాసంతికి క్లాస్ ఇచ్చాడు. రోహిత్‌, మ‌రీనా ఆట‌తీరుకు ఐదు మార్కులు ఇచ్చాడు నాగార్జున. కీర్తి ఆట‌తీరుకు నాలుగు మార్కులు మాత్ర‌మే ఇచ్చాడు నాగార్జున‌. ప్ర‌తి విష‌యానికి ఏడ్వ‌డం క‌రెక్ట్ కాద‌ని ఆమెతో అన్నాడు.

సుదీపకు నాలుగు మార్కులు...

సుదీప ఆట‌తీరుకు 4 మార్కులు ఇచ్చాడు నాగార్జున‌. పోలీస్, దొంగ టాస్క్ లో అందరికంటే అతి తక్కువగా ఆమె వద్ద 800 వందలు ఉండటం పై నాగార్జున సీరియస్ అయ్యాడు. రేవంత్ విషయంలో మాట జారడం కరెక్ట్ కాదని చెప్పాడు. శ్రీసత్య, శ్రీహాన్ ఆటతీరు బాగుందని మెచ్చుకున్నాడు నాగార్జున.ఇద్దరికి చెరో 9 మార్కులు ఇచ్చాడు. పోలీస్, దొంగ టాస్క్ తో పాటు కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరు బాగా ఆడారని మెచ్చుకున్నాడు.

ఇనాయాను పిట్ట అనడం కరెక్ట్ కాదని శ్రీహాన్ తో చెప్పాడు. అలాగే మనుషులను అర్థం చేసుకోకపోతే ఎదుటివారు ఏం చెప్పిన తప్పుగానే అనిపిస్తుందని ఇనాయాకు కూడా క్లాస్ ఇచ్చారు. రేవంత్ ను ఆమె వాడు అన్న తర్వాత వచ్చిన గొడవ గురించి మాట్లాడారు నాగార్జున. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను చూపించాడు. ఇద్దరి ప్రవర్తనను మార్చుకోమని వార్నింగ్ ఇచ్చాడు.

గీతూకు పది మార్కులు..

గీతూ, ఆదిరెడ్డి ఆటతీరుకు పది మార్కులు ఇచ్చాడు. శ్రీహాన్, ఇనాయా మధ్య పిట్ట గొడవలో గీతూ మధ్యలో ఎందుకు తలదూర్చావని గీతూను అడిగాడు. దొబ్బెయ్ అంటూ పదే పదే అనడం కరెక్ట్ కాదని అలాంటి భాష వాడోద్దని అన్నాడు. అర్జున్ కళ్యాణ్ ఆటతీరుకు 5 మార్కులు ఇచ్చాడు నాగార్జున. అతడిని సోఫా వెనకాలకు వెళ్లిపోమని అన్నాడు. బంగారు కొబ్బరి బొండాం శ్రీసత్యకు ఎందుకు ఇచ్చావని, ఇద్దరి మధ్య ఏముందని అడిగాడు నాగార్జున.

రాజ్ ఆటతీరుకు 6 మార్కులు ఇచ్చాడు. మరీనాతో జరిగిన గొడవ గురించి నేహాను అడిగాడు. చెంప పగులగొట్టిందని అబద్దం చెప్పడంపై నేహా సారీ చెప్పింది. ఆరోహి ఆటతీరుకు 7 మార్కులు ఇచ్చాడు. ఫైమా ఆటతీరుకు 9 మార్కులు ఇచ్చాడు. రేవంత్ ఆమెపై ఎందుకు రివేంజ్ తీర్చుకుంటున్నాడో చెప్పమని ఫైమాను అడిగాడు నాగార్జున.

చంటికి వార్నింగ్...

చంటి మనిషితీరు, మాటతీరుకు 10 మార్కులు ఇచ్చిన నాగార్జున ఆటతీరుకు మాత్రం 5 మార్కులు మాత్రమే ఇచ్చాడు. ఇనాయా ఆటతీరుకు 9 మార్కులు ఇచ్చాడు.

అర్జున్ కళ్యాణ్, కీర్తి నామినేట్

సోఫా వెనకాల సుదీప‌, బాలాదిత్య‌, రోహిత్‌-మ‌రీనా, వాసంతి, కీర్తి, రాజ్, చంటి, అర్జున్ కళ్యాణ్ లలో ఇద్దరిని నేరుగా నామినేట్ చేస్తున్నానని నాగార్జున అన్నాడు. ఆ ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలో చెప్పమని కంటెస్టెంట్స్ ను అడిగాడు.

ఇందులో చంటికి ఒక ఓటు, రాజ్ కు నాలుగు ఓట్లు, అర్జున్ కళ్యాణ్ కు ఐదు ఓట్లు, బాలాదిత్యకు మూడు ఓట్లు, వాసంతికి 2 ఓట్లు, రోహిత్, మరీనాకు ఒక్క ఓటు, సుదీపకు మూడు, కీర్తి కి ఐదు ఓట్లు వచ్చాయి. అత్యధికంగా వచ్చిన అర్జున్ కళ్యాణ్, కీర్తిలను నామినేట్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. బిగ్ బాస్ కెరీర్ లో హోస్ట్ నామినేట్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పాడు.