Bigg Boss 6 Telugu 95 Episode: రేవంత్‌తో శ్రీహాన్ గొడవ - డార్క్ రూమ్‌లో ఆదిరెడ్డి
Bigg Boss 6 Telugu 95 Episode: ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను డార్క్ రూమ్‌లోకి పంపించి భయపెట్టాడు బిగ్‌బాస్. తప్పు చేసే ఒప్పుకునే ధైర్యం ఉండాలని రేవంత్‌తో శ్రీహాన్ గొడవపడ్డాడు.
Bigg Boss 6 Telugu 95 Episode: బిగ్‌బాస్ బుధవారం ఎపిసోడ్‌లో మరోసారి ఏకాభిప్రాయం టాపిక్‌ను తెరపైకి తీసుకొచ్చాడు బిగ్‌బాస్. ఐదో ఛాలెంజ్‌లో పోటీపడటానికి ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు ఏకాభిప్రాయంతో చెప్పాలని అన్నాడు. ఆదిరెడ్డి, రోహిత్ పేర్లను హౌజ్ మేట్స్ ఫైనల్ చేశారు. వీరికి మేజ్ బోర్డ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో చెప్పాలని బిగ్‌బాస్ మిగిలిన కంటెస్టెంట్స్‌ను ఆదేశించాడు. రోహిత్ పేరును శ్రీసత్య చెప్పగా మిగిలిన వారందరూ ఆదిరెడ్డి గెలుస్తాడని అన్నారు. చివరకు ఈ గేమ్‌లో ఆదిరెడ్డి విన్ అయ్యాడు. ఇంటి సభ్యులందరి మొత్తం 80 వేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో బిగ్‌బాస్ యాడ్ చేశారు. ఈ టాస్క్‌కు శ్రీహాన్ సంచాలక్‌గా వ్యవహరించాడు.
ట్రెండింగ్ వార్తలు
రేవంత్‌తో శ్రీహాన్ గొడవ...
పరమాన్నం విషయంలో రేవంత్, శ్రీహాన్ గొడవపడ్డారు. ప్రతి దాంట్లో బొక్కలు వెతకవొద్దు అంటూ రేవంత్ శ్రీహాన్‌పై ఫైర్ అయ్యాడు. తప్పు ఒప్పుకునే ధైర్యం రేవంత్‌కు లేదని శ్రీహాన్ గట్టిగానే బదులిచ్చాడు. మాట మార్చవద్దని చెప్పాడు. దాంతో తనది స్ల్పిట్ పర్సనాలిటీ అని ఒప్పుకున్నాడు రేవంత్.
వాల్ బ్రేకర్స్ ఛాలెంజ్...
ఆరవ ఛాలెంజ్‌లో కీర్తి , శ్రీహాన్ పోటీపడ్డారు. ఈ వాల్ బ్రేకర్స్ ఛాలెంజ్‌కు ఆదిరెడ్డి సంచాలక్‌గా వ్యవహరించాడు. ఈ టాస్క్‌లో శ్రీహాన్ విజేతగా నిలుస్తాడని హౌజ్‌మేట్స్ అందరూ చెప్పారు. అన్నట్లుగానే రేవంత్ విన్ అయ్యాడు. విన్నర్ గెలుచుకున్న రెండు లక్షలు బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలోయాడ్ అయ్యింది.
డార్క్ రూమ్ ఎఫెక్ట్...
ఆదిరెడ్డిని బిగ్‌బాస్ కన్ఫేషన్ రూమ్‌లోకి పిలిచాడు బిగ్‌బాస్. కానీ ఆ రూమ్ చీకటిగా ఉండటంతో అందులో అడుగుపెట్టడానికి ఆదిరెడ్డి భయపడ్డాడు. వరిగడ్డి, పాములు కనపించంతో జడుసుకున్నాడు. డార్క్ రూమ్‌లో ఉన్న క్యాండిల్ వెతకమని బిగ్‌బాస్ అతడికి చెప్పాడు. ఆదిరెడ్డికి తోడుగా శ్రీహాన్‌ను డార్క్ రూమ్‌కు వెళ్లమని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇద్దరు చాలా భయపడిపోయారు. క్యాండిల్‌తో పాటు గన్ దొరికిన తర్వాతే బయటకు వెళ్లమని చెప్పాడు.